పరిస్థితులతో అలవాటు పడే విధంగా మనసును మలచుకోవడంతో నాకు ఎక్కడకు వెళ్ళినా…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (18-02-2018)

అయినా నాకు చిన్నప్పటినుండే ఒంటరితనం అలవాటు అయ్యింది.
మనసు సున్నితనమైనా మనిషిని మాత్రం కాదు.
పరిస్థితులతో అలవాటు పడే విధంగా మనసును మలచుకోవడంతో నాకు ఎక్కడకు వెళ్ళినా ఏ ఇబ్బంది ఎదురుకాలేదు.
బస్ బయలుదేరింది.
తిరుపతి నుండి చంద్రగిరి వెళ్ళే దారి పట్టింది. మనకు చంద్రగిరి వరకే తెలుసు ఆపై ఊర్లు ఏమీ తెలీవు.
అందరు బస్ లో సర్ధుకుని కూర్చున్నాం.. మా జూనియర్స్ నాతోనే కూర్చున్నారు.
దారిలో వెళ్ళే వాళ్లకు టాటా చెప్తూ అందరిని పలకరిస్తూ సరదా చేస్తున్నాం
వాళ్ళు రెస్పాన్స్ ఇస్తుంటే మా జూనియర్స్ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారిలో ఒకరిద్దరు మీకు రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు తెలుసా అని నన్ను అడిగారు కూడా.
మన సరదా చూసి ముచ్చటపడి మనకు రెస్పాన్స్ ఇస్తున్నారు అంటూ వాళ్ళతో చెప్పడంతో ఆశ్చర్యపోవడం వారి వంతు అయ్యింది.
నా ప్రవర్తన వారికి కొత్తగా ఉన్నా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఆంటీ వాళ్ళ ఫ్రండ్స్ తో ముందు సీట్ లో కూర్చున్నారు. మేము బ్యాక్ సీట్స్ లో ఉండడంతో మా అల్లరి తనకు వినపడలేదు. అదే మాకు ప్లస్ పాయింట్ కావడంతో మా అల్లరి శృతి మించింది.
మా విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాం.
కాసేపటి తరువాత బస్ సిటి లిమిట్స్ దాటింది. మా అల్లరి కూడా తగ్గింది.
నాకు ప్రకృతిని చూడాలంటే చాలా ఇష్టం. బస్ లో కిటికీ పక్కన కూర్చోవడానికి ఇష్టపడతాను.
బస్ ముందుకు వెళ్తుంటే వెనక్కు పరుగెత్తే చెట్లు కొండలు…
ఎందుకో చూస్తుంటే టైం తేలీదు.
అలా చూస్తూ ఎంత సేపు గడిపానో తెలియదు. పక్కకు చూస్తే మా జూనియర్స్ నాపై పడి నిద్రపోతున్నారు.
అలా నిద్రపోయేవారిని చూడాలంటే చాలా ఇష్టం. అమాయకంగా కనిపించే మొహాలు.
చిరునవ్వుతో ఉన్న ఆ పేస్ ను చూడడం ఎంత హ్యాపీగా ఉంటుందో…
కాసేపటితరువాత చంద్రగిరి చేరాం.
దూరంగా కొండపై చంద్రగిరి కోట రాజసంగా నిలబడి ఉంది.
పురావస్తుశాఖ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంలా అక్కడక్కడా విరిగిపోయిన కోట గోడలు…
చరిత్ర కనుమరుగౌతుంటే భావి తరాలవారికి మనం అందించే వారసత్వసంపద ఏమిటో అర్థం కాక మనసు బరువు ఎక్కింది.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY