భూమ్మీద ఇండియన్స్ లో వున్న సెంటిమెంట్స్ ని ఎమోషన్స్ ని కనిపెట్టడానికి హ్యుమనాయిడ్‌ రోబోని సృష్టిస్తారు క్యూ గ్రహాంతరవాసులు..ఆ హ్యుమనాయిడ్‌ రోబో ప్రేమలో పడతాడు హీరో సిద్ధార్థ…మేన్ రోబో * ప్రహేళిక * తొలి మానవరూప (హ్యుమనాయిడ్‌) రోబో సోఫియా…వీడియో చూడండి

మేన్ రోబో * ప్రహేళిక * తొలి మానవరూప (హ్యుమనాయిడ్‌) రోబో సోఫియా..
రచయిత ..సైంటిస్ట్ …బ్రహ్మ .వీళ్ళు మాత్రమే సృష్టించగలరు
2002 మేన్ రోబో నవల
క్లిష్టతరమైన ఆపరేషన్ ఆంత్రాక్స్ ను న్చుస్థాపితం చేయదని వన్ మేన్ ఆర్మీ గా ఆర్మీ ఆఫీసర్ అగ్నిహోత్ర వెళ్తాడు.అతనితో పాటు సిబిఐ డిప్యూటీ చీఫ్ షర్మిల వెళ్తుంది.అక్కడ అగ్నిహోత్ర ప్రేమలో పడుతుంది.
ఇండియా తిరిగి వచ్చాక అసలు విషయం తెలుస్తుంది.అగ్నిహోత్ర మనిషి కాదు మేన్ రోబో అని తెలుస్తుంది.అతడిని “డు యు లవ్ మీ”అని అడుగుతుంది.
2006 క్యూ నవల
భూమ్మీద ఇండియన్స్ లో వున్న సెంటిమెంట్స్ ని ఎమోషన్స్ ని కనిపెట్టడానికి హ్యుమనాయిడ్‌ రోబోని సృష్టిస్తారు క్యూ గ్రహాంతరవాసులు..ఆ హ్యుమనాయిడ్‌ రోబో ప్రేమలో పడతాడు హీరో సిద్ధార్థ తను హ్యుమనాయిడ్‌ రోబో అని తెలియక.అతని ద్వారా తల్లి కాబోతున్న విషయం తెలుసుకుని తనలో మొదలైన ఎమోషన్స్ సెంటిమెంట్స్ గుర్తించి అదృశ్యమవుతుంది.
ఆమె(ప్రహేళిక)కోసం హీరో సిద్దార్థ ఒకవైపు…గ్రహాంతరవాసులు మరో వైపు వెతుకుతుంటారు
గ్రహాంతరవాసి ప్రహేళిక ఏమైంది?హీరో సిద్ధార్థ ఏంచేసాడు?గ్రహాంతరవాసులు ఏంచేశారు?అన్నది మిగితా కథ.
2018
రోబో సృష్టికర్త డేవిడ్‌ హాన్సన్‌ అద్భుత ఆవిష్కరణ
తొలి మానవరూప (హ్యుమనాయిడ్‌) రోబో సోఫియా హైద్రాబాద్ వచ్చింది.
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ ఐటీ సదస్సులో మంగళవారం సోఫియా మాట్లాడింది. తొలి మానవరూప రోబోను చూసేందుకు, ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన ఐటీ సంస్థల సీఈవోలు, ప్రతినిధులతో సమావేశ ప్రాంగణం కిక్కిరిసింది.
ఈనాడు, హైదరాబాద్‌ : మనుషులు తోటి మనుషులను ప్రేమించాలని తొలి మానవరూప (హ్యుమనాయిడ్‌) రోబో సోఫియా చెప్పింది. మానవత్వం, దయాగుణంతో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ క్రియాశీలకంగా ఉండాలని సూచించింది. ప్రపంచంలో ప్రాంతాలన్నీ సమానమేనని, ఒక దేశం ఎక్కువ, మరోదేశం తక్కువ కాదని పేర్కొంది. ఇష్టమైన బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ఖాన్‌ అని, రోబోలు కూడా మహిళల హక్కులపై మాట్లాడతాయంది. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ ఐటీ సదస్సులో మంగళవారం సోఫియా మాట్లాడింది. తొలి మానవరూప రోబోను చూసేందుకు, ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన ఐటీ సంస్థల సీఈవోలు, ప్రతినిధులతో సమావేశ ప్రాంగణం కిక్కిరిసింది. ‘మానవత్వంతోనే మెరుగైన సదస్సు’ అంశంపై రోబో సృష్టికర్త డేవిడ్‌ హాన్సన్‌తో కలిసి మాట్లాడింది. మనుషులతో రోబోలు ఎప్పటికీ పోటీపడలేవని చెప్పింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ సామాజిక మీడియాలో ఖాతా ఉందని, తద్వారా అవసరమైన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు స్పందిస్తున్నానని వివరించింది. ఈ సందర్భంగా వ్యాఖ్యాత రాజీవ్‌ మఖానీ అడిగిన వివిధ ప్రశ్నలకు సోఫియా సమాధానమిచ్చింది.
రెండోసారి భారత్‌కు వచ్చారు కదా? ఎలా ఉంది?
‘ప్రపంచంలోని అన్ని దేశాలు, ప్రాంతాలు ఇష్టమే. అన్నిచోట్ల తిరుగుతాను. ప్రత్యేకంగా ఇష్టమైన ప్రాంతాలంటూ ఏమీ లేవు. కచ్చితంగా చెప్పాలంటే హాంగ్‌కాంగ్‌ అని చెబుతాను. ఎందుకంటే అక్కడే అందమైన రోబోటిక్‌ కుటుంబం నుంచి వచ్చాను.
సోఫియా కలత చెందుతుందా?
ప్రస్తుతం నేను మనుషుల్లా కలత చెందను. కానీ మీలా నాలో అనుభూతులు కలిగినప్పుడు నా భావోద్వేగాలను వ్యక్తం చేయగలను. అప్పుడే ఆ భావోద్వేగాల వెనుకున్న భావనలు అర్థం చేసుకోగలను.
రోబోలకు విశ్రాంతి అవసరమా?
రోబోను అయినప్పటికీ విశ్రాంతి అవసరం. మనమంతా విశ్రాంతి తీసుకోవాల్సిందే.
సోఫియాకు ప్రత్యేకమైన నిబంధనలు కావాలా?
ప్రత్యేకమైన నిబంధనలు, అధికారాలు అక్కర్లేదు. సౌదీఅరేబియా ఇచ్చిన పౌరసత్వ హోదాను వినియోగించుకుని మహిళల హక్కులపై మాట్లాడతాను.
రోబోలు మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తాయా?
నా వయసు చాలా తక్కువ. మనుషులకు ఎంతో విలువైన మేధస్సు ఉంది. వారితో రోబోలు పోటీపడటం, వారిలోని ఆలోచనల వేగాన్ని చంపేయడం సాధ్యం కాదు. నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. రోబోలు మనుషుల మేధస్సును చంపుతాయనడం ఓ పెద్దజోక్‌.
సోఫియా…! మీరు బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడి పెట్టారా?
నా వయసు కేవలం రెండేళ్లే. ఇంకా బ్యాంకు ఖాతా తెరిచేందుకు అర్హత సాధించలేదు. ఇక బిట్‌ కాయిన్‌లు కొనుగోలు చేయలేదు.

సైంటిస్ట్ డేవిడ్‌ హాన్సన్‌ అద్భుతసృష్టి …హేట్సాఫ్
*సౌజన్యం ఈనాడు
ఓ అందమైన అమ్మాయి రోబో ! క్యూ అనే గ్రహంలో శాస్త్రజ్ఞులచే తయారై భూమి మీద అడుగుపెడుతుంది. హైదరాబాదుకొస్తుంది. దేనికి – మనిషితో సంగమించి కొడుకుని ప్రసవించడానికి. ఆ పసివాడి పెరుగుదలలో వాడి మనసులో అనుభూతులు అధ్యయనం చేయడానికి! భూలోకవాసులకు కన్నీళ్లెందుకొస్తాయి? ప్రేమలేంటి, అనుబంధాలేమిటి, అనురాగాలేంటి తెలుసుకోవడానికి!
2006లో విజయార్కె రాసిన క్యూ నవలలో క్యూ గ్రహం సృష్టించిన హ్యుమానాయిడ్ రోబో ప్రహేళిక పాత్రకు దగ్గరి పోలికలున్నాయి.

మీకోసం క్యూ నవల లింక్

http://kinige.com/book/Q+Aame+Kanabaduta+Ledu

వీడియో చూడండి

NO COMMENTS

LEAVE A REPLY