డియర్ వర్మ…ఈ ఉత్తరాన్ని మీకు డెడికేట్ చేస్తున్నాను. మీకన్నా శ్రీదేవిని ఇంత ఎక్కువగా ఎవరూ ప్రేమించి ఉండరనే పర్సనల్ ఫీలింగుతో..మీకు గుండెనిబ్బరాన్ని ఇవ్వాలని మీరు(నేనుకూడా అనుకోండి )నమ్మని దేవుడిని కోరుకుంటున్నా

అమరావతికేగిన అద్భుతసౌందర్యానికి ఒకమాట 
డియర్ శ్రీదేవి 
మీమనసు చాలా సున్నితం.ఎవ్వర్నీ నొప్పించరు…అది స్వర్గాధిపతికి కూడా తెలుసు…
అంగుళీయకం ఒకసాకు మాత్రమే…స్వర్గంలో శ్రీదేవి ఉందని చెప్పుకోవాలనుకునే కీర్తికండూతితో మిమ్మల్ని తీసుకువెళ్లాడు.
కానీ మీ జ్ఞాపకమనే అంగుళీయకం ఇక్కడే వదిలివెళ్లారని దానికోసం మీరు ఇప్పుడో ఎప్పుడో ఒకప్పుడు వస్తారని
ఆ ఇంద్రుడికి తెలియదు.
మిమ్మల్ని రప్పించడానికి కోట్లాది హృదయాల ఆకాంక్ష స్వర్గాన్ని చుట్టుముడుతుంది..దేవతలు పుష్పవర్షం కురిపించారు…క్రిక్కిరిసిన  నీ అభిమానజనసంద్రంలోకి అవి చొచ్చుకురాలేకపోయాయి.
అయినా మా కన్నీటివర్షం ముందు ఆ పుష్పవర్షం ఏపాటి?
ఒక్కక్షణం ఆ దేవుడు నిన్ను బ్రతికిస్తే నిన్ను ప్రేమించే అభిమాన ప్రపంచాన్ని చూసి వదిలివెళ్లేదానివి కాదేమో…
నీ నటనకు
నీ వ్యక్తిత్వానికి
నీ అభినయ సౌందర్యానికి
నీ నిర్మలత్వానికి
నీ వేదనలకు
నీగుండెలోనే దాచుకున్న నీ గుండె నిబ్బరాన్ని…
చూసి వగచి వగచి కన్నీరవుతున్నవాళ్ళు ఎందరో…
డియర్ శ్రీదేవి
ఇది నీకు వీడ్కోలు కాదు…నీ పునరాగమనకి వేడుకోలు….
వస్తావు కదూ…
నీ భౌతికదేహం కనుమరుగైనా  నీ జ్ఞాపకాల పసిడివర్ణ  ఛాయాచిత్రం నిశ్చలమై మా హృదయాల్లో వుంది.
మా హృదయాలు శ్వాసిస్తున్నంతవరకూ వరకు అవి నిన్ను పలకరిస్తూనే ఉంటాయి.
అభిమానుల గుండెసవ్వడి యాక్షన్ అని ఎలుగెత్తి అంటోంది..నీ జ్ఞాపకం మా మనసు కెమెరా ముందు నటిస్తూ కనిపిస్తోంది.
వెండితెర పదం ఉన్నంత వరకు నీ బంగారు జ్ఞాపకం బ్రతికే  ఉంటుంది.
(ఈ ఉత్తరాన్ని నీకు పంపిస్తున్నాను .ఇంద్రుడు అసూయతో నువ్వెక్కడ తిరిగి భువికి వస్తావో అనే భయంతో రీ డైరెక్ట్ చేస్తే..అది సరాసరి నీగుండెకన్నా ఎక్కువగా నీకోసం కొట్టుకునే వర్మకు వెళ్తుంది …ఇంద్రుడి సంగతి వర్మ చూసుకుంటాడు)
…విజయార్కె
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY