ఈ వారం టాప్ టెన్ లో ఘోస్ట్ స్టోరీస్ 13 … హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి … వింత ఆకారాలు (ఘోస్ట్ స్టోరీస్) 16-03-2018

మేన్ రోబో పాఠకులను ఆసక్తితో చదివించేలా చేసిన ఘోస్ట్ స్టోరీ ఆన్ లైన్ లో విడుదలైంది.ఈ వారం టాప్ టెన్ లో నిలిచింది… 

(12)
అది ఒక అటవీప్రాంతం ఆ అడవిలో భయంకరమైన మలుపులతో కూడి ఉన్న ఘాట్ రోడ్డు. ఆ ఘాట్ రోడ్డులో అక్కడక్కడా ప్రమాదహెచ్చరికలతో కూడిన బోర్డులు అక్కడక్కడా చిన్నపాటి బస్టాపులు కూడా ఉన్నాయి. 
కాలం తనపని తాను చేసుకుపోతూ ధాత్రిలో రాత్రిని మోసుకొచ్చింది. రాత్రి చీకటిని ఆవహించడం మొదలుపెట్టింది. నల్లని చీకటి నలువైపులనుండీ కమ్ముకొస్తోంది. 
ఆ ఘాట్ రోడ్డులో ఆ రాత్రివేళ కొంతమంది ప్రయాణీకులతో ఒక బస్సు ప్రయాణిస్తోంది.  మలుపులతో కూడిన ప్రమాదకరమైన దారి అయినందున రాత్రివేళలలో ఎలాంటి వాహనాలకు ప్రవేశం లేదు. కానీ ఆ బస్సు మధ్యదారిలో రిపేరి అయినందువలన గమ్యం ఆలస్యం అయింది. ఆ రాత్రి ఆ మలుపుల దారిలో పయనించడానికి అధికారులను అనుమతి కోరిన ఆ బస్ డ్రైవర్ అతి జాగ్రత్తగా బస్సును నడుపుతున్నాడు. ప్రయాణీకులందరూ నిద్రలో జోగుతున్నారు. తివారీ బస్సు ముఖద్వారానికి పక్కగా ఉన్న సీటులో నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడు.
అలా కొంతదూరం ప్రయాణించాక బస్ డ్రైవర్ కు మాగన్నుగా కునుకు అంటుతోంది. కష్టం మీద నిద్రను ఆపుకుంటున్నాడు. ఇంతలో ఎదురుగా ప్రమాదకరమైన మలుపు అదింకా దూరంగా కనిపిస్తోంది అనుకున్నాడు డ్రైవర్ కానీ ఆ మలుపు దగ్గర బస్సు అదుపు తప్పినట్టయింది. చాలా వేగంగా పెద్దకుదుపుతో బస్సు అదుపులోకి వచ్చింది. ఆ వేగానికి ప్రయాణీకుల నిద్రమత్తు వదిలి దాని స్థానంలో ఏం జరిగిందో అన్న ఆందోళన ఆక్రమించింది. ఏమీ జరగలేదని తెలుసుకున్న అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కానీ ఆ వేగపు కుదుపుకి ముఖద్వారం దగ్గరున్న తివారి బయటికి విసిరివేయబడ్డాడు. రాత్రి చీకటిలో ఆ విషయం ఎవరికీ తెలిసే అవకాశం లేకపోయింది.
అలా విసిరేయబడిన తివారి ఉలిక్కిపడి లేచాడు. ఏం జరిగిందో తాను అక్కడికెలా వచ్చాడో అర్థం చేసుకోవడానికి సమయం పట్టిన తివారికి ఆందోళన మొదలైంది. ఆ లోపు బస్సు చాలా దూరం వెళ్లిపోయింది. అక్కడక్కడా తగిలిన దెబ్బలతో చేసేదేమి లేక అక్కడనుండి నడక సాగించాడు తివారి. వాహనసంచారమే లేని చోట మనుషుల సంచారం ఎలా ఉంటుంది అనుకుంటూ ఎక్కడైనా ఆగి ఉదయాన్నే వెళ్లాలనుకున్నాడు తివారి. అలా కొంచెం ముందుకెళ్లి మలుపు తిరిగాక అక్కడున్న చిన్నపాటి బస్టాపును చూడగానే తివారికి ప్రాణం లేచి వచ్చింది. అక్కడున్న బెంచీల మీద పడుకుని ఉదయమే ఏదోలా వెళ్లాలనుకుంటూ అక్కడికి వెళ్లి పడుకున్నాడు. అర్దరాత్రి దాటింది. పడుకున్న తివారికి ఏదో అలికిడి కి మెలకువ వచ్చింది. అది అలికిడి కాదు బస్సు హారన్ కొడుతూ అక్కడ ఆగి ఉంది. వాహనాలు తిరగని ఆ సమయంలో ఆ బస్సు అక్కడికెలా వచ్చిందో ఆలోచించకుండా ఆ బస్సు ఎక్కాడు తివారి.
 ఆ బస్సులో కొందరు మాత్రమే ప్రయాణీకులున్నారు. వారంతా నిద్రలో ఉన్నారు. తివారి ఒక సీటులో కూర్చుని అలా కళ్లు మూసుకున్నాడు. టికెట్ అడిగితే ఏం చెప్పాలో అనుకుంటున్నాడు. కొద్దిసేపటికే బస్ లో ఏదో కోలాహలం మొదలైంది. కళ్లు తెరిచిన తివారికి ఏమీ కనిపించలేదు. ఎవరిస్థానాలలో వారు యథాతథంగా ఉన్నారు. మరీ కళ్లు మూసుకున్నాడు తివారి. కోలాహలం మొదలైంది. పక్కనే వినిపిస్తోంది కానీ కనిపించడం లేదు. తివారికి భయం మొదలైంది. ఆ చీకటిరేయిలో ఆ బస్ ఎక్కడికెళుతుందో తెలియక అక్కడ కలకలం ఎలా జరుగుతోందో అర్థం కాక వణుకు మొదలైంది. చుట్టూ చూశాడు ..ఆశ్చర్యం!! బస్ లో కొంతమంది కాదు చాలామంది ఉన్నారు. తన పక్కన కూడా ఎవరో ఉన్నారు. భయంభయంగా పక్కకి చూశాడు. అక్కడ మనిషి కాదు. అస్థిపంజరం ఉంది. చుట్టూ అందరినీ గమనించాడు వారందరూ రకరకాలుగా భయంకర రూపాలలో ఉన్నారు.కొందరికి కాళ్లు వెనక్కి తిరిగి ఉన్నాయి. మరికొందరికి స్పష్టమైన ఆకారాలు . తివారికి వెన్నునుండి వణుకు మొదలైంది. బస్ ను ఆపమని చెప్పడానికి డ్రైవర్ సీటు వద్దకు వెళ్లాడు. అక్కడి దృశ్యం చూసిన తివారికి గుండె ఆగినట్టయ్యింది. అక్కడే పడిపోయాడు
 రాత్రి సెలవు తీసుకుంది. ఆ మలుపుల రోడ్డులో వాహనాలు వెళుతున్నాయి. అక్కడ ఒక బస్ వెళుతోంది. ఒక మలుపు వద్ద ఎవరో ఒక వ్యక్తి నిలబడి బస్ ను ఆపుతున్నాడు. ఆ విషయం తెలియని డ్రైవర్ ముందుకు వెళుతునే ఉన్నాడు. కారణం ఆ వ్యక్తి కనిపించడు వినిపించడు. అతడు బస్ లో ప్రాణాలొదిలిన తివారి.
తివారి బస్ ను ఆపమని చెప్పడానికి డ్రైవర్ వద్దకు వెళ్లినపుడు అక్కడ ఎవరూ లేరు. ఎవరు లేకుండానే బస్ వెళుతూనే ఉంది. ఇంతలో బస్ ముందుభాగం నుండి ఒక ఆకారం లోపలికి తల పెట్టి చూసింది.
అది చూసిన తివారి దెయ్యం అనే భయానికి లోనై మరణించాడు..
తమిళనాడులోని సేలం  వెళ్లే దారిలో మలుపుల రోడ్డు ఉందని మలుపులలో ఎన్నో ఆకారాలు కనిపిస్తూ భయపెడుతూ మాయమవుతుంటాయని తెలిసిన సమాచారం ఆధారంగా …

ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/book/Ghost+Stories+13

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY