ఎటుపోతుందీ చిన్నారిలోకం?చేయనితప్పుకు ఉపాధ్యాయులు బలి కావాలా?ఆలోచిద్దాం…సంస్కరిద్దాం ….విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి (24-01-2018)

హృదయవిదారకమైన కథనం..తల్లిదండ్రుల తర్వాత అంతటి మహోన్నతమైన స్థానం వున్న ఒక ఉపాధ్యాయురాలి ఆవేదన..నిస్సహాయమైన పరిస్థితిలో విద్యాసంస్థల వేదన…చేయనితప్పుకు ఉపాధ్యాయులు బలి కావాలా?
ఎక్కడో ఎవరో ఒకరు తప్పు చేస్తే కీచకులు గుండాలు దాష్టీకాలు అంటూ మొత్తం ఉపాధ్యాయులకే ఆపాదించే కుసంస్కృతికి చరమగీతం పాడాలి.
తప్పు ఎక్కడ జరిగితే శిక్ష అక్కడే ఉండాలి…వ్యక్తులకే తప్ప విద్యావ్యవస్థకు తప్పును ఆపాదించకూడదు    .
వాట్సాప్ లో వచ్చిన ఒక పోస్ట్ ఇది…ఇది ఎక్కడినుంచి వచ్చినా ఈ పోస్ట్ వర్తమాన పరిస్థితులను విపరీత పరిణామాలను సూచిస్తోంది.
ఈ పోస్ట్ లో ఒక పాధ్యాయురాలి ఆవేదన ఆలకించండి.
విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దవలిసిన బాధ్యత తల్లిదండ్రులది..ఉపాధ్యాయులది మాత్రమే   కాదు మీడియా కూడా సహకరించాలి.
నేనొక టీచర్ !  
నా వృత్తి అంటే నాకు ఎంతో ఇష్టం ! 
నా పిలల్లు అంటే నాకు ఎంతో ప్రేమ !!  
నా పిల్లలకు నేనంటే ఎంతో గౌరవం ! 
కానీ ఇప్పుడదంతా గతం !  
ప్రతి రోజు నాకిప్పుడు భయం భయం !  
పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని కరుణామయులే ! 
ఇది గతం !!
టీవీ లు, ఇంటర్నెట్ , బిజీ లైఫ్ తల్లితండ్రులు , అంతా  కలిసి తెలిసో తెలియకో పిల్లల మనసు కల్మషం చేసేసారు !
ఇప్పుడు నాకు స్కూల్ కు పోతున్నట్టు లేదు !
పాఠం చెబుతుంటే నా నడుము వైపు హై స్కూల్ పిల్లాడి చూపు !
డస్టర్ కోసం వంగి తీసే లోపే ఏదో పది కళ్ళు నన్ను తినేసేలా చూశాయని ఫీలింగ్!
క్లాస్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఏదో లోకం లో వుంటారు !
ఆరవ తరగతి నుంచే జంటలు జంటలు !
మొన్న బాత్ రూమ్ లో ఇద్దరు పిల్లలు ముద్దులాడు కొన్నారని మా సోషల్ టీచర్ చెబితే మనకెందుకు తెలిస్తే గొడవ లవుతాయని ప్రిన్సిపాల్ దాపరికం !
15  ఏళ్ళ అనుభవం ! నా పాఠాన్ని పిల్లలు ఎంతో శ్రద్ధగా వినేవారు !
ఇప్పుడు పరిస్థితి వేరు . లెసన్ ఎంత ఇంటరెస్టింగ్ గా చెప్పిన వినని పిల్లలు !
అర్ధరాత్రి దాకా మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడిన వారు , నీలిచిత్రం చుసిన వారు . చాటింగ్ చేసిన వారు ..
క్లాస్ రూమ్ లో కూర్చొంటే అదో లోకం లో వున్న అధిక శాతం పిల్లలు .
పరీక్ష వస్తే తల్లితండ్రులకు మార్కు లు కావాలి .
లేదంటే PTA  మీటింగ్ లో పిల్లల ముందే అమ్మ నా బూతులు.
పిల్లడు చదువు పై శ్రద్ధ చూపడం లేదంటే
నీకే చేత కాదు అని క్లాస్ లో అందరు తల్లితండ్రులకు ఎదురుగా అవహేళన .
సపోర్ట్ కోసం ప్రిన్సిపాల్ వైపు చుస్తే తల దించుకొని ఆయన!
హోమ్ వర్క్ ఇవ్వొద్దు . కనీసం పాఠం చదువుకొని రమ్మంటే పట్టించుకోని పిల్లలు !
క్లాస్ లో అదేమని అడిగితే నువ్వు తిడుతున్నావని మా నాన్నకు చెబుతా
ఆయన మీడియాకు చెబుతాడు అని పిల్లాడి హుంకరింపు !
మొన్న పక్క స్కూల్ లో ఇదే జరిగింది ! పిలల్ల ప్రవర్తన శృతి మించితే టీచర్ కాస్త గట్టిగా కోప్పడి కాసేపు నిల్చోమందఁట ఇక మరుసటి రోజు టీవీ లో బ్రేకింగ్ వార్తలు ! టీచర్ ను రాక్షసుడిగా చిత్రీకరణ !
ఒక రోజు జైలు లో గడిపిన ఆ టీచర్ . రెండు నెలల జీతం ఖర్చు పెడితే కష్టం మీద బెయిల్
 మరో పక్క ప్రిన్సిపాల్ ను స్కూల్ లోనే చంపిన వార్తలు ! నా భవిష్యత్తు తలచుకొంటే నాకే భయం !
నాకు ఒక కుటుంబం వుంది ! ఇంట్లో భర్త పిల్లలు వున్నారు !
ఇంట్లో నుంచి స్కూల్ కు వచ్చినప్పుడు ఇంటికి క్షేమం  తిరిగి పోతానని లేదు గారెంటీ !
జైలుకే పోతానో .. నా శవమే తిరిగి పోతుందో ..
బాలలోకాన్ని అందరు చేసారు కల్మషం .. బాగు చెయ్యాల్సింది టీచర్ లేనట !
మాకెందుకు ఈ ముళ్ల కిరీటం !
లేదు నేడు ఈ వృత్తికి గౌరవం .
లేదు నేడు ఈ వృత్తికి ఆదరణ
బతికుంటే బలుసాకు తినొచ్చు ..
బతక లేక పోయినా బడిపంతులుగా రావొద్దు అని అందరికి చెబుతా !
ఈ ఉపాధ్యాయురాలి ఆవేదనకు సమాధానం చెప్పేవారెవరు?
పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలి.ఉపాధ్యాయులను ప్రతీయే విషయంలో విమర్శిఇస్తో వేలెత్తి చూపడం కాదు..ఒక తప్పు జరిగితే ఆ మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి.ఉపాధ్యాయులు తల్లిదండ్రుల స్థానంలో వున్న గౌరవనీయులు అనే   విషయాన్నీ గమనించాలి.పిల్లలు తప్పు చేస్తే దండన అనివార్యం ,తల్లిదండ్రులు కూడా పిల్లల్లోని మార్పును చేదు అలవాట్లను గమనించి గుర్తించి సత్వరమే పరిష్కారమార్గాన్ని అన్వేషించాలి.
దయచేసి మీడియా కూడా ఒక విషయాన్నీ గమనించాలి.ఏ భాగం కుళ్ళిపోతే ఆ భాగానికే శస్త్రచికిత్స జరగాలి.తప్పుచేసిన వారికీ శిక్ష పడేయాలి.కానీ వ్యక్తి తప్పు చేస్తే ఆ శిక్షకు బాధ్యతను వ్యవస్థకు ఆపాదించకూడదు.
ఎంతో ఓర్పుతో బాధ్యతతో నిబద్దతతో చదువులు చెప్పే గురువులు ఉపాధ్యాయులు లక్షల్లో వున్నారు..కొందరు వెళ్ళమీలేదా లెక్కించే సంఖ్యలో వున్న ఉపాధ్యాయులు చేసే తప్పులకు మొత్తం ఉపాధ్యాయలోకాన్నే నిందించకూడదు.
పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులకు కూడా వుంది.స్కూల్ లో ఎంత చక్కని విద్యాబోధన చేసినా తల్లిదండ్రులు  ఇంట్లో హితబోధ చేయాలి .పిల్లల కదలికలు కనిపెట్టాలి.పిల్లలు తప్పుచేస్తే మందలించాలి..శిక్షించాలి…వ్యక్తిత్వవికాస నిపుణులను …సంప్రదించాలి.
సమాజానికి ఉన్నత విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం కాపాడుకోవడం మన విధి 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY