ఆ కోటలో ఏముందో చూడాలని సింఘాలా అక్కడికి నడవడం మొదలుపెట్టాడు…హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి …బలి కోరే వజ్రాలు ..(ఘోస్ట్ స్టోరీస్) 25-02-2018

                                          (7)
సింఘాలాకు పర్యాటక ప్రదేశాలంటే చాలా ఆసక్తి ఎక్కువ. అందులో భాగంగానే ఒక అటవీప్రాంతానికి బయలుదేరాడు.అక్కడున్న చెట్టుచేమలను పరిశీలిస్తూ వాటిని తనదగ్గరున్న అత్యాధునిక డిజిటల్ కెమెరాతో అడవిపక్షుల అరుపులను రికార్డు చేస్తూ చాలా దూరం వచ్చేశాడు. అలా తిరుగుతున్న సింఘాలాకు కొద్దిదూరంలో ఒక కోట కనిపించింది. ఆ కోట దూరం నుండి చాలా ఆకర్షణీయంగా అగుపిస్తోంది. ఆ కోటలో ఏముందో చూడాలని సింఘాలా అక్కడికి నడవడం మొదలుపెట్టాడు
దాపులనే కోట కనిపిస్తోంది కానీ ఎంత నడిచినా ఇంకా దూరమే అనిపిస్తోంది…ఎండమావిలా భ్రమింపజేస్తుందా? దారి తరగడం లేదు. ఎంత నడిచినా కోట ఇంకా దూరంలో ఉన్నట్టు అగుపిస్తోంది. అలా చాలాసేపు నడిచిన తర్వాత ఎట్టకేలకు ఆ కోటను చేరగలిగాడు సింఘాలా. అక్కడక్కడ పాడుబడినా కూడా కోట చెక్కుచెదరకుండా ఉంది. బయటనుండి చూస్తే 3 అంతస్తులతో ఉంది.  ఆ కోటకు ఉన్న చిన్నచిన్న బురుజులు కిటికీలలో గబ్బిలాల గుంపులు వేలాడుతున్నాయి. కోట కు విశాలమైన ప్రాంగణం ఆ ప్రాంగణంలో కత్తులతో యుద్దాలు చేస్తున్న వందలాది మంది సైనికుల శిల్పాలు. ఆ కోట ప్రాంగణంలో పాడుబడిన కట్టడాలు అనేకం ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఫోటోలు తీసుకుంటూ కోటలోకి అడుగుపెట్టాడు సింఘాలా
అలా అడుగుపెట్టగానే గుడ్లగూబల గుంపులు మూకుమ్మడిగా గాలిలోకి ఎగిరాయి. తెలియని అసహజవాతావరణం భయం గొలిపేలా ఆ కోటను ఆవరించింది. ఆ మూడంతస్తుల కోటలో ఎన్నో వందల గదులున్నాయి. కొన్ని గదులకు తలుపులు తుప్పుపట్టి ఉన్నాయి. ఎన్నో రకాల చిత్రపటాలు. సైనికులదుస్తులు ఆయుధాలు పలురకాల శిరస్త్రాణాలు ఇలా పలురకాల వస్తువులతో పాటు గబ్బిలాలు కూడా నివాసం ఉన్నాయి. వాటన్నిటినీ ఫోటోలు తీసుకున్న సింఘాల్ ఇక అక్కడినుండీ వెళ్లిపోవాలని అనుకుంటూ వచ్చిన దారిలో కాకుండా ఇంకొకదారిలో వస్తూ అనుకోకుండా గోడ మీద ఉన్న మీటను నొక్కేశాడు. అంతే..
అక్కడ సింఘాల్ నిలబడ్డ చోటు నుండి లోపలికి పడిపోయాడు
ప్రతిగదికీ తలుపులు లేని కిటికీలు. అలా ఒక్కొక్కగదిని పరిశీలిస్తూ వెళుతున్న సింఘాలాకు ఒకచోట ఆగి చూశాడు. అక్కడ భీతిగొలిపే రోదన వినిపిస్తోంది. ఇంకో గది కిటికీలో నుండీ చూస్తే ఏదో సమావేశం జరుగుతోంది. అవన్నీ భయంభయంగానే రికార్డు చేస్తున్నాడు సింఘాలా…
అలా పడిపోయిన సింఘాలా మెల్లిగా లేచి చుట్టూ చూశాడు. అక్కడంతా కటిక చీకటి తన దగ్గరున్న ఫోకస్ లైటుతో ఆ ప్రదేశాన్నంతా పరిశీలించగా అది ఆ కోటకు అంతర్భాగంలో ఉన్న ఇంకొక అంతస్తు అని అర్థమైంది. అక్కడ కూడా వందలాది గదులున్నాయి.
భీతి గొలుపుతున్న ఆ చీకటిలోకంలో వినిపిస్తున్న ఆ శబ్దాలను భయంభయంగా రికార్డు చేస్తున్నాడు సింఘాలా. అక్కడున్న చీకటిగదులలో రకరకాల ధ్వనులు సైనికులకవాతు. ఏడుపులు రోదనలు కత్తులయుద్దపు ధ్వనులు.. ఇవన్నీ వింటున్న సింఘాలా కు ఒక్కసారిగా వెన్నునుండీ వణుకు బయలుదేరింది…కానీ గొంతులో నుంచి కేక బయటకు రాలేదు.
ఈ సంఘటన జరిగిన రెండురోజుల తర్వాత….
పురావస్తుశాఖలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కపాడియా తన సిబ్బందితో కలిసి ఆ కోట ప్రాంగణంలో అడుగుపెట్టాడు. అక్కడున్న సైనికశిల్పాలను పరిశీలిస్తూ అలా వెళుతుంటే ఒక సైనికశిల్పం చేయి కపాడియాను తాకినట్టుగా అనిపించింది. ఉలికిపడిన కపాడియా ఆ శిల్పాన్ని చూడగా ఆ శిల్పం చేతిలో కెమెరా ఉంది. తన సిబ్బంది సహాయంతో ఆ కెమెరాలో రికార్డయిన శబ్దాలను దృశ్యాలను వీక్షిస్తున్నాడు కపాడియా..
అందులో అడవిలో ఉన్న శబ్దాలతో పాటు ఆ కోటలో వినిపించి కనిపించిన శబ్దదృశ్యాలతో పాటు వజ్రాలగదిలో విరజిమ్ముతున్న కాంతులు..
అంతేకాకుండా….
ఆ గదిలోకి దిగిన ఆకారాలతో కలిసిపోయి వాటితోపాటు గది పైకప్పు నుండి ఎగిరిపోయిన “సింఘాలా” కూడా ఉన్నాడు!!
అక్కడినుండీ ఎలాగైనా బయటపడాలని ఆ చీకటిలోనే భయంగా చూస్తూ తిరుగుతున్నాడు సింఘాలా అంతలో అక్కడ ఒక మూల ఏదో చిన్న వెలుగు కనిపించింది. అక్కడికి వెళ్లిన సింఘాలా ఊపిరి పీల్చుకున్నాడు. కారణం ఆ వెలుతురు ఒక గదినుండి ప్రసరిస్తోంది. తన దగ్గరున్న కెమెరాను రికార్డు అయ్యేలా సరిచేసుకుని వెలుతురు వస్తున్న గది వైపు అడుగులు వేశాడు సింఘాలా. అక్కడ లోపలికి దిగడానికి మెట్లు ఉన్నాయి. ఆ గదిలోపల నుండి కాంతి మెట్లమీదుగా పైకి ప్రసరిస్తోంది. ఆ కాంతిలో మెట్లు దిగిన సింఘాలా అక్కడున్న దృశ్యం చూసి అప్రతిభుడయ్యాడు. ఒళ్లు జలదరించగా అలా నిలబడిపోయాడు.
అక్కడ ఆ గది గోడలలో విలువైన వజ్రవైఢూర్యాలు నిక్షిప్తం చేసి ఉన్నాయి.  వాటి తాలుకూ కాంతి ఆ గదిలో వెలుగులతో నిండిపోయింది.  వాటిని చూసిన సింఘాలా ఆ వజ్రాలను తాకాలని వాటిమీద చేయి వేశాడు.
అంతే….
ఆ గది పైకప్పును చీల్చుకుంటూ ఆ గదిలోకి కొన్ని ఆకారాలు దిగబడ్డాయి.
కపాడియాలో ఆసక్తి మొలకెత్తింది..భయం పక్కనే ఆసక్తి ఉంటే జరిగే ప్రమాదాన్ని ఊహించని కపాడియా వజ్రాలు వున్నా గదిలోకి వెళ్ళాడు…సింఘాలా విషయంలో ఏం జరిగిందో మర్చిపోయాడు….వజ్రాలను చూడగానే వాటిని చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడు…
మరోసారి …ఆ గది పైకప్పును చీల్చుకుంటూ ఆ గదిలోకి కొన్ని ఆకారాలు దిగబడ్డాయి.
ఇదేమీ తెలియని పురావస్తుశాఖ సిబ్బంది తమ బాస్ కోసం ఎదురుచూస్తూ వజ్రాలగదిలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు…
కొన్ని సంఘటనలు లాజిక్కు దొరక్కపోవచ్చు..కొన్ని సంఘటనలు మిస్టీరియస్ గా మిగిలిపోతాయి,,,సరైన ఆధారాలు దొరికేవరకూ..బెర్ముడా ట్రయాంగిల్ లా…ఈ సంఘటనల అంతు తేల్చడానికి బ్రేవ్ అనే ఆంగ్ల పత్రిక తన రిపోర్టర్లను ఆ అటవీ ప్రాంతానికి పంపించింది
వాళ్ళు ఇప్పడు ఆ అటవీప్రాంతంలోకి ప్రవేశించారు.
(ఉత్తరప్రదేశ్ లోని ఖర్కోడ కోట చాలా భయంకరమైనదనీ అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతాయని తెలిపిన సంఘటనల ఆధారంగా…రచయిత్రి)
గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY