కలిసి విడిపోదామా?కొట్టుకుంటూ కలిసుందామా?? సహజీవనమా..అసహజ పరిణామమా? ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి అక్షరాలతో నేను (26-11-2017)

డేటింగ్ టాపిక్ మీద మీ అభిప్రాయాలు పంపించవచ్చు…చీఫ్ ఎడిటర్

రోహన్ ప్రియాంక (పేర్లు మార్చబడినవి) ఇద్దరూ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు.మంచి శాలరీ…వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు.ఒకరికొకరు నచ్చారు…కానీ ఇక్కడ మనసు ఇచ్చిపుచ్చుకోవడాలు…ప్రేమించుకోవడాలు ..పెళ్లి చేసుకోవడాలు లేవు…
కానీ క…లి…సే…వుం…టు…న్నా…రు…
ఈ బంధానికి వారి అనుబంధానికి..వారుపెట్టుకున్న సంబంధానికి పెట్టుకున్న పేరు.సహజీవనం..డే…టిం…గ్
కొన్నాళ్ల తర్వాత మనస్పర్థల విడిపోయారు…కానీ ఈ మధ్యకాలంలో వారి సహజీవనానికి గుర్తుగా మిగిలిన బిడ్డ ప్రియాంక దగ్గర ఉండాలా?రోహన్ దగ్గర ఉండాలా ?అన్నదే సమస్య అయ్యింది…ముఖ్యంగా ప్రియాంకకు…తానిప్పడు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? డేటింగ్ మరొకరితో కొనసాగించాలా?సింగల్ పేరెంట్ గా ఉండాలా? అన్న డైలమా
***
ఈ కల్చర్ ఎక్కడ పుట్టింది?ఎవరు మొదలుపెట్టారు…లాంటి చరిత్ర కాదు ముఖ్యం..,
ఈ సహజీవనం సప్తపదికి సమానమా? మన వివాహవ్యవస్థకు ప్రామాణికమా? ఈ సంబంధం కలకాలం నిలుస్తుందా?సమాజం హర్షిస్తుందా?ముందుతరాల చరిత్రలో ఇదే ఒక ఒరవడిగా కొనసాగుతుందా?
ఒకప్పుడు ఉమ్మడికుటుంబాలుగా వాసికెక్కిన మన సంస్కృతీ సాంప్రదాయాలు కాలక్రమేణా రూపాంతరం చెందుతూ చిన్నకుటుంబాలు ఒంటరికుటుంబాలుగా మిగిలిపోతున్నాయి…
అది కూడా మార్పు చెందుతూ “సహజీవనం”(డేటింగ్ ) మొదలయింది..
మనదేశంలో ప్రవేశించి నగరాలలో తన ఉనికిని చాటుకుంటూ యువతీయువకులకు అలవాటు అయిన నూతనసంస్కృతి.. అన్ని వస్తువులనూ అలవాట్లను అనేకపోకడలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న యువతరం కొత్తపోకడను తమ జీవితాలలోకి డేటింగ్ పేరుతో దిగుమతి చేసుకుంది..
అపరిచితులైన అమ్మాయి అబ్బాయిలు పెళ్లితో కాకుండా కలిసి జీవించడం సరియైనదేనా? ఒకవేళ అలా కలిసుంటే ఆ రెండు మనసుల మధ్య ఆ ఇద్దరు మనుషుల మధ్య భావాలు బంధాలు ఎలా ఉంటాయి??
ఎన్నో వేల వందల సంవత్సరాలుగా మనదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా నడుస్తున్న మనసులు కొత్తసంస్కృతిని జీర్ణించుకోగలవా..
సెలెబ్రిటీలు మాత్రమే వార్తల్లో నిలుస్తున్నారు…పెళ్ళికాకుండా కలిసివున్న సందర్భాలు పూర్వం వున్నా దానికి డేటింగ్ అనే పేరు ఇప్పుడు నిఘంటువులో పుట్టుకొచ్చింది.
ప్రతీదానిలో కాలచక్రంలో వచ్చే మార్పుల్లో మంచీ చెడులు ఉంటాయి.
ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి,నచ్చకపోతే విడిపోవడానికి డేటింగ్ ఒక రెడ్ కార్పెట్ అయ్యింది.
మొగుడూ పెళ్ళాలు పెళ్లయ్యాక డివోర్స్ పేరుతో విడిపోతున్నారు..అలాంటి జంఝాటం లేకుండా ఒకే గదిలో ఒకే కప్పుకింద కలిసింది విడిపోవడం నయాపోకడ,
చదువుకున్నవారు ప్రపంచపోకడ మంచీచెడులు తెలిసినవారే కాదు..డేటింగ్ వాళ్ళ ఎదురయే పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
డేటింగ్ ద్వారా తల్లిదండ్రులు అయితే ఆ పిల్లల భవిష్యత్తుకు పూర్తి పూచీ ,సమాజం నుంచి ఎదురయ్యే సమస్యలు పేస్ చేయగలగాలి.
డేటింగ్ ద్వారా కలిసి విడిపోయాక మరోతోడు దొరికినప్పుడు అవతల భాగస్వామి విశాల దృక్పథంతో ఆలోచించగలగాలి
డేటింగ్ గురించి సమగ్ర చర్చ కన్నా డేటింగ్ చేసుకునే వ్యక్తులు అన్నివైపులా అలోచించి తీసుకునే నిర్ణయాలే వారి భవిష్యత్తును తీర్చిదిద్దగలవు.
ఇది ఎవరికివారు ఈసుకోవాలిసిన నిర్ణయం
కాకపోతే డేటింగ్ ద్వారా హ్యాపీ గ వున్నా వాళ్ళు కానీ..విడిపోయి ఈ సంకృతి వల్ల నష్టపోయినవాళ్లు కానీ తమ అనుభవాలనుపుస్తకరూపంలో తీసుకువస్తే (విదేశాల్లో సెలెబ్రెటీలు ఈపని చేస్తున్నారు) డేటింగ్ చేసేవాళ్లకు చేయాలనుకునే వాళ్లకు ఒక ఐడియా వస్తుందేమో…
కొన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది.

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.

గుప్పెడంత ఆకాశం లింక్

http://kinige.com/book/Guppedanta+Akasam

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY