కాసేపు మనసు పెడితే మన వాళ్ళను పట్టుకోవడం సులభం అని తెలుసు కాబట్టి తాపీగా నడుచుకుంటూ ఆశ్రమం మెయిన్ ఎంట్రన్స్ వైపు కదిలాను…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (08-04-2018)

నాకో విషయం అర్థం కాదు…
బాగా చదువుకున్నవారు, మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా భక్తి …దేవుడు…అనగానే అంత తొందరగా ఎలా బాబాలను నమ్మేస్తారో..
ఒక మనిషిని దేవుడిగా భావించడం… సాగిలబడిపోవడం… ప్రపంచం ఉన్న వినయవిధేయతలు అంతా చూపించడం…
నాకు ఫుడ్ సర్వ్ చేసిన అతని వాలకం చూస్తుంటే మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిలానే కనిపించాడు కానీ ఏది మంచి ఏది చెడు అన్న విషయం మీద అవగాహన లేనట్టు ఉంది.
ఇలా ఆలోచిస్తూ నా డిన్నర్ పూర్తి చేశాను.
ఎవరి ప్లేట్స్ వాళ్ళే తీసేయడం అక్కడ పద్దతి కావడంతో నేను తిన్న ప్లేట్ తీసుకెళ్ళి కడిగి అక్కడే పెట్టేశాను.
ఆత్మారాముడు శాంతించడంతో మనసు కుదుటపడింది.
ఇక రూమ్ వెదుక్కునే ప్రహసనం ఒకటి ఉండడంతో కాంటీన్ బయటకు వచ్చాను.
ఆశ్రమం పెద్దగా ఉన్నా ఎక్కువ సేపు వెదకనవసరం లేదనిపించింది.
కాసేపు మనసు పెడితే మన వాళ్ళను పట్టుకోవడం సులభం అని తెలుసు కాబట్టి తాపీగా నడుచుకుంటూ ఆశ్రమం మెయిన్ ఎంట్రన్స్ వైపు కదిలాను. దారిలోనే మా వాళ్ళు ఎదురుపడ్డారు…
ఆంటీ పేస్ చూస్తే నేను కనపడక బాగా కంగారుపడినట్టు ఉంది. నన్ను చూడగానే పది నిముషాలు క్లాస్ పీకింది.
మౌనంగానే కాసేపు ఆ క్లాస్ విన్నాను. ఆంటీ మాకందరికీ జవాబుదారు కావడంతో ఆవిడ అన్న మాటలు నా మంచికే అని అర్థం అయ్యి సీరియస్ గా తీసుకోలేదు నేను.
తరువాత అందరం షెడ్ వైపు బయలుదేరాం. షెడ్ నెంబర్ మిస్ కాకుండా మనసులో గట్టిగా నోట్ చేసుకున్నాను.
మాకు అలాట్ చేసిన ఎల్లో లైన్స్ లోనే కూర్చున్నాం. తిన్న తరువాత ఖాళీగా కూర్చోవడం ఇబ్బందికరంగా ఉండడంతో పక్క రూమ్ (ఎల్లో గీత ప్రక్కన ఉన్న వాళ్ళు) లో ఉన్నవాళ్ళు ఏమి చేస్తున్నారో అని చూశాను.
మా బ్యాచ్ పక్కన ఉన్నవారు భజన్స్ స్టార్ట్ చేశారు.
సాయిరాం… సాయరాం…. అంటూ భక్తి పారవశ్యంలో మునిగి విపరీతంగా ఊగిపోతూ డక్కి పట్టుకుని దబదబా బాదేస్తూ పాడేస్తున్నారు…
వాళ్ళను చూస్తుంటే సాయిబాబా మీద భక్తి కన్నా భజన్ మీద పట్టు బాగా ఉందనిపించింది
అప్పటికే బాగా టైర్డ్ కావడంతో నిద్ర వస్తోంది.
ఈ వాయింపులో నిద్ర ఎలా పోవాలో నాకు అర్థం కాలేదు.
పక్కవారిని డిస్టర్బ్ చెయ్యడం మంచి పద్దతికాదని తెలియనట్టు ఉంది.
బహుశా సాయిబాబా ఈ మాట ఆ భక్తులకు చెప్పి ఉండడు.
ఇక లాభం లేదని చెవిలో వెళ్ళు పెట్టుకుని గట్టిగా ముసుగు పెట్టి పడుకున్నాను.
నన్ను చూసి మా జూనియర్స్ కూడా పడుకున్నారు.
నిద్ర ఎప్పుడు పట్టిందో కూడా తెలియలేదు.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY