బస్ ఆగడంతో మా జూనియర్స్ ఎవరో తట్టి లేపినట్టు టక్కున నిద్ర లేచారు…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (25-02-2018)

సాదారణంగా నాకు బస్ జర్నీలో నిద్ర రాదు.
ప్రకృతి చూడడం చాలా ఇష్టం అయినందువల్ల, ఎంతసేపైనా అలా చూస్తూ గడిపేయగలను.
పుట్టపర్తి ఎంత దూరమో తెలియదు. అప్పట్లో సెల్ ఫోన్స్ అనేవి లేవు. వాచ్ చూసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా టైం గడిపేశాను.
మధ్యాహ్నం దాటింది. ఆకలి నకనకలాడుతోంది. మా జూనియర్స్ డీప్ స్లీప్ లో ఉన్నారు.
ఆంటీ లేచినట్టు ఉన్నారు. వెనక్కు చూస్తున్నారు. నేను ఆంటీని చూసి పలకరింపుగా నవ్వాను.
నిద్ర పోలేదా అన్నట్టు సైగ చేశారు. లేదంటూ తల ఆడించాను
ఇంతలో బస్ ఏదో హోటల్ ముందు ఆపాడు.
బహుశా డ్రైవర్ కండక్టర్ కూడా ఆకలి వేసినట్టు ఉంది.
బస్ ఆగడంతో మా జూనియర్స్ ఎవరో తట్టి లేపినట్టు టక్కున నిద్ర లేచారు. నేను తప్ప అందరు ఫ్రెష్ గా ఉన్నారు.
ఎండకు కళ్ళు మండుతుంటే బస్ దిగి దగ్గరలో ఉన్న టాప్ దగ్గర మొహం కడుక్కున్నాను.
కాస్త రిలాక్స్ అయినట్టు అనిపించింది. మా జూనియర్స్ అప్పటికే హోటల్ లో దూరిపోయి సీట్స్ ఆక్యుపై చేసినట్టు ఉన్నారు.
నా కోసం సీట్ అట్టిపెట్టారు. ఆకలితో ఉండడం వల్ల అందరం భోజనాలు ఆర్డర్ చేశాం.
ఫుడ్ చండాలంగా ఉంది. బహుశా డ్రైవర్ కండక్టర్ కి కమీషన్ ఉండి ఉంటుంది. అందుకే ఏరి కోరి ఈ చెత్త హోటల్ ముందు ఆపాడు.
ఆకలి నషాళం అంటుకోవడంతో మారుమాట్లాడకుండా పెట్టింది తినేశాం.
ఇంతలో బస్ హారన్ కొట్టడంతో మేం గబగబా బస్ ఎక్కాం.
లంచ్ తరువాత బస్ బయలుదేరింది. తిరుపతి నుండి చిత్తూర్ దాటి అనంతపూర్ వైపు బస్ పరుగులు పెడుతోంది.
అలా చూస్తుండగానే సాయంత్రం అయ్యింది. టీ తాగడం అలవాటు ఉండడం వల్ల టీ లేకుండా తలనొప్పి స్టార్ట్ అయ్యింది.
పైగా ఎండా వేడికి నోరు ఎండుకుపోతోంది.
బిస్లేరి లాంటి ప్యాక్డ్ వాటర్ తెలియని రోజులు. ఎక్కడైనా ఆపుతాడేమో నీళ్ళు తాగుదాం అన్న కోరిక బలంగా మనసులో స్టార్ట్ అయ్యింది.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY