నన్ను మాత్రం ఆ రూమ్ లోకి రాకుండా కట్టడి చేశారు. మనం చేసే కోతి పనులతో మా జూనియర్స్ డాన్స్ ప్రాక్టీస్ మానేసి…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (26-11-2017)

(గత సంచిక తరువాయి)
ఈశ్వరాంబ డే కు రెండు రోజులు ముందు…
హాలిడేస్ కావడంతో అందరూ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే అందరూ మీటింగ్ పెట్టాం.
నా డ్రామాతో పాటు మా జూనియర్స్ డాన్స్ ప్రోగ్రాం పెట్టారు. ట్రేడిషినల్ డాన్స్ కావడంతో అందరూ సాంప్రదాయ దుస్తులు వేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు.
నన్ను మాత్రం ఆ రూమ్ లోకి రాకుండా కట్టడి చేశారు. మనం చేసే కోతి పనులతో మా జూనియర్స్ డాన్స్ ప్రాక్టీస్ మానేసి నన్నే చూడడం లేక నాతొ టైం స్పెండ్ చేయడం వంటివి చేస్తూ ఉండడంతో ఆంటీకి తిక్కరేగి నన్ను ఆ రూమ్ లోకి బాన్ చేసింది.
అయినా మనం ఏ మాత్రం తగ్గకుండా ఏ కిటికీలో నుండో లేక బ్యాక్ డోర్ నుండో వాళ్లను కామెంట్ చేయడం, ఆంటీ నన్ను చూసి తరుముకోవడం సాదారణంగా జరిగే ప్రక్రియలా తయారైంది.
పిల్లలు డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను కూడా నా డ్రామాను ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాను.
ఆంటీ లంచ్, స్నాక్స్ అరేంజ్ చేస్తున్నారు. పొద్దున్న ఇంటి నుండి బయటపడితే ఇక రాత్రే ఇంటికి వెళ్ళడం.
మా ఇంట్లో నన్ను నమ్మి నాకు ఆ మాత్రం స్వేచ్చ ఇవ్వడం నిజంగా నా అదృష్తం. లోకం తీరు మనుషుల ప్రవర్తన చాలా దగ్గర నుండి చూసే అవకాశం కలిగింది.
ముందుగా జరిగిన స్పోర్ట్స్ లో నాకు దాదాపు పది ప్రైజులు వచ్చాయి. ఎప్పటినుండో పోటీలో పాల్గొంటున్నా ఒక్కసారి కూడా ప్రైజ్ రాని నాకు బాల వికాస్ లో అన్ని ప్రైజులు రావడం ఒక రకంగా సంతోషాన్ని కలగజేసినా సాయిబాబా పై నాకున్న అపనమ్మకం వల్ల ఎందుకో ఒక రకంగా అనిపించింది.
కేవలం మా జూనియర్స్ వెళుతున్నారని నేను వెళ్ళడం, మంచి మాటలు, కధలు చెపుతున్నారని కంటిన్యూ చేయడం, ఆంటీ వాళ్ళతో మంచి పరిచయం ఉండడం వల్ల బాలవికాస్ క్లాసెస్ కి వెళ్ళడం జరుగుతోంది కాని మనస్పూర్తిగా భక్తితో భయంతో వెళ్ళడం లేదు.
ప్రోగ్రాం ముందురోజు స్కూల్ కి వెళ్లి అక్కడ ఏర్పాట్లు చూడాలని ఆంటీ వెళ్ళారు. ఆ విషయం తెలిసి నేను మా జూనియర్ గ్యాంగ్ కూడా స్కూల్ కి వెళ్లాం.
సాయంత్రం కావడంతో లైట్స్ వేసి స్టేజ్ డెకరేట్ చేస్తున్నారు. షామియానాలు వేసే వాళ్ళు వాళ్ళ పని స్టార్ట్ చేశారు.
చైర్స్ అరేంజ్ చేయడం స్టార్ట్ అయ్యింది. మేము వెళ్లి ఆంటీని కలిశాం.
సమయానికి వచ్చారంటూ మాకు కూడా చైర్స్ అరేంజ్ చేసే పని అప్పగించారు.
రాత్రి 8 వరకు అక్కడే గడిపి వెళ్లి ఆంటీని కలిశాం.
పొద్దున్నే ఇంటికి వచ్చేయమంటూ మాకు స్నాక్స్ ఇచ్చి బాయ్ చెప్పారు

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY