అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు. సెల్ కాదు కదా ల్యాండ్ ఫోన్ సైతం ఒక స్టేటస్ లా ఉండేది. …స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (03-11-2017)

ఆదివారం…
ప్రోగ్రాం ఆ రోజే కావడంతో నేను తొందరగానే నిద్ర లేచాను. పొద్దున్నే ప్రదీపన్న మా ఇంటికి వచ్చాడు. అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు. సెల్ కాదు కదా ల్యాండ్ ఫోన్ సైతం ఒక స్టేటస్ లా ఉండేది. 
మధ్యాహ్నం లంచ్ చేసి ఇంట్లోనే ఉండమని ఎక్కడకూ వెళ్లొద్దని చెప్పడానికి వచ్చాడు.
సాదారణంగా సండే అంటే క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళేవాణ్ని. ఆ రోజు మా క్రికెట్ ఆడడానికి వచ్చిన మా ఫ్రెండ్స్ ను నేను రావడం లేదని చెప్పి పంపేశాను.
పొద్దున్న టిఫిన్ తిన్నప్పటినుండి మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని ఎదురుచూడడం స్టార్ట్ అయ్యింది.
టీవీలో దూరదర్శన్ ప్రోగ్రామ్స్ వస్తున్నా మైండ్ మాత్రం ఆవైపు మరలలేదు.
అప్పట్లో మహాభారతం ఉదయం 9 గంటలకు ప్రసారం అయ్యేది. ఆ రోజే యాదృచ్చికంగా దుర్యోధనుని మయసభ సీన్ వస్తోంది. ఆ సీన్ మనకేదన్నా ఉపయోగపడుతుందేమో అన్నట్టు నా కాన్సంట్రేషన్ ఆవైపు మళ్ళించాను.
దానవీరశూరకర్ణ కు హిందీ మహాభారతానికి అస్సలు పోలికే లేదు. మన సుదీర్ఘ సమాసాలతో డైలాగ్స్ ఉత్తేజం కలిగించే సీన్స్ తో పోల్చుకుంటే ఇది చప్పగా ఉంది. మరి కాసేపు చూస్తే నేను నేర్చుకున్న యాక్షన్ మర్చిపోతానేమో అన్న ఫీలింగ్ కలిగింది.
వెంటనే టీవీ ముందు నుండి దూరంగా జరిగాను.
టైం 11 అయ్యింది.
మహాభారతం ప్రోగ్రాం అయ్యి మరో ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది.
11.30 కు ప్రదీపన్న వచ్చేశాడు. మధ్యాహ్నం వస్తాను అన్న వ్యక్తీ 11.30 కి రావడం ఆశ్చర్యం కలిగింది.
లంచ్ కి ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు.
అప్పటికే ఆకలి పరుగులు తీస్తోంది. మంచి లంచ్ చేద్దామనుకున్న నాకు నిరాశ ఎదురైంది.
ఎక్కువ తింటే మద్యాహ్నం ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న ఫీలింగ్ తో లంచ్ తక్కువగా తినమంది.
అర్థ ఆకలితో ఏదో తిన్నాం అనిపించి పైకి లేచాను. అప్పటికే మా జూనియర్ బ్యాచ్ ఆంటీ ఇంటికి వచ్చేశారు.
అందరూ లంచ్ చేసి ఉండడం వల్ల ప్రోగ్రాం కోసం రెడీ అవుతున్నారు. ప్రదీపన్న నన్ను బయలుదేరమని తొందరచేశాడు.
జూనియర్స్ తో పాటు నేను కూడా బయలుదేరాను. ప్రదీపన్న నన్ను టూ వీలర్ ఎక్కమన్నాడు. నాకు అర్థం కాలేదు.
మనం స్కూల్ కి పోవడం లేదా అని అడిగాను.
లేదంటూ నవ్వాడు. ఇక తప్పదు  అన్నట్టు బండిలో అన్న వెనుక కూర్చున్నాను.
(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY