భోజనం చేసి అర్థరాత్రి టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసి షాకయ్యాడు డ్రైవర్ జేమ్స్… ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (08 -04 -2018 )

  3
ఒక్కసారిగా ఎవరో ఆ గోడౌన్ షట్టర్ పైకెత్తినట్టు బయట నుంచి వెలుతురు లోనికి వచ్చింది..ఆ వెలుతురులో ఓ మనిషి నీడ కనిపిస్తుంది.తర్వాత షట్టర్ వేసిన చప్పుడు.
“ఎవరూ ….కౌన్ హై ? ఆ నలుగురు అగంతకుల్లో ఒకడడిగాడు
‘తెలుగులో చెప్పాలా?హిందీలో చెప్పాలా?”అంటూ ఆ వెలుతురులో నుంచి  ఆ అపరిచిత వ్యక్తి ముందుకు వచ్చాడు …
“సర్ మీరా ?ఆశ్చర్యంగా అన్నాడు జేమ్స్
చేతిలో ఒక పేపర్ కప్..అందులో పానీపూరి ..ఒక పానీపూరి నోట్లో వేసుకుని “ఏమాటకామాటే చెప్పుకోవాలి..హైద్రాబాద్ బిర్యానీకి ఎంత పేమసో పానీపూరీకీ అంతే ఫేమస్.”అన్నాడు.
ఆ నలుగురు ఆగంతకులు విస్తుపోయి చూసారు.
“సర్ నన్ను వీళ్ళు ఎత్తుకొచ్చారు…ఎందుకెత్తుకొచ్చారో చెప్పమంటే మెంటల్ ప్రశ్నలు అడుగుతున్నారు”జేమ్స్ అన్నాడు…ఏడుపు గొంతుతో .
అతను జేమ్స్ దగ్గరికి వచ్చి కుర్చీకి కట్టిన కట్లు విప్పబోతుంటే నలుగురు ముందుకు వచ్చారు…
అతను వాళ్ళవైపు చూసి”అసలు మీ ప్రాబ్లెమ్ ఏమిట్రా? నేనేం మాట్లాడానో తెలుసుకుండమనేగా..నేను చెబుతాను..పాపం ఈ డ్రైవర్ భయ్యాను ఎందుకు కట్టేసారు?అని కట్లు విప్పేసి అదే కుర్చీలో కూచోని పానీపూరి తింటూ ఆ కప్పు ముందుకు పెట్టి ఇంకా రెండున్నాయి..కావాలంటే మీ ఇద్దరిలో ఎవరో ఇద్దరు తినండి ..”అన్నాడు కామ్ గా .
ఆ ఆగంతకులకు మొదటిసారి పిచ్చెక్కిన ఫీలింగ్ కలిగింది.ఎంత కూల్ గా తమ ప్లేస్ కు వచ్చి పానీపూరి తింటూ…
జేమ్స్ అతని వంకే చూస్తూ”సర్ నాకు బాండ్ సినిమా తెలుగులో చూస్తున్నట్టు వుంది…అసలు ఇదంతా ఏంటి సర్?ఆశ్చర్యం అనుమానం రెండూ మిక్సయ్యాయి అతని గొంతులో .
“నీకు మూడుముక్కల్లో చెబితే అర్ధమయ్యే మేటర్ కాదు జేమ్స్…ముందు మనం బయటకు వెళ్దాం పద..మరో పది గప్ చుప్ తింటే కానీ ఆకలి చల్లారదు ..అంటూ జేమ్స్ ను తీసుకుని బయటకు నడవబోతుంటే నలుగురూ రౌండప్ చేసారు.నలుగురి చేతుల్లోనూ రాడ్స్ వున్నాయి.
వాళ్ళ వైపు చూసి తిరిగి జేమ్స్ వైపు చూసి తన చేతిలోని పానీపూరి పేపర్ కప్ జేమ్స్ కు ఇచ్చి..”నువ్వు ఈ రెండింటినీ లాగించు.నేనో రెండు నిమిషాలు వీళ్ళతో మాట్లాడి వస్తాను..”అన్నాడు.
జేమ్స్ కన్ఫ్యూషన్ లోనే వున్నాడు..బయటకు నడుస్తుంటే షట్టర్ వేయి,,వీళ్లతో మాట్లాడొచ్చి నేను ఓపెన్ చేస్తాను…”అన్నాడు.
జేమ్స్ బయటకు వెళ్లి షట్టర్ వేసాడు..
సరిగా రెండునిమిషాల తర్వాత లోపలి నుంచి షట్టర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చాడు అతను…
జేమ్స్ పానీ పూరి కప్ అలాగే పట్టుకుని వున్నాడు..”ఏంటి రెండు నిమిషాలంటే రెండే నిమిషాల్లో వచ్చారు…వాళ్లకు ఏంచెప్పారు? అడిగాడు జేమ్స్
నవ్వి చెప్పాడు అతను “నిజం చెప్పాను” నీకు ట్రబుల్ ఇచ్చాను…సారీ భయ్యా,,..అన్నాడు అతను…
“పర్లేదు సర్ ఇప్పుడు నేను నా క్యాబ్ దగ్గరికి వెళ్ళాలి..ఈపాటికి ట్రాఫికోళ్ళు తీస్కెళ్ళిపోయుంటారు… అన్నాడు బాధగా…
అటుచూడు భయ్యా…అన్నాడతను
అటుచూసి షాకయ్యాడు జేమ్స్..తన క్యాబ్..
“నేనే అక్కడెందుకని నీ క్యాబ్ తీసుకొచ్చా”
అలానే చూస్తూ వుండిపోయాడు.అయినా కార్ కీస్ తన దగ్గరున్నాయి..అదే విషయం అడిగాడు..నవ్వి భుజం తట్టి “జేబులోని పర్స్ తీసి రెండువేల రూపాయల నోట్లు ఐదు ఇచ్చి”ఇవి నాకోసం వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నందుకు” అంటూ ముందుకు నడిచాడు.
అప్పుడే అతని పక్కన ఓ కార్ వచ్చి ఆగింది.అందులో ఎక్కాడు అతను..
డిటెక్టివ్ సిద్ధార్థ
***
భోజనం చేసి అర్థరాత్రి టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసి షాకయ్యాడు డ్రైవర్ జేమ్స్
“ఊరి చివర వున్న పాడుబడిన గోడౌన్ లో నలుగురు పేరుమోసిన గ్యాంగ్ స్టర్స్ తీవ్రమైన గాయాలతో చావుబ్రతుకుల్లో వున్నారు…ఈ నలుగురి మీద రౌడీ షీట్ కూడా వుంది…పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…
ఆ నలుగురి ముఖాలు … ఆ గోడౌన్ చూపించారు.
తనను బంధించిన గోడౌన్..
తనను పట్టుకెళ్లిన ఆగంతకులు…
చావుబ్రతుకుల్లో తీవ్రమైన గాయాలతో…
***
ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకూ…

ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/book/Ghost+Stories+13

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY