ఎవరూ చేయలేనిది నేను చేయాలి. అందరూ వెళ్ళే దారి నాకెందుకో నచ్చదు…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (31-12-2017)

గతసంచిక తరువాయి
నన్ను ఆంటీ ఎవరికీ కనపడకుండా ఒక రూమ్ లో పెట్టారు. అప్పటికే ఆకలి బాగా వేస్తోంది. దుర్యోధనుడి గెటప్ కి మీసాలు పెట్టడంతో తినలేని పరిస్థితి. ఏదన్నా తినాలన్నా లేక తాగాలన్నా భయం. పొరపాటున మీసాలు ఊడిపోతే అతికించడానికి మేకప్ మాన్ లేడు. పైగా మీసాలు లేకుండా యాక్టింగ్ అంటే పరమ చండాలంగా ఉంటుంది.
తినకపొతే నీరసం వస్తుంది. ఆ రోజు ప్రోగ్రాం లిస్టులో నా ప్రోగ్రాం నెంబర్ ఎక్కడో తెలియదు. ఎప్పుడు పిలుస్తారో అది కూడా తెలియదు.
నా పక్క రూమ్ లో జూనియర్స్ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ మేకప్ చేసుకుంటున్నారు. పైగా వాళ్ళ మేకప్ ఈజీ. నా పరిస్థితి చూస్తుంటే నాకే బాధగా ఉంది. డ్రామాలు ఇలా కూడా వేస్తారా… మరీ అంత అవసరమా అన్న స్టేజ్ కి వచ్చేసింది. అయినా ఏదో మొండిధైర్యం..
ఎవరూ చేయలేనిది నేను చేయాలి. అందరూ వెళ్ళే దారి నాకెందుకో నచ్చదు.
నేను ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడే నాకు శాటిస్ ఫాక్షన్ ఉంటుంది.
కాసేపటి తరువాత ప్రదీపన్న రూమ్ లోనికి వచ్చాడు. చేతిలో థమ్స్ అప్ బాటిల్ ఉంది. అది చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. అప్పటికే ఎండకు నోరు ఎండిపోయి ఉంది. నీళ్ళు తాగడం వల్ల ప్రయోజనం ఏమీ కనపడ్డం లేదు. కానీ థమ్స్ అప్ తాగడం ఎలా? ఆ ఆలోచన రాగానే అప్పటిదాకా ఉన్న ఉత్సాహం ఒక్కసారిగా చల్లారిపోయింది.
ప్రదీపన్నకు నా ప్రాబ్లం అర్థం అయినట్టు ఉంది. బాటిల్ తో పాటు స్ట్రా కూడా పట్టుకొచ్చాడు…
ఇక నన్ను ఆపడం ఎవరి తరం కాలేదు. చేతిలో ఉన్న గద పక్కన పెట్టి అమాంతం అన్న చేతిలో ఉన్న బాటిల్ తీసుకుని తాగేశాను. అప్పటికిగానీ నా దాహం తీరలేదు.
ఇంతలో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందన్న అనౌన్స్ మెంట్ వినిపించింది.
ప్రదీపన్న నా చేతిలోని బాటిల్ తీసుకుని బయటకు వెళ్ళాడు. ఇంతలో ఆంటీ రూమ్ లోనికి వచ్చింది. ఆంటీతో పాటు మరికొంత మంది నన్ను చూడ్డానికి వచ్చారు.
అందులో అందమైన అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతుంటే నాకు ఎందుకో చాలా ఇబ్బందిగా ఉంది. ఆంటీ ఏదో అడుగుతున్నారు నేను ఏదో సమాధానం చెపుతున్నాను.
ఆంటీకి నా పరిస్థితి అర్థం అయ్యి అందరిని బయటకు తీసుకు వెళ్ళింది.
ఈ మధ్యలో మా జూనియర్ బ్యాచ్ వచ్చి నన్ను చూసి వెళ్ళారు. నేను అందరికి వింతగా కొత్తగా ఉన్నట్టు ఫాల్ అవుతున్నారు అనిపించిది.
ఆంటీకి ప్రదీపన్నకు నాపై హై ఎక్స్పెక్ట్ ఉంది. దానిలో ఏదైనా తేడా వస్తే నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కాకుండా ఉంది.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY