కాళరాత్రిలో….ఈ విషయం అతను ఊరిలో ఎవరికీ చెప్పలేదు.. చెబితే తనను చూసి భయపడి తనను కూడా ఒక డ్రాకులా గా….హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి ఘోస్ట్ స్టోరీస్(21-01-2018)

   (2)

ఒక్కసారిగా గుడ్లగూబలు గాల్లోకి ఎగిరాయి..అప్పటివరకూ నిర్మలంగా వున్న ఆకాశంలో ఎదో ఉపద్రవం జరుగబోతన్నట్టు..కరిమేఘాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
తనవెంట నీడలా వెంటాడుతున్న భయాన్ని రానివ్వకుండా నిలువరించుకుంటూ నడక సాగిస్తున్న అతడికి కర్ణకఠోరమైన తీతువుపిట్టల అరుపులు అతనిలో భయాన్ని మరింతగా పెంచుతున్నాయి. కీచురాళ్ల రొద ఆ తీతువు పిట్టల అరుపులతో కలిసిపోయి చెడు పాడుతున్న విధ్వంసగీతంలా ఉంది.
***
ధాత్రిలో రాత్రికి చీకటి పులిమే ఆ నిశివేళలో…
చిరుచీకటి చిక్కటిచీకటిగా మారుతుండగా ఆ చీకటికే భయమేస్తున్న ఆ కాళరాత్రిలో…
నిర్మానుష్యమైన నిర్జన ప్రదేశంలో మానవసంచారం అణుమాత్రమైనా అగుపించని ఆ దుర్జనప్రాంతంలో ఇరువైపులా ఆకాశాన్నంటే తాడిచెట్లతో నిండి ఉన్న ఒక కాలిబాట.. దాదాపు 4 కిలోమీటర్ల వరకూ సాగుతున్న ఆ కాలిబాటలో ఒక వ్యక్తి వేగంగా నడుస్తున్నాడు.. భీతి గొలుపుతున్న నల్లని నిశీధి.. గమ్యాన్ని చేరుకోవాలన్న ఆరాటం.. ఒంటరిగా వెళ్తున్నానని భయం.. జడుపు ఇవన్నీ బలంగా పడుతున్న అతని అడుగులలో ప్రస్పుటమవుతున్నాయి..
ఇంకో రెండు కిలోమీటర్లు నడిస్తే తన గమ్యాన్ని చేరుకోవచ్చు అనుకుంటూ సిగరెట్ కలుస్తూ ఆ వెలుతురులో భయంతో కూడిన ఆలోచనల నడక సాగుతున్న ఆ సమయంలో..
తాడిచెట్లకు ఒకవైపున ఆవల ఉన్న మరుభూమి అపుడే ఒళ్ళు విరుచుకుంది.. దీక్షగా చూస్తే తప్ప అక్కడ ఏముందో కూడా పసిగట్టడానికి వీలు లేకుండా ఉంది
తన గమ్యానికి చేరువగా ఉన్నానని సంతోషపడుతూ నడక సాగిస్తున్న అతని ఆలోచనకు అంతరాయం కలిగింది. ఆ అంతరాయం ఏమిటా అని చూస్తున్న అతని భుజమ్మీద ఒక చేయి చల్లగా తగిలింది. అతని వెన్నులోంచి వణుకు బయలుదేరింది. వెనుతిరిగి చూడటానికి వీలు లేకుండా ఆ ఆకారం అతని మీద పడి తన వాడి పదునైన కోరలతో అతని రక్తం పీల్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ ఆకారాన్ని నిలువరించి దాని పట్టునుండి తప్పించుకోవాలని అతడు ఆ ఆకారంతో తీవ్రంగా పెనుగులాడుతున్నాడు.
అతనిలో శక్తి క్రమక్రమంగా క్షీణీస్తోంది..భత్యంతో అతని కళ్ళు పెద్దవవుతున్నాయి..ఎక్కడో ఓ గిల్డాగుబ అక్కడికి వచ్చింది..అతడివైపు చూస్తున్నట్టు …
ఎలాగైనా తన రక్తదాహాన్ని తీర్చుకోవాలనే ఆ ఆకారం చేస్తున్న యత్నంలో అతడి భుజం మీద ఆ ఆకారపు కోరలు దిగబస్డ్డాయి..రక్తం ఫౌంటెన్ లా చిమ్మింది..అరుపు అతని గొంతులోనే ఉండిపోయింది…
ఆ రక్తం తడి అతడికి తగలగానే ఆ వచ్చినదెవరో అతడికి అవగతమై తన తక్షణకర్తవ్యం ఏమిటో అతడి మనసులో మెదిలింది
ఆ మరుభూమి నుండి ఒక ఆకారం ఒడలు విరుచుకుంటూ నిద్ర లేచింది.. తీరని రక్తదాహంతో అలమటిస్తూ భయం గొలిపేలా అటూ ఇటూ పరికిస్తూ ముందుకు సాగుతోంది..
వెనువెంటనే అతడి నోటివెంట “ప్రత్యంగిరా మంత్రాలు” బయటకు వచ్చాయి… కరిమేఘం అదృశ్యమైంది…. ఆ మంత్రవాక్కులకు జడిసిన ఆ ఆకారం ఒక్కసారిగా అతడిని వదిలేసి దూరంగా జరుగుతూ చివరకు కనుమరుగైపోయింది.
ఆ ఆకారం…
“అత్యంత భయంకరంగా క్రూరంగా రక్తాన్ని తాగే “యక్షి” అనే పేరు గల డ్రాకులా!!
నిద్రనుండి ఉలిక్కిపడి లేచిన అతను తేరుకుని తనకొచ్చిన కల ఎంత భయానకమైనదో అని అనుకుంటున్నాడు..
కానీ అతని నోటినుండి నుండి వెలువడిన ప్రత్యంగిరా విద్య .. అతని భుజంమీద దిగబడిన ఆ ఆకారపు కోరల గాట్లు ఆ సంఘటన నిజంగా జరిగిందనడానికి రుజువులుగా మిగిలిపోయాయి!!
ఈ విషయం అతను ఊరిలో ఎవరికీ చెప్పలేదు..
చెబితే తనని పిచ్చివాడిలా చూడొచ్చు..
లేదా తనను చూసి భయపడి తనను కూడా ఒక డ్రాకులాగా భావించి తనను ఆ ఊరి నుంచి వెలివేయవచ్చు..

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.

గుప్పెడంత ఆకాశం లింక్

http://kinige.com/book/Guppedanta+Akasam

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY