ఓటమి (ఫెయిల్యూర్ ) అంటే ఓడిపోవడం కాదు.. అదొక గెలుపుపాఠం.. ,ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి “అక్షరాలతో నేను” (10 -12 -2017 )

ఓటమి ఎదురైనప్పుడే గెలుపువిలువ అవగతమవుతుంది.. ఓటమి చెప్పిన గెలుపుపాఠం బాగా బోధపడుతుంది.. ఫెయిల్యూర్ ని నెగిటివ్ గా తీసుకుంటే మళ్లీ మళ్లీ ఫెయిల్యూర్స్ పలకరిస్తూనే ఉంటాయి.. పాజిటివ్ గా తీసుకుంటే అవే మనచుట్టూ రక్షణవలయంలా ఏర్పడి గెలుపుబాటకు దారి తీస్తాయి.. ఓటమికి భయపడినంత కాలం గెలుపును స్వాగతించే స్పష్టత ఉండదు.. ఓటమిని గెలవాలంటే ముందుగా వైఫల్యాన్ని గుర్తించాలి
వైఫల్యాన్ని గుర్తించాలంటే మీలోని శక్తులను గుర్తించాలి…నిజాయితీని ఆశయించాలి..ఎక్కడ ఏ తప్పు జరిగిందో..ఎందుకు ఓటమిపాలు అయ్యామో అన్న విషయాన్నీ విశ్లేషించుకోవాలి.
చరిత్రలో విజేతలుగా నిలిచిన వాళ్ళు ఓటమిని చవిచూసినవాళ్ళే .పడిలేచే కదలితరంగం కాదా మనకు ఆదర్శం…మళ్ళీ మళ్ళీ దూసుకువస్తూనే ఉంటుంది.
ఓటమి (ఫెయిల్యూర్ ) అంటే ఓడిపోవడం కాదు.. అదొక గెలుపుపాఠం..
గెలుపు రహస్యం అనేది గెలుపుకి వన్నె తెచ్చే మాట కాదు..గెలుపు వెనుక రహస్యాలు ఉండవు.. వైఫల్యాలు మాత్రమే ఉంటాయి.. ఏ విజేత చరిత్రను తరచి చూసినా ఎన్నో వైఫల్యాల అనంతరమే గెలవడం ఉంటుంది.. ఓటమిని తిరస్కరించకుండా యదాతథంగా స్వీకరించే గుణం అలవరుచుకుంటే గెలుపు సుగమం అవుతుంది..
గెలుపన్నది లేని గుణాలను ఆపాదించి ప్రపంచానికి భూతద్దంలో చూపుతుంది.. ఓటమి అలా కాదు ఆకాశం నుండి నేల మీద నిలబెడుతుంది..మనమేమిటో మనకు తెలియచేస్తుంది..
మార్కులు రాలేదనో ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలకు ప్రయత్నించే పిల్లలకు ఓటమిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించాల్సిన బాధ్యత కన్నవారిదే.. ఆ పాఠం ఇంజనీరింగ్ చదువులకో మెడిసిన్ ర్యాంకులకో పరిమితం కాదు.. జీవితాంతం నీడలా ఉంటుంది..ఓటమి వెక్కిరించిన ప్రతిసారీ రక్షణకవచమై నిలుస్తుంది..
వర్షం మొదలుకాగానే పక్షులన్నీ ఓటమిని అంగీకరించి చెల్లాచెదరైపోతాయి..
కానీ గద్ద మాత్రం తుఫానును కుండపోతను లెక్కచేయకుండా మేఘాలపైన ఎగురుతుంది.. భీకరమైన తుఫాన్లు కూడా ఏమీ చేయలేనంత ఎత్తులో పయనిస్తుంది..
అదే సంకల్పబలం అవరోధాల్ని ఎదుర్కొంటూ గెలుపు వైపు పయనం..
ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు వైఫల్యం కాదు.. అదొక “ఫీడ్ బ్యాక్ “

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.

గుప్పెడంత ఆకాశం లింక్

http://kinige.com/book/Guppedanta+Akasam

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY