ఆమెకు కనిపించింది…అతను చనిపోయాడు …హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ..ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి ఘోస్ట్ స్టోరీస్(14-01-2018)

దెయ్యం భయం కవలలు…కొన్ని సంఘటనలకు లాజిక్ దొరక్కపోవచ్చు…మరికొన్ని సంఘటనలు నమ్మశక్యంగా అనిపించపోవచ్చు…హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ఈ ఘోస్ట్ స్టోరీస్..మీ అనుభవాలు..మీకు తెలిసిన విషయాలు ఈ సీరియల్ నేపథ్యంలో తెలియజేయవచ్చు …చీఫ్ ఎడిటర్
కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆధారంగా…రచయిత్రి

  (1)
అది మండువేసవి కాలం. వేసవి ఉక్కపోతను భరించలేక అందరూ ఆరుబయట నిద్రిస్తున్నారు.చీకటి నల్లదుప్పటి కప్పుకుని అందరినీ భయపెడుతున్నట్టుగా ఉంది. నింగిలో నక్షత్రాలు మినుకు మినుకు మనడం తప్ప మరే కాంతీ కనిపించని చీకటిరాత్రి లో తల్లి పక్కనే పడుకున్న సుకన్యకు వచ్చిన కలతో మెలకువ వచ్చింది.అలారం కోసం పెట్టుకున్న రేడియం వాచీలో సమయం అర్దరాత్రి 12.30 చూపిస్తోంది.
సుకన్యకు తనకు వచ్చిన కల గుర్తుకు రాగానే ఒక్కక్షణం ఒళ్లు జలదరించింది. ఇక నిద్ర పట్టక అటూఇటూ పచార్లు చేస్తూ తన భర్త ఆగడాలను అరాచకాలను తలుచుకుంటూ మధనపడసాగింది ప్రసవానికి పుట్టింటికొచ్చిన సుకన్య
చీకటి నిశ్శబ్దంలో దూరంగా వినిపిస్తున్న నక్కల ఊళలతో కలిసి సుకన్య ఆలోచనలు సాగుతున్నాయి. ఆలోచనల నుంచి తేరుకుని అటూ ఇటూ పరికించిన సుకన్యకు భీతావహమైన చీకటి వాతావరణం భయానకంగా అనిపించింది.
ప్రకృతికి చీకటి చేతబడి చేసినట్టు భీతి గొలుపుతోంది. ప్రహరీగేటు వద్ద నిలుచున్న సుకన్యకు ఏదో భయానక సంఘటన జరగబోతోందని మనసులో అనిపిస్తోంది
ఆ ఆలోచనకు ఊపిరి పోస్తున్నట్టు దాపులనే ఎవరో రోదిస్తున్నట్టు వినపడుతోంది అది మాములు ఏడుపులా లేదు భయానికే భయానకమైన భీతి కొలిపేలా ఉంది. అంతలో ఎవరో దూరంగా వస్తున్నట్టు విచిత్రమైన అలికిడి వినడానికే భయంగా అనిపించింది. సుకన్య ధైర్యం చిక్కబట్టుకుని అదేమిటో చూడాలని అనుకుంది. ఆ ఆకారం దగ్గరగా వచ్చింది. సుకన్య లేని ధైర్యాన్ని తెచ్చుకుని స్థిరంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో ఆ ఆకారం సుకన్య నిలబడి ఉన్న ప్రహరీ గేటు బయట ఎదురుగా వచ్చింది. చూసిన సుకన్య స్థాణువై కొయ్యబారిపోయి నిలుచుంది. వెళుతున్న ఆకారం సుకన్య వైపు చూసింది.. అంతే
నిలుచున్న సుకన్యకు తానేమైపోతానో అనిపించింది. అంత భయం గొలిపే సంఘటనకు తాను సాక్షురాలు అవుతుందని తానెపుడూ ఊహించలేదు. అది … అది…. దెయ్యం .ఆమెలో భయం రెట్టింపయింది.
అది నేల మీద నడవటం లేదు కాళ్లు కనిపించడం లేదు. స్కేటింగ్ చేస్తున్నట్టు జారుతూ వెళుతోంది. దాని కళ్లు ఎర్రటి నిప్పుగోళాల్లా మండుతున్నాయి. ఎముకల గూడు కదులుతూ నడుస్తున్నట్టుంది. విరబోసుకున్న జుట్టు తో సుకన్యను చూస్తు అలా ముందుకు సాగిపోయిందది.
అంతలో లేచి వచ్చిన సుకన్య తల్లి సుకన్య ఎక్కడుందా అని చూస్తూ భీతావహురాలై నిలుచున్న సుకన్యను పిలిచింది స్థాణువై నిలుచున్న సుకన్య పలికే పరిస్థితిలో లేదు. పట్టి కుదిపి పలకరిస్తున్న తన తల్లితో సుకన్య అమ్మా అది అదేమిటీ అని అడిగింది
అంతలో కొంచెం దూరంలో భయానకమైన ఆర్తనాదం భీతి గొలుపుతూ వినిపించింది. ఉలిక్కిపడి తేరుకున్న సుకన్య తల్లి సుకన్యను తీసుకుని గబగబా ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసింది.
తెల్లారి అదే వీధిలో నాలుగిళ్ల అవతల ఉన్న కోటేశ్వర్రావు రాత్రి ఎందుకో ఝడుసుకుని చచ్చిపోయాడని అందరూ చెప్పుకుంటున్నారు.
అలా ఎందుకు జరిగిందో అర్థమైన సుకన్య ఒడలు జల్లుమని జలదరించింది.
రాత్రి తన బదులు కోటేశ్వరరావు చనిపోయాడా?
కోటేశ్వరరావు కళ్ళు చూడకూడని భయానక దృశ్యం చూసినట్టు వున్నాయి.

ఘోస్ట్ స్టోరీస్ నేపథ్యంలో
దెయ్యాలున్నాయ్!
అగ్రరాజ్యంగా పేరున్న అమెరికాలో బ్లాక్ మేజిక్ ను నమ్మేవాళ్లే అధికం అని సర్వేలు చెబుతున్నాయి.దెయ్యాలున్నాయ్!
ఇది 60% అమెరికా వాసుల నమ్మకం
దెయ్యాలు, ఎగిరే పళ్లేలు ఉన్నాయని నమ్మే ఆమెరికా వాసులు ఎక్కువగానే ఉన్నారు. వీరిలో దాదాపు 60 శాతం మంది నరకం, దెయ్యాలు ఉన్నాయని విశ్వసిస్తున్నారు.
హారిస్ ఆన్ లైన్ సంస్థ విడుదల చేసిన సర్వే ఈ మేరకు వెల్లడిస్తోంది. సర్వేలో భాగంగా దేశంలోని 2,455 మంది వయోజనుల్ని ప్రశ్నించారు.
వీరిలో 82% మంది దేవుడి ఉనికిని విశ్వసిస్తున్నామని చెప్పారు. 79% మంది అద్భుతాలు జరుగుతాయని నమ్ముతున్నామన్నారు. 70% మందికి పైగా అమెరికా ప్రజలు స్వర్గం ఉంటుందని భవిస్తూన్నారు.
డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని 42% మంది, మానవజాతిని దేవుడు సృష్టించాడనే వాదనను 39% మంది విశ్వసిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో మంత్రగత్తెలు, జోస్యం నమ్ముతామని తెలిపారు.
వించెస్టర్ మిస్టరీ హౌస్…దెయ్యాల కొంప
స్కేరీ హౌస్ గురించి మీకు తెలిసే ఉంటుంది.స్కేరీ హౌస్ చూసినవాళ్లు కూడా వుండేవుంటారు.లోపలి వెళ్ళగానే చీకటి.ఒకతను వచ్చి గోడమీద వున్న నోటీసు ను చదవమంటాడు.అది పూర్తిగా చదవక ముందే ఆటను మాయమవుతాడు.అంతా చీకటి.శవాలు వేలాడుతూ ఉంటాయి.మధ్యమధ్యలో ఎగురుతాయి.అస్థిపంజరాలు గాల్లో తేలుతూ ఉంటాయి.భయంతో థ్రిల్ ఫీల్ అవుతూనే బయటకు వస్తారు.అలాంటి మిస్టీరియస్ ఇల్లొకటి వుంది.అదీ కాలిఫోర్నియా (అమెరికా)లో
అక్కడ మెట్లుంటాయి… ఎక్కుతూ వెళితే పైకప్పు తలకు తగులుతుంది! రెండో అంతస్థులో వంటగది తలుపు తీస్తే… అవతల దారి ఉండదు. అడుగు ముందుకేస్తే అంతెత్తు నుంచీ కింద పడిపోతారంతే! కాలికింద కిటికీలు…. తలుపులే ఉందని బాత్ రూమ్ లు… అదో దెయ్యాల కొంప!
వించెస్టర్ మిస్టరీ హౌస్. కాలిఫోర్నియా (అమెరికా)లో దెయ్యాల కొంపగా పేరుపడ్డ ఓ టూరిస్ట్ స్పాట్.
అర్థం పర్థం లేకుండా… పద్దతిపాడూ పాటించకుండా… ఇష్టం వచ్చినట్టు కట్టిన ఇల్లది. అందుకే అంత క్రేజ్.
బయటి నుంచే చూస్తే అందంగా కనిపిస్తుందిగాని… గైడ్ సాయం లేకుండా ఆ ఇంట్లోకి వెళితే బయటకి రావడం వెళ్లిన వారి అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది.
తనను ఆత్మలు వెంటాడుతున్నాయన్న మూఢనమ్మకంతో వాటినించి తప్పించుకోవడానికి ఓ వితంతువు పడ్డ పాట్ల తాలూకు ఫలితమీ ఇల్లు.

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.

గుప్పెడంత ఆకాశం లింక్

http://kinige.com/book/Guppedanta+Akasam

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY