మొత్తానికి నాకు తెలిసిన విషయం ఏమిటంటే… స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (04-03-2018)

సాయంత్రం 5 గంటలు
బస్ పుట్టపర్తి బస్ స్టాండ్ లో ఆగింది.
అప్పటికే దాహంతో నోరు ఎండుకుపోతుంటే బస్ దిగిన వెంటనే ఇక ఎవరికోసం ఆగకుండా దగ్గరలోని షాప్ వైపు నడిచాను.
చల్లని పెప్సీ తాగడంతో కాస్త శక్తి వచ్చినట్టు అనిపించింది.
అప్పటికే మా జూనియర్స్ , ఆంటీ కూడా బస్ దిగారు.
పుట్టపర్తి బస్ స్టాండ్.
మొదటిసారి రావడంతో బస్ స్టాండ్ మొత్తం ఒక్కసారి చూశాను.
బస్ స్టాండ్ చాలా చిన్నది. తిరుపతి బస్ స్టాండ్ తో పోల్చుకోలేనివిధంగా ఉంది.
సాయంత్రం కావడంతో అక్కడ కోలాహలంగా ఉంది. మాలాగే వేరే ప్రదేశాల నుండి బాలవికాస్ స్టూడెంట్స్ బ్యాచ్ లుగా దిగుతున్నారు. అక్కడక్కడా బృందాలుగా నిలబడి ఉన్నారు.
ఒక్కో బ్యాచ్ లో పదిమందికి తక్కువ లేకుండా ఉన్నారు.
మొత్తానికి చాలా పెద్ద ప్రోగ్రాం జరిగేట్టు ఉంది అనుకున్నా. మేం బస్ స్టాండ్ లో ఎందుకు ఎవరికోసం వెయిట్ చేస్తున్నామో తెలియడంలేదు. అప్పటికే బస్ స్టాండ్ లో గంట పైగా గడిపాం.
నాకు బస్ వాసన పడకపోవడంతో వాంతి వచ్చేలా ఉంది. అయినా తప్పదు అన్నట్టు నిలబడ్డాను.
కాసేపు తరువాత నిలబడే ఓపిక లేకుండా మెల్లగా ఆంటీ పక్కన చేరాను.
ఆంటీని మాటల్లో దించుతూ అసలు విషయం రాబట్టడానికి ట్రై చేశాను.
మొత్తానికి నాకు తెలిసిన విషయం ఏమిటంటే… తిరుపతి బాలవికాస్ గ్రౌప్స్ అన్నిటికి కలిపి ఒక ఇంచార్జ్ ను వేశారు.
ఆయన వచ్చి మమ్మలను తీసుకువెళ్ళాలి. అప్పటివరకు అక్కడే వెయిటింగ్…
బాబోయ్… ఇదేం పనిష్ మెంట్… అతను రావడం ఎప్పుడో మేము అక్కడ నుండి బయలుదేరడం ఎప్పుడో… ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఎక్కడలేని నీరసం వస్తోంది.
పైగా ఆ కాలంలో సెల్ ఫోన్స్ లేవు. మేము వచ్చినట్టు ఆ మహానుభావుడికి తెలిసిందో లేదో..
అదే విషయం ఆంటీని అడిగితే… బయలుదేరేముందు ఆయనకు ఫోన్ చేయడం జరిగిందని… మేం ఎక్కిన బస్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిసింది…
ఇక ఆ దేవునిపై భారం వేసి అక్కడే వెయిట్ చెయ్యడం స్టార్ట్ చేశాం.
నాకెందుకో ఒకరికోసం ఎదురుచూడడం అంటే ఇష్టం ఉండదు. దానికి చాలా ఓపిక ఉండాలన్నది నాకు అనుభవంలోకి వచ్చిన విషయం.
అది కూడా ఎంతసేపు ఎదురుచూడాలో తెలియని పరిస్థితి ఉంటే దానికి మించిన దారుణం మరొకటి ఉండదని నా ప్రగాఢ నమ్మకం

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY