తను ఇలాంటి కేసులు ఎన్నో చూసినా ఈ కేసు వింతగా వుంది.ఆత్మలు శరీరాల్లో దూరడం తెలుసు..విన్నాడు..కానీ బండరాయిలో …?ష్ … హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి ఘోస్ట్ స్టోరీస్(28-01-2018)

                                                  (3)
అర్థరాత్రి కావడానికి ఇంకా రెండునిమిషాల వ్యవధి.రేడియం వాచీలో టైం చూసుకున్నాడు సిన్హా…
పారా సైకాలజిస్టు గా…దెయ్యాల గురించి పరిశోధనలు చేయడంలో అతనికి పేరు వుంది. ఆత్మలకు సంబంధించిన ఒక  సెమినార్ కు అటెండ్ అయి సిటీకి బయల్దేరాడు.
నిర్మానుష్యంగా నిశ్శబ్ధంగా ఉన్న ఆ ప్రాంతంలో ఎక్కడనుండో దూరంగా ఏదో అలికిడి.. అదేమిటో వినడానికి చెవులు రిక్కిస్తూ  సిన్హా మెల్లిగా కారు నడుపుతున్నాడు
అది అర్దరాత్రి.. రోడ్లన్నీ మనుష్యులకు నిర్మానుష్యంగా చీకటి ఆకారాలకు కోలాహలంగా ఉండే సమయమది.
ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో అతని కారు నెమ్మదిగా వెళుతోంది.ఎక్కడి నుంచో ఏడుపు శబ్దం
ఆ శబ్దానికి  సిన్హా . దగ్గరగా వచ్చాడు. అదొక రోదన అని అర్థమైంది. చిన్నపాటి అనుమానంతో  కారు దిగి ఆ ఏడుపు  ఎక్కడనుండి వస్తుందో పరికిస్తున్నాడు. అక్కడ తను తప్ప మరెవరూ లేరు.
మరింత ముందుకెళ్లి చూశాడు. ఆ రోదన ఇంకా బిగ్గరగా వినపడుతోంది.  అటూ ఇటూ చూసిన  సిన్హాకి ఆశ్చర్యంతో కూడిన జలదరింపు, భీతి కలిగాయి. ఆ రోదన అక్కడున్న ఒక పెద్ద బండరాయి నుండీ వస్తోంది.మరింత దగ్గరగా వెళ్లి చూశాడు ఆ రోదన ఖచ్చితంగా ఆ బండరాయి నుండే వస్తోంది.
ఇది తను పరిశోధన చేసే సమయం కాదు…తెల్లారితే తను ఢిల్లీ వెళ్ళాలి.అక్కడ పారా సైకాలజిస్టుల కాన్ఫెరెన్స్ కు అటెండ్ కావాలి.
ఆ బండరాయిని నుంచి ఏడుపు వినిపిస్తోందని అర్ధమైంది…తన సెల్ లో ఆ ఏడుపు రికార్డు చేయడానికి రికార్డు ఆప్షన్ కు వెళ్ళాడు…టచ్ స్క్రీన్ పనిచేయడం లేదు…ఎంత నొక్కినా …
బహుశా సాయంత్రం ఫోన్ వాష్ బేసిన్ లో పడడం వాళ్ళ ఆలా అయిందేమో అనుకుని వెళ్లి కారులో కూచొని ..ఒక్కక్షణం స్థాణువయ్యాడు…
కారు స్టార్ట్ అవకుండా మొరాయిస్తోంది. ఇంతలో తన పక్కసీటు వైపు చూసి అతను మ్రాన్పడిపోయాడు
ఆ పక్కసీటులో ఉన్నది దయ్యాలు ఉన్నాయని సూచించే “ఇన్ ఫ్రారెడ్ టెంపరేచర్ సెన్సర్ ” అతనికి ఇస్తున్న సిగ్నల్స్ చూసి..దగ్గరలో దెయ్యాలున్నాయని వచ్చే సిగ్నల్స్ అవి..అంటే….
ఒక్కక్షణం వణికిపోయాడు…
ఆ కారులో ఉన్న ఆ పారాసైకాలజిస్టు ఒక విషయం గమనించాడు తాను ఒణికిపోతున్నది భయంతోనే కాదు. అత్యంత చల్లగా మారిపోయిన ఆ ప్రాంతంలో ఆ శీతలాన్ని భరించలేక వణికిపోతున్నాడు.ఆ  ప్రదేశంలో తప్పకుండా దయ్యం ఉందని ఆ పరికరం సంకేతాలిస్తోంది. ఆ సంకేతాలు నిజమే అని నిరూపిస్తూ శీతలదనం ఆ ప్రాంతాన్ని ఆవరించింది.మరణించిన శవాల మధ్య వున్న ఫీలింగ్.
ఆ శీతల ప్రదేశం నుండి త్వరగా  వెళ్లిపోవాలనుకున్న సిన్హా  కారును ముందుకు దూకించాడు.
కొద్దిదూరంలోనే కారు కీచుమంటూ శబ్దం చేస్తూ ఆగిపోయింది. అందుకు కారణం ఒక మనిషి కారుకు అడ్డంగా రావడమే.
ఎదురుగా ఓ మహిళ..అందులోనూ నిండుగర్భిణి.
ఒక నిండుచూలాలైన మహిళ…
ఒక అపరిచితురాలిని అదీ నిండు గర్భిణిని చూసి ఒక్కక్షణం అలానే వుండిపోయాడు.
దారి తప్పి తిరుగుతున్నానంటూ చెప్పిన ఆ మహిళను కారు వెనకసీటులో కూర్చొమని చెప్పి కారును స్టార్ట్ చేశాడు సిన్హా.
ఇన్ ఫ్రారెడ్ సెన్సర్ ఇంకా సంకేతాలిస్తూనే ఉంది. ఆ సంకేతాలు మరింత ప్రమాదకరమని సూచిస్తున్నట్టున్నాయి.
కారును సాధ్యమైనంత స్లో గా తీసుకువెళ్తున్నాడు…స్పీడ్ గా  వెళ్తే నిండుగర్భిణీకి ప్రమాదమని.
వెనుకనుంచి ఎలాంటి శబ్దమూ రావడం లేదు…బహుశా నిద్రపోయి వుంతుందేమో..అనుకున్నాడు.హడావుడిలో ఆ గర్భిణీ ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోలేదు..తాను అడగానూ లేదు…ఆమె చెప్పనూ లేదు…
ఆ క్షణం అతనిలో ఒక గగుర్పాటు…ఒక అపరిచితురాలు ..ఒకమహిళ ..అందులోనూ నిండుగర్భిణి జనసంచారం లేని రోడ్డుమీదికి ఎలా వచ్చింది?
ఒక్కక్షణం చిన్నవణుకు ..అతను ఎంత ప్రొఫెషనల్ అయినా సాధారణమైన గగుర్పాటు….
“ఇన్ ఫ్రారెడ్ టెంపరేచర్ సెన్సర్ ”  ఎందుకు ఇంకా సంకేతాలిస్తోందో అర్థం కాక ఆలోచిస్తూ యధాలాపంగా కారు అద్దంలో చూశాడు.
అది భయమో..ఆశ్చర్యమో…జలదరింపో అర్థం కాలేదు…వెనుకసీటులో మహిళా లేదు…
వెనకసీటులో మహిళ కాకుండా ఇంకేదో ఆకారం కనిపిస్తోంది. కళ్లు చిట్లించుకుని చూస్తే అదొక దయ్యం. కారు ఆపి వెనక్కి చూశాడు.
ఆ ఆకారం తనవైపే చూసి నవ్వుతోంది..నవ్వు మాములుగా లేదు.అప్పటికే ఆ ఆకారం  తన రెండుచేతులు ముందుకు సాచింది.చేతులు సా…గు….తూ  అతని మెడను చుట్టేశాయి..చేతివేళ్ల నుంచి గోళ్లు పొడుచుకువచ్చాయి… వాడిగోళ్లతో అతని కంఠంలోకి వెళ్తున్నాయి.
రక్తం చిమ్మితోంది…
ఆ ఆకారం బారి నుంచి  తప్పించుకోవాలని చూస్తూ పెనుగులాడుతూ కారు డోర్ ను తన్ని ఒక్క ఉదుటున బైటకు వచ్చాడు.ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో సాయం కోసం చూస్తున్నాడు…వెనుక నుంచి ఆ ఆకారం సిన్హా గొంతును పట్టుకుంది.
సరిగ్గా అప్పుడే ఒకవ్యక్తి సిన్హాకు ఎదురొచ్చాడు.ఆ వ్యక్తిని చూస్తూనే సిన్హా గొంతు పట్టుకున్న ఆకారం గాల్లోకి ఎగిరి అదృశ్యమైంది.
సిన్హా ఇంకా షాక్ లో నుంచి కోలుకోలేదు.ఇలాంటివి ఎన్నో చూసినా అతనికి ఈ సంఘటన షాకింగ్ గా వుంది.
సిన్హాను కాపాడిన వ్యక్తి కారులో వున్న వాటర్ బాటిల్ సిన్హాకు ఇచ్చాడు.
సిన్హా ను కాపాడిన వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు
“భయపడకండి నేనొక టీచరును”…అంటూ…తిరిగి కొనసాగిస్తూ…”మీరు వచ్చిన  దారిలో ఉన్న బండరాయి పేరు ‘రోదించే బండరాయి’ ఒక నిండుచూలాలిని కొంతమంది ఆగంతుకులు ఆ బండరాయిపై అమానుషంగా చంపేశారు …అప్పటి నుంచి ఆమె ఆత్మ  ఆ బండరాయితో ఆత్మగా ప్రవేశించింది.తనను చంపిన ఆగంతకులను వరుసగా చంపేసింది…
ఆమే రాత్రుళ్లు “యురేయ్ ” (Yurei) అనే దయ్యంగా మారి రోడ్డుమీద వెళ్లేవారిని చంపుతుంది.మీరు  లక్కీగా  తప్పించుకున్నారు ఆ కనిపించే డివైడ్ మలుపు దాటితే మా ఇల్లు …ఇక్కడ నాకు చిన్నపని వుంది.అది చూసుకుని వస్తాను…అని చెప్పి  చీకటిలో కలిసిపోయాడు..
సిన్హాకు  అంతా గందరగోళంగా వుంది,.తను ఇలాంటి కేసులు ఎన్నో చూసినా ఈ కేసు వింతగా వుంది.ఆత్మలు శరీరాల్లో దూరడం తెలుసు..విన్నాడు..కానీ బండరాయిలో …?
జరిగిన సంఘటనలన్నీ తలుచుకుంటూ ఒళ్లు గగుర్పొడుస్తుంటే అన్యమనస్కంగా కారు నడుపుతున్నాడు.నగరశివార్లలో ఉన్న ఒక డివైడర్ కు కారు గుద్దుకునీ ఆగిపోయింది.
కొద్దిదూరం నడిస్తే ఆ టీచర్ ఇల్లు వస్తుంది.అతడిని పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవాలి…అనుకున్నాడు
అప్పటికే వేకువఝాము గడుస్తోంది. కారు దిగిన సిన్హా దెబ్బతిన్న కారు ముందుభాగాన్ని పరిశీలిస్తూ అక్కడే ఉన్న ఒక స్తంభాన్ని చూసి ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.
అక్కడ ఆ స్తంభానికి కట్టిన ఫ్లెక్సీలో కారులో మంచినీరందించిన టీచరు ఫోటో
“మా మాస్టారు మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు…మాస్టారూ మీరు ఎక్కడికి వెళ్లినా మాకోసం మా మధ్యే వుంటారు..”అన్న మాటలు..శ్రద్ధాంజలి అన్న పెద్ద అక్షరాలు.
కొద్దిసేపటి క్రితం తనను “యురేయ్ ” (Yurei) అనే దయ్యం బారి నంచి కాపాడిన వ్యక్తి..కాదు కాదు ఆత్మ…”యురేయ్ ” (Yurei) అనే దయ్యం ఎందుకు తనను విడిచిపెట్టిందో అర్థం అయ్యింది.ఒక మంచి ఆత్మను చూసి “యురేయ్ ” (Yurei) అనే దయ్యం తనను వదిలేసింది.
                                    ***
జపాన్ లోని క్యోటో నగరానికి వెళ్లేదారిలో రోదించే బండరాయి ఉందనీ ఆ బండరాయిపై మరణించిన నిండుచూలాలి ఆత్మ యురేయ్ అనే పేరుతో అందరినీ బలి తీసుకుంటుందనీ .. జపాన్ ప్రజలు ఈ కథను కథలు కథలుగా చెప్పుకుంటూ నాటకాల రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారనీ తెలిసిన సమాచారం ఆధారంగా! (రచయిత్రి)
గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY