నిప్పుతో కడిగేద్దామా..,భూమిలో పాతేద్దామా…యాసిడ్ లో ముంచేద్దామా ? ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి…అక్షరాలతో నేను(29-10-2017)


ముట్టుకుంటే కందిపోయే కుందనపు బొమ్మే..చదువుల్లో బంగారుతల్లి..ఆటపాటల్లో మేటి 
ఉదయమే అమ్మచేతి గోరుముద్ద,తిన్న బిడ్డ…సాయంత్రమయ్యేసరికి నడిరోడ్డు మీద హాహాకారాలు చేస్తూ రక్షించండి అని హృదయవిదారకంగా ఏడుస్తూ కన్నీరు కారుస్తూనే వుంది.మగమృగాల యాసిడ్ దాడిలో తడిసి అగ్నికీలల్లో భగ్గుమంది చిట్టితల్లి సున్నితమైన దేహం.
దీనికి బాధ్యులెవరు?
చేవచచ్చిన సమాజమా…నిర్లప్తమైన మనలోని భయమా…ఎవరెట్టాపోతే మనకెందుకు మనబిడ్డ బాగానే వుంది కాదననే నిస్తేజంగా స్వార్థమా?
మనోహరుల వికృతక్రీడలు..మృగోన్మాదుల పైశాచికచేష్టలు ..యాసిడ్ దాడుల్లో బలైన మహిళల వేదనలు …నింగినంటి వ్యవస్థను నిలదీసే ప్రశ్నలు.
ఆమె తన తండ్రి పుట్టినరోజు కోసం .బర్త్ డే కేక్..తమ్ముడి కోసం స్వీట్స్ డాడీ కోసం గిఫ్ట్..
వీటితోపాటు ఆమె విషాదాన్ని తీసుకువెళ్లబోతుందని తెలియదు…రోడ్డు పక్కన ఆటో ఎక్కుతున్నప్పుడు బైక్ మీద వచ్చిన మృగోన్మాదులు యాసిడ్ పోశారు.హృదయ విదారకంగా ఆ మహిళ అరిచిన అరుపులు ఈ సమాజాన్ని నిలదీస్తున్నాయి…?
ప్రేమించలేదని…వెంటపడేవాళ్లు..ఏ కారణం లేకుండా యాసిడ్ దాడి చేసేవాళ్ళు…ఎంచుకునే పైశాచిక మార్గం యాసిడ్ దాడి.
ఎవడిచ్చాడీ అధికారం వాడికి? 
అందాలరాణి కిరీటం పెట్టుకున్న సౌందర్యరాశిని యాసిడ్ దాడితో వికృతంగా మార్చే దాష్టీకానికి శిక్ష లేదా?
రోడ్డు మీద వెళ్లే మహిళకు భద్రత లేదా?
కాలేజీకి వెళ్లే ఆడకూతుళ్ళకు రక్షణ కరువా?
అక్షరాలన్నీ పదునుతేలి ఆయుధమై అలాంటి మృగాళ్లను తెగనరికితే …
ఏ యాసిడ్ తో అమ్మాయిల మీద దాడికి తెగబడ్డారో ఆ యాసిడ్ తో మృగాళ్లను తడిపేస్తే…అక్కడికక్కడే…అప్పుడే నడిరోడ్డు మీద శిక్ష అమలు చేస్తే…
చిన్నారి చిట్టితల్లుల రోదనలు వినిపించవు
కాలేజీకి వెళ్లిన ఆడపిల్లల గురించి తల్లిదండ్రులకు భయం ఉండదు.
యాసిడ్ దాడులులేని రోజైనా రావాలి..
యాసిడ్ దాడి చేసేవాడికి అదే యాసిడ్ తో శిక్ష అయినా విధించాలి.
నిప్పుతో కడిగేద్దామా..,భూమిలో పాతేద్దామా…యాసిడ్ లో ముంచేద్దామా ?
నా అక్షరాలు నన్నేప్రశ్నిస్తున్నాయి..నాకే తెలియని సమాధానాన్ని అస్త్రంగా సంధిస్తున్నాయి…సమాధానం ఏం చెబుదాం?

అక్షరాలతో ఈ ప్రయాణం కొనసాగుతుంది

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్

http://kinige.com/book/Guppedanta+Akasam

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY