హైద్రాబాద్ లో పాసనీపూరీ తింటే అరెస్ట్ చేస్తారా? మీడియా ముందే అడిగేశాడు డిటెక్టివ్ సిద్దార్థ …హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి …లిఫ్ట్ ప్లీజ్ (ఘోస్ట్ స్టోరీస్) 04-03-2018

(9)
అది ముంబాయి నుండి పూనే వెళ్లే రహదారి. ఆ దారి నిత్యం వందలాది వాహనాలు తిరుగుతు రద్దీ గా ఉంటుంది. అప్పటికే రాత్రి అయింది. చీకటి అమావాస్య కాటుకను పెట్టుకోవడం మొదలైంది. ఆ అమావాస్య చీకటిలో డిసౌజా ఒక బైకు మీద వస్తున్నాడు. బైకును ఎంతో అసహనంగా తప్పదన్నట్టు నడుపుతున్నాడు. కారణం తన కారు రిపేరికి రావడంతో మెకానిక్ కు అప్పచెప్పి అతని బైకు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పటికే సమయం అర్దరాత్రి అవుతోంది. వాహనాలు తిరగడం బాగా తగ్గిపోయి అపుడపుడూ మాత్రమే వెళుతున్నాయి వస్తున్నాయి.
అలా బైకు మీద వెళుతున్న డిసౌజాకు కొంచెం దూరంలో ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించారు. దగ్గరగా వెళ్లిన డిసౌజాకు అక్కడ నిజంగానే ఒక అమ్మాయి కనిపించింది డిసౌజాను చూడగానే ఆపమని తనకు లిప్టు కావాలని అడిగింది.
లిప్టు కావాలని అక్కడ ముందు ఉన్న మలుపు వద్ద దిగేస్తానని చెప్పింది. అర్దరాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న అమ్మాయి లిప్ట్ అడిగేసరికి కాదనలేకపోయాడు అలా డిసౌజా బైకులో వచ్చిన ఆ అమ్మాయి కొంచెం దూరం వెళ్లాక ఒక మలుపు దగ్గర దిగి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయింది. మరికొంతదూరం వెళ్లిన డిసౌజాకు కొద్దిదూరంలో ఎవరో కనిపించారు. దగ్గరగా వెళ్లిన డిసౌజాకు ఒకమ్మాయి లిప్ట్ అడిగింది. ఆ అమ్మాయిని చూసి ఉలిక్కిపడిన డిసౌజా మొదట వచ్చిన అమ్మాయిలా ఉందనుకుంటూ లిప్ట్ ఇచ్చి కొంతదూరంలో దింపేశాడు. మరికొంత దూరం వెళ్లాక అదే అమ్మాయి మరల లిప్టు అడిగింది. ఏమీ అర్థం కాని డిసౌజా కు భయం తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఇంతలో పక్కనే వికృతమైన నవ్వు తో డిసౌజాకు ఒళ్లు జలదరించింది. తనను లిప్ట్ అడుగుతున్నది ఒక దెయ్యం అని అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు. భయపడుతునే అక్కడనుండి వెళ్లిపోవాలని చూశాడు. కానీ తన బైకు తనకంటే ముందు వెళుతోంది ఎవరూ లేకుండానే. అంతలో అక్కడ వెళుతోన్న రెండు మూడు వాహనాలు శరవేగంగా ముందుకు వెళ్లిపోయాయి.
ఆ దృశ్యాన్ని చూసి డిసౌజా భయంతో స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఎవరో తట్టిలేపినట్టుగా మెలకువ వచ్చింది డిసౌజాకు.లేచి భయంభయంగా చుట్టూ చూశాడు అక్కడెవరూ లేరు. అంతా నిర్మానుష్యంగా అక్కడక్కడా వెలుగుతున్న లైట్ల తాలుకూ కాంతి తప్ప ఏమీలేదు. బైకు తన పక్కనే ఉంది. భయం నుండి తేరుకున్న డిసౌజా అక్కడనుండి వెళ్లిపోవాలని బయలుదేరాడు. కొద్దిదూరం ముందుకెళ్లేసరికి బైకు ఆగిపోయింది. అక్కడున్న భయానక వాతావరణంలో అలా ఆగిపోవడం డిసౌజాకు మరింత భయాన్ని పెంచింది. ఎందుకు ఆగిందో అర్థం కాని డిసౌజా బైకును పరిశీలిస్తున్నాడు.
బైకును చూస్తున్న డిసౌజా కళ్లు ఆశ్చర్యంతో కూడిన భయంతో నిండిపోయాయి. కారణం
బైకు తాలుకూ ముందు భాగం అతడినే చూస్తోంది. డిసౌజా ఎటుపక్క వెళితే అటుపక్క తిరిగి చూస్తోంది. అంతలో హెడ్ లైటు మీద ఏవో అక్షరాలు రాసి ఉన్నాయి. నేను దెయ్యాన్ని అని రాసి ఉంది.
వణికిపోతున్న డిసౌజా ఆ బైకును అక్కడే వదిలేసి పరుగు ప్రారంభించాడు . నల్లటి రోడ్డు చీకటి దుప్పటి కప్పుకుని ఇంకా భయపెడుతోంది. కొద్దిదూరం వెళ్లాక ఎదురుగా ఉన్న మలుపులో ఒకమ్మాయి వస్తోంది. ఆ లిప్ట్ అడిగిన దెయ్యపు అమ్మాయి మాత్రమే కాదు. అలాంటివాళ్ళు అలా ఒకరి తర్వాత దెయ్యాలు వస్తూనే ఉన్నారు. బాగా జడుసుకున్న డిసౌజాకు అడుగు ముందుకు పడలేదు. అక్కడే ఆగిపోయాడు.
తర్వాత డిసౌజా ఏమయ్యాడో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు..
కాలచక్రం తన పని తాను చేసుకుపోతోంది. రోజులు గిర్రున తిరిగాయి. ఆ రోజు అమావాస్య చీకటి చిక్కగా అలుముకుంది. ఆ రహదారిలో యథాతథంగా వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి.
అర్దరాత్రి అయింది. ఆ రోడ్డులో ఒక బైకు వెళుతోంది.ఆ బైకు మీదున్న వ్యక్తి తొందరగా గమ్యం చేరాలని శరవేగంగా వెళుతున్నాడు. అలా వెళుతున్న వ్యక్తికి ఒక వ్యక్తి లిప్ట్ అడుగుతూ కనిపించాడు. బైకు మీద ఉన్న వ్యక్తి “డిసౌజా” కు లిప్ట్ ఇచ్చాడు. బైకు కొంతదూరం వెళ్లి ఆగిపోయింది..
కథ మళ్లీ మొదలయింది!!
ముంబాయి నుండి పూణే వెళ్లేదారిలో వాహనాలను ఆపుతూ వాహనచోదకుల ప్రాణాలను హరించే దెయ్యం మహిళ ఉందని తెలిసిన సమాచారం ఆధారంగా…

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY