ఈ ప్రశ్నకు ఏ గ్రూప్ సమాధానం చెప్పలేకపోయింది. నేను కూడా సమాధానం కోసం క్యూరియాస్ గా వెయిట్ చేస్తున్నాను…..స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (29-10-2017)

(గత సంచిక తరువాయి)
ప్రోగ్రాం డేట్ దగ్గర పడే కొద్దీ ప్రాక్టీస్ ఎక్కువ అయ్యింది.
అప్పటికే రెండు సార్లు దానవీర శూర కర్ణ సినిమా చూడ్డంతో యాక్టింగ్ పై పట్టు దొరికింది.
ఇంతలో స్పోర్ట్స్ డే అనౌన్స్ చేశారు.
రాబోయే ఆదివారం స్పోర్ట్స్ ఉంటుంది. డే ఫుల్ ప్రోగ్రామ్స్.
స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం కానీ స్కూల్ లో మాత్రం స్పోర్ట్స్ లో ఒక్క ప్రైజ్ కూడా రాలేదు. దాని కారణంగా స్పోర్ట్స్ లో పాల్గొనడం తగ్గించేశాను.
బాలవికాస్ పోటీలో పాల్గొనాలని ఆంటీ సజెస్ట్ చేయడంతో సరే అని రెడీ అయ్యాను.
ఆదివారం ఉదయం 10 గంటలు…
క్విజ్ పోటీలు. మా స్కూల్ లో అరేంజ్ చేశారు. వేరే గ్రౌప్స్ నుండి కూడా చాలా మంది వచ్చారు. పోటీ స్టార్ట్ అయ్యింది
ఒక్కో గ్రూప్ లో ఇద్దరు వ్యక్తులు. మొత్తం 5 గ్రూప్స్
ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యింది. ఒక్కో గ్రూప్ ను ఒక్కో ప్రశ్న అడుగుతున్నారు. ఆ గ్రూప్ లో ఆన్సర్ తెలియకపోతే మరో గ్రూప్ కి పాస్ చేస్తున్నారు. అలా మా గ్రూప్ కి అడిషనల్ గా 20 పాయింట్స్ వచ్చాయి.
మా వంతు రాగానే మాకో క్వశ్చన్
“సృష్టికి మూలం ఎవరు?”
“భగవంతుడు” అని సమాధానం చెప్పాను.
తప్పు అంటూ మరో గ్రూప్ కి పాస్ చేశారు.
ఈ ప్రశ్నకు ఏ గ్రూప్ సమాధానం చెప్పలేకపోయింది. నేను కూడా సమాధానం కోసం క్యూరియాస్ గా వెయిట్ చేస్తున్నాను.
“సర్వేశ్వరుడు సరియైన సమాధానం” అంటూ చెప్పారు.
భగవంతునికి, సర్వేశ్వరునికి తేడా ఏమిటో అర్థం కాలేదు. అదే విషయం అక్కడ అడిగాను. ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు కానీ భగవంతుడు తప్పు ఆన్సర్ అని చెప్పారు.
ఆ క్విజ్ పోటీ నాకెందుకో నచ్చలేదు. సమాధానం తెలియని వాళ్ళు క్విజ్ ఎలా కండక్ట్ చేస్తారో అర్థం కాలేదు. ఆ పోటీలో మేం సెకండ్ వచ్చాం. నాకెందుకో చాలా అవమానం అనిపించింది. అన్నీ సమాధానాలు తెలిసి అవకాశం రాక, క్విజ్ కంపిటిషన్ పెట్టే వారికి సరిగా తెలియక… మొత్తానికి కర్ణుని చావుకు పలు కారణాలు అన్నట్టు అనేక కారణాల వల్ల మేం ఫస్ట్ రాలేకపోయాం.
నాపై చాలా సేపు దాని ఎఫెక్ట్ పడింది. మద్యాహ్నం అన్నం కూడా తినకుండా అలిగి ఇంట్లో పడుకున్నాను.
హాలిడేస్ కావడం వల్ల మరుసటి రోజు డ్రాయింగ్ కాంపిటిషన్ పెట్టారు. అందరూ తలో డ్రాయింగ్ వేస్తున్నారు.
నాకు ఇచ్చిన డ్రాయింగ్ పాడ్ పై సాయిబాబా బొమ్మ ఉండడంతో ఆ బొమ్మనే చూస్తూ సాయిబాబా పుష్పక విమానంలో వెళుతున్నట్టుగా డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేశాను.
(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY