చిన్ననాటి అనుభూతులతో బడి మొత్తం తిరిగాను…బడికి వెలుగునిచ్చిన విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి …గెస్ట్ కాలమ్ (17 -01 -2018 )

బ్రాహ్మణ వెల్లంల గ్రామం…
ఇప్పుడా ఊరు మురిసిపోతుంది…గర్వంగా రెపరెలాడిపోతుంది.
కొన్ని దశాబ్దాల క్రితం అక్కడ ఓ బడి…చెట్లకింద తరగతులు ..తక్కువ సంఖ్యలో బెంచీలు కుర్చీలు మధ్యతరగతి చదువుల ఒడి ఆ బడి…
ఆ బడిలో చదువుకున్న వాళ్ళు ఇప్పుడెక్కడున్నారో..ఏం చేస్తున్నారో తెలియదు కానీ …అక్కడ చదువుకున్న ఓ బాలుడు…
ఇప్పుడు సగర్వంగా బ్రాహ్మణ వెల్లంల గ్రామం గర్వపడే విధంగా తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
అక్కడ చదువుకున్న ఆ బాలుడు ఇప్పుడు ఎదిగాడు..రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరించాడు.ముఖ్యమంత్రుల చేతుల మీదుగా సత్కారాలు అందుకున్నాడు.
ప్రముఖుల ప్రశంసలతో ఒక సెలబ్రిటీ గా నిలిచాడు…వందలాది సిబ్బంది ఉపాధి కలిపిన్చదు.కుటుంబాలను ఆదుకున్నాడు.ఉన్నత విలువలతో విద్యార్థులకు విద్య నేర్పే అద్భుత విద్యాసంస్థలు స్థాపించాడు ,
అయినా తన మూలాలు మరువలేదు..ఇప్పటికీ మారని తన ఒకటి బడి దుస్థితి చూసి చలించాడు..చెమర్చాడు…

మొన్నటికి మొన్న ఆటబొమ్మలు ఇచ్చి ఆ బడిలో పిల్లలలు మంచి క్రీడాకారులు కావాలని ఆకాంక్షించాడు ఇప్పుడు ఇంకా ఇంకా తాను చదివిన ఒకనాటి బడి అరకొర సౌకర్యలతో ఉండడం చూడలేక…ఆ బడికి మరిన్ని సౌకర్యాలు కలిపించబోతున్నారు…
ఆ బాలుడే నేటి విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి…లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అంతరంగ కథనం…
అనుభూతికి అందని భావోద్వేగం ..అక్షరాలకు అందని ఎమోషనల్ టచ్…ఇక్కడే ఇక్కడే నేను చదువుకున్నాను..పలకా బలపం పట్టుకున్న బడి…అక్షరాలు దిద్దుకున్న చదువుల తల్లి వాగ్దేవి ఒడి …
ఇక్కడి నేల నాకు చిరపరిచితమే… మట్టిలో కూచున్నా…చెట్ల కింద చదువుకున్నా ..మాష్టారు చెప్పిన పాఠాలు వింటున్నా..అప్పటి బాల్యస్మృతులు ..నాలుగు దశాబ్దాలు దాటినా ఒకనాటి ఆ బడి..నా బడి ఇంకా అలానే అరకొర సౌకర్యాలతో వుంది.
నా మనసు చెమరుస్తుంది
చిన్ననాటి అనుభూతులతో బడి మొత్తం తిరిగాను…
అప్పటి నా నేస్తాలు ఇపుడెక్కడున్నారో?
మాస్టార్లు ఏమయ్యారో…
ఇపుడు నేను ఎదిగాను…అయినా ఇంకా ఒదిగే వుంటాను..చిన్నారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి అందుకే నా వంతుగా చిన్ని సాయం…నేనే కాదు ఈ స్కూల్ లో చదువుకున్న పూర్వవిద్యార్థులు ఎవరైనా ముందుకు వచ్చి నడుం, బిగిస్తే…
ప్రతీ ఊళ్ళో ఒక బడి ఉంటుంది..దేవుడిగుడి ఉంటుంది.బడి గుడి ఎప్పుడూ పాడుబడిపోకూడదు…,దాతలు ముందుకు రావాలి తాము చదివిన పాఠశాల కోసం కొంత దాతృత్వాన్ని చూపించాలి…రేపటి భావి పౌరులను తీర్చిదిద్దడానికి మనవంతు సాయం చేయాలి.
ఇది నా ఆకాంక్ష 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY