రెడ్ కలర్ తో నెంబర్ వేసి ఉన్నారు… అందులో లెక్కపెడితే దాదాపు ముప్పై ఎల్లో కలర్ లైన్స్ ఉన్నాయి….స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (18-03-2018)

నేను అలా చూస్తూ ఎంత సేపు నిలిచిపోయానో కానీ మా ఆంటీ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.
ఆశ్రమం మెయిన్ గేట్ నుండి లోనికి అడుగుపెట్టాం. ఆంటీకి తప్ప మిగిలిన అందరికి పుట్టపర్తికి రావడం ఫస్ట్ టైం అనుకుంటాను. కానీ నాకున్నంత షాక్ వాళ్లకు లేనట్టు ఉంది.
సాయిబాబా ఆశ్రమానికి దగ్గరగా కొన్ని డార్మిటరీస్ ఉన్నాయి.
డార్మిటరీస్ అంటే పెద్ద పెద్ద షెడ్స్… ఈ చివర నుండి ఆ చివర వరకు ఉండే పెద్ద రేకుల షెడ్.
అక్కడ చాలా డార్మిటరీస్ ఉన్నాయి. అన్నిటికి నంబర్స్ వేసి ఉన్నాయి.
మమ్మల్ని ఆ డార్మిటరీస్ దగ్గరకు తీసుకువెళ్ళారు. డార్మిటరీ లోపలకు తొంగి చూశాను.
లోపల చాలా క్లీన్ గా ఉంది. బహుశా అప్పుడే క్లీన్ చేసినట్టు ఉంది.
సైకిల్ పార్కింగ్ లా నేలపై పెయింట్ తో మార్కింగ్ వేసి ఉన్నారు.
రెడ్ కలర్ తో పెద్ద మార్కింగ్… దానిలో ఎల్లో కలర్ తో చిన్న చిన్న మార్కింగ్…
ఎందుకు ఈ మార్కింగ్…
స్కూటర్స్ లేక సైకిల్స్ ఏదైనా లోపల పార్క్ చేస్తారా?
ఒకవేళ అలా ఉంటే అన్ని వందల వెహికల్స్ ఎవరివి ఎక్కడ నుండి వస్తాయి?
మమ్మల్ని లోపలకు తీసుకెళ్ళి ఒక నెంబర్ వద్ద ఆపారు.
రెడ్ కలర్ తో నెంబర్ వేసి ఉన్నారు… అందులో లెక్కపెడితే దాదాపు ముప్పై ఎల్లో కలర్ లైన్స్ ఉన్నాయి.
ఆంటీ ఆయనతో మాట్లాడాక అతను వెళ్ళిపోయాడు.
అప్పటిదాక చేతిలో ఉన్న లగేజ్ ను ఆంటీ కిందకు దించింది. నాకు అర్థం కాకుండా ఆంటీ వంక చూశాను.
“మనం ఉండబోయేది ఇక్కడే అబ్బాయ్” అంటూ లగేజ్ ను రెడ్ కలర్ లైన్ కి ఆనిస్తూ పెట్టింది.
అప్పటికి కానీ నా మట్టి బుర్రకు విషయం అర్థం కాలేదు.
అక్కడికి వచ్చిన ప్రతి ఒక గ్రూప్ కి ఒక్కో రెడ్ మార్క్ ఉన్న ప్లేస్ కేటాయిస్తున్నారు. అందులో ఆ గ్రూప్ ఉంటుంది.
గ్రూప్ సైజ్ ను పట్టి ఒకటి నుండి నాలుగు ఐదు ప్లేసస్ అలాట్ చేస్తున్నారు.
అప్పటికే లగేజ్ మోసి చేతులు నొప్పులుగా ఉండడంతో ఇక ఓపిక లేక లగేజ్ దించాను.
మా జూనియర్స్ లగేజ్ పెట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు.
నా లగేజ్ ఒకపక్క పెట్టి హాల్ మొత్తం ఒక్కసారి కలయజూసాను.
అక్కడక్కడా జనం ఉన్నారు. అంటే ఇవన్నీ బాల వికాస్ వివిధ జిల్లాల నుండి వచ్చిన గ్రౌప్స్.
మా బస్ లో వచ్చిన తిరుపతికి చెందిన మరికొన్ని బ్యాచస్ కోసం చూశాను. ఎవరూ కనపడలేదు.
బహుశా వాళ్లకు వేరే షెడ్ కేటాయించి ఉంటారు.
షెడ్ అనగానే నాకు పశువుల షెడ్ మాత్రమే గుర్తుకు వచ్చేది. ఇప్పుడు అదే షెడ్ లో ఉండాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.
కానీ తప్పదు… మరో దారిలేదు. లగేజ్ అక్కడే పెట్టి ఆంటీకి చెప్పి బయటపడ్డాను.
మా జూనియర్స్ ఎవరూ నాతో రావడానికి సిద్ధంగా లేరు.
బాగా అలసిపోయి ఉన్నారు.
వెనుక నుండి ఆంటీ త్వరగా రమ్మని కేక వేస్తుంటే సరే అంటూ కదిలాను.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY