వాళ్ళల్లో ఇద్దరు ఈ విషయం ఆంటీకి చెప్పడానికి ఆంటీ ఇంటికి పరుగు తీశారు….స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (11-02-2018)

నా తరపున మా జూనియర్స్ మా ఇంట్లో పుట్టపర్తి ట్రిప్ అడగడానికి వెళ్ళారు.
మా ఇంట్లో పేర్మిషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమీ లేదని తెలుసు. పైగా మా జూనియర్స్ ఇళ్ళు మా ఇంటి పక్కన్నే ఉండడంతో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు.
మొత్తానికి ఏదో చేసి పర్మిషన్ పట్టుకుని వచ్చేశారు.
మొత్తానికి మా జూనియర్స్ చాలా కుషి అయిపోయారు. వాళ్ళు నాకు బాగా అటాచ్ కావడం, నేను లేని ట్రిప్ బోర్ అని ఫీల్ అవ్వడం నాకు కూడా చాలా సంతోషాన్ని కలిగించింది.
వాళ్ళల్లో ఇద్దరు ఈ విషయం ఆంటీకి చెప్పడానికి ఆంటీ ఇంటికి పరుగు తీశారు.
ఇక పుట్టపర్తికి అందరం కలిసి వెళ్ళడం అన్న ఎక్సైట్ మెంట్ తో మా జూనియర్స్ అందరూ నా చుట్టూ చేరారు.
వాళ్ళందరిలో నేనే సీనియర్ కావడం, అప్పుడప్పుడు మంచి కధలు చెప్పి వారిని ఎంటర్ టైన్ చేయడం వల్ల నేనంటే వాళ్లకు చాలా ఇష్టం.
ఇక పుట్టపర్తి వెళ్ళడం గురించి డిస్కషన్ తో ఆ ఆదివారం గడిచిపోయింది.
మరుసటి ఆదివారమే పుట్టపర్తికి వెళ్ళడం.
ట్రిప్ మూడు నుండి ఐదు రోజులు.
మొదటిసారి వెళ్ళడం.. కాస్త టెన్షన్ గా అనిపించింది. అప్పటికే నేను టెన్త్ క్లాస్ లో ఉండడం వల్ల మా జూనియర్స్ ఇంట్లో నాపై మంచి నమ్మకం ఉండడం వల్ల వాళ్లకు కూడా టెన్షన్ లేదని మాటల సందర్భంలో అర్థం అయ్యింది.
ఇక బట్టలు సర్దుకోవడంలో మేము బిజీ అయ్యాం.
రోజు స్కూల్ అవ్వగానే మా ఇంటి వద్ద మీటింగ్ పెట్టడం, ట్రిప్ కి సంబంధించి సరదాగా మాట్లాడుకోవడంతో ఆ వారం తెలియకుండానే గడిచిపోయింది.
మేము ప్రయాణం చేసే రోజు వచ్చింది. నాకు బస్ జర్నీ అంటే అలర్జీ. అందుకు కారణం ఉంది.
డీజల్ వాసన అంటే నాకు అసలు పడదు. వామిటింగ్ సెన్సేషన్ మొదలై చివరి వరకు ఇబ్బంది పెడుతుంది. ఏమి తిన్నా తినకపోయినా వామిటింగ్ అయిపోతుంది.
ఇలా ఉంటే ఇక ఎప్పటికీ ఏమీ చూడలేమని ఎక్కడికీ వెళ్ళలేమని తెలుసు.
ఎలా అయినా ఈ ప్రాబ్లం అడిగామించాలని డిసైడ్ అయ్యాను.
వామిటింగ్ రాకుండా పిప్పర్ మెంట్ బిళ్ళలు కొన్ని పాకెట్ లో సర్దేశాను.
మార్నింగ్ ఆరు గంటలకు అందరం బస్ స్టాండ్ చేరుకున్నాం.
మా జూనియర్స్ ను డ్రాప్ చెయ్యడానికి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. నేను ఒంటరిగానే వెళ్లాను.
ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళడం అలవాటు అయ్యింది.
ఆ క్షణం నన్ను డ్రాప్ చెయ్యడానికి మా వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఎంతో బాగుండేది అనిపించింది.
ఒంటరితనం నా మనసును ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
దానిని అధిగమించడానికి ఎన్నో తంటాలు పడుతూ ఉంటాను.
ఎవరు తోడు ఉన్నా లేకపోయినా ఈ జీవితం ఇలా గడపవలసిందే…

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY