నేను సంశయంతో మెల్లగా అద్దం దగ్గరకు నడిచాను. ఆయన నా వెనుకనే వచ్చి…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (17-12-2017)

(గత సంచిక తరువాయి)

మేకప్ మాన్ నాకు మేకప్ వేయడం స్టార్ట్ చేశాడు. ఎండకు మొహం అంతా జిడ్డు జిడ్డుగా ఉంది. బాత్ రూమ్ కి వెళ్లి మొహం కడుక్కుని రమ్మని చెప్పాడు. ఫ్రెష్ అయ్యి రాగానే ఆయన ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చోమన్నాడు.
ఆయన కూర్చున్న చైర్ కు ఎదురుగా నన్ను కూర్చోమన్నాడు. నేను బుద్దిగా ఆయన చెప్పిన చోట చైర్ లో కూర్చున్నాను.
నా పేస్ కి ఏదో క్రీం అప్లై చేశాడు. చల్లగా ఉన్నా ఏదో మంచి వాసన వచ్చింది.
ఇక రెండు మూడు రంగులు కలిపి పేస్ కి అప్లై చేశాడు.
తరువాత తన వెనుక నున్న ర్యాక్ నుండి ఒక బాక్స్ తీశాడు. పెట్టె ఓపెన్ చెయ్యగానే అందులో రకరకాల మీసాలు ఉన్నాయి. అందులో నుండి నాకు సెట్ అయ్యే మీసం బయటకు తీశాడు.
దాదాపు గంట సమయం గడిచింది.
నాకు సరిపడా విగ్గు, డ్రెస్ మొత్తం సెట్ చేశాడు. లేచి వెళ్లి అద్దంలో నన్ను చూసుకోమన్నాడు. నేను సంశయంతో మెల్లగా అద్దం దగ్గరకు నడిచాను. ఆయన నా వెనుకనే వచ్చి చేతిలో గద పెట్టాడు.
ఆ గద ముట్టుకోగానే ఏదో తెలియని శక్తి వచ్చినట్టు అయ్యింది. ఆ డ్రెస్ ఆ గద ఎంతమంది మహామహులు వాడారో అని తలచుకోగానే నా శరీరం పులకించింది.
గద భుజంపై పెట్టుకుని ఎన్టీఆర్ లా ఫీల్ అయ్యాను. స్కూల్ డేస్ నేను బక్కగా ఉండడం వల్ల ఎన్టీఆర్ లా ఫీల్ అయినా ఆ ఆకారం లేకపోవడంతో నాకే సిగ్గేసింది.
ఇంతలో ప్రదీపన్న నన్ను వదిలి క్రిందకు వెళ్ళాడు.
నాకు వేసిన డ్రెస్ చాలా హెవీగా ఉంది. పైగా ఎండాకాలంలా ఎండ మండిపోతోంది. నన్ను వదిలిపెట్టి అన్న అలా వెళ్ళడం ఎక్కడికో ఎందుకో అన్న డౌట్ లో అక్కడే చైర్ లో కూర్చున్నాను.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY