అప్పటికే నేనంటే నచ్చని మరో గ్రూప్ ఆంటీ (డ్రాయింగ్ పోటీలో నా బొమ్మను చెడగొట్టిన ఆవిడే) నేను జారి లైన్ టచ్ చేశానని… స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (12-11-2017)

మరుసటి ఆదివారం అవుట్ డోర్ గేమ్స్.
రన్నింగ్ రేస్ పోటీలు.. టీటీడీ వారి గ్రౌండ్ లో ఆరంజ్ చేశారు. చక్కగా నీళ్ళు జల్లి సున్నం పొడితో లైన్స్ వేసి ఉన్నాయి.
ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయని చెప్పారు.
పోటీలకు చెప్పిన టైం కన్నా ముందుగానే వచ్చేశాం. సరిగ్గా 9 గంటలకు పోటీ మొదలుపెట్టారు. రన్నింగ్ రేస్ కావడంతో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. పోటీకి కొద్దిమందే రావడంతో ఒక రౌండ్ లోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ డిసైడ్ చేయాలని ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ఆ పోటీలకు మా ఆంటీ కూడా వచ్చారు.
టైం కావడంతో మా బ్యాచ్ ను పోటీకు పిలిచారు…
అందరం లైన్ లో నిలబడ్డం. వన్ టు త్రీ అనగానే పరిగెత్తడం స్టార్ట్ చేశాం. పోటీలో 50 వెళ్లి అక్కడ ఉన్న లైన్ టచ్ చేసి తిరిగి రావాలి. నేను అందరికన్నా ఫాస్ట్ గా వెళ్లి లైన్ టచ్ చేయడానికి ఈజీగా కాలుని జార్చి లైన్ టచ్ చేసి రిటర్న్ అయ్యాను.
ఆ టెక్నిక్ తెలియక మిగిలిన పిల్లలు వెనుక పడ్డారు. నేను అందరికన్నా ముందుగా ఫినిష్ చేశాను.
అప్పటికే నేనంటే నచ్చని మరో గ్రూప్ ఆంటీ (డ్రాయింగ్ పోటీలో నా బొమ్మను చెడగొట్టిన ఆవిడే) నేను జారి లైన్ టచ్ చేశానని, అది చెల్లదని పోటీలు కండక్ట్ చేసేవారితో గొడవకు దిగింది. అందుకు కారణం ఉంది. ఆవిడ గ్రూప్ లోని పిల్లలు కూడా ఆ పోటీలో ఉన్నారు. వాళ్ళు నా కన్నా వెనుక రావడంతో ఆవిడకు అవమానం జరిగినట్టు ఫీల్ అయ్యింది.
వాదోపవాదాల తరువాత పోటీని మరోసారి పెట్టాలని నిర్ణయించారు.
రెండో సారి కూడా నేనే ఫస్ట్ రావడంతో ఆవిడ తిరిగి వాదించడం స్టార్ట్ చేశారు. రెండో సారి పోటీలో నేను డెడ్ లైన్ తొక్కలేదంటూ అడ్డంగా వాదించింది. అక్కడ ఉన్న జడ్జీలు నేను డెడ్ లైన్ తొక్కాను అంటూ చెప్పినా ఆవిడ వినలేదు.
మూడోసారి పోటీకి అరేంజ్ చేశారు. నాకు తిక్కరేగి, నేను పోటీలో పాల్గొనను అంటూ ఆంటీకి చెప్పేసి వెళ్లి దూరంగా కూర్చున్నాను. అప్పటికే రెండు సార్లు పరిగెట్టడంతో ఆయాసం వస్తోంది. ఉన్న శక్తి హరించుకుపాయింది. ఇక అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదు.
పైగా పైన ఎండ వాయగోడుతోంది. దాహంతో నోరు ఎండిపోతోంది. ఆంటీకి నా పరిస్థితి అర్థం అయ్యింది. అక్కడ జరుగుతున్న మోసం కూడా అర్థం అయ్యింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.
స్వార్థం, కుళ్ళు పేరుకుపోయిన ఈ సాయిబాబా గ్రూప్స్ లో సమానత్వం, ప్రేమ, దయాగుణాలు ఎక్కడ ఉంటాయో టార్చ్ లైట్ వేసినా కనపడవని తెలిసింది.
ప్రేమైక స్వరూపులారా అన్న సాయిబాబా మాటలకు అర్థం మరొకటి ఉందని తెలిసింది. మా పిల్లలే ప్రేమైక స్వరూపులు… మిగిలిన గ్రూప్ పిల్లలకు అది వర్తించదు.
బాలవికాస్ పేరుతో సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోడానికి, దాని ద్వారా కావలసిన పనులు చేసుకోవడానికి మాత్రమే ఈ ముసుగు అన్న విషయం క్లియర్ గా అర్థం అయ్యింది.
ఆంటీ నన్ను రిక్వెస్ట్ చేయడంతో ఇక తప్పదన్నట్టు మూడోసారి పోటీలో పాల్గొన్నాను. ఒక్కసారి ఇంట్రెస్ట్ పోవడంతో ఏదో మొక్కుబడిగా పాల్గొనడంతో సెకండ్ వచ్చాను. గొడవపడిన ఆవిడ పిల్లవాడు ఫస్ట్ వచ్చాడు.
అప్పటికిగానీ ఆవిడ శాంతించలేదు. ఆ ఆనందం చూస్తే నాకు అసహ్యం వేసింది. ఆంటీ నా కళ్ళలోకి చూడలేక దూరంగా వెళ్ళిపోయింది.

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY