బాలలవనం ఒక అక్షరాలవనం * నూలు పోగుకు నోచుకోని మగ్గంబతుకు… కుంచె చింతాలక్ష్మీనారాయణ..పుస్తకాల సమీక్ష

ఎంతో మంది పెద్ద పెద్ద కవులు సాహిత్య సేద్యం చేస్తున్నారు. ఎన్నో సంకలనాలు వేశారు. అందులో అమ్మపైన మాతృస్పర్శ, రైతులపై రైతు సకళనాలు, కార్మికులపై కార్మికుల సంకలనాలు ఇలా అన్నీ పేరు గాంచిన కవుల కవితలన్నీ ఒకే చోట పేర్చి సంకలనాలు చేశారు. అలాంటి కోవకు చెందిన సంకలనం విద్యార్థులతో శ్రీ అక్షరమాలి సురేష్ గారు మారుమూల గ్రామమైన ఆంధ్ర నుంచి కర్నాటక బార్డర్ వలస గ్రామంకు ఉపాధ్యాయుడుగా నియమితులయ్యాడు. అక్కడ అందరి మాతృభాష కన్నడ చదువు మాత్రమే తెలుగు. మొదట చిలా ఇబ్బందులతో విద్యార్థులను తన ఆట పాట కదలతో తన వైపు తిప్పుకున్నాడు.

తెలుగు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ సాహిత్యం పై అభిమానంతో విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసే విధంగా గోడపత్రికకు “బాలలవనం” అనే పేరు పెట్టి అందులో చిత్రాలు, పద్యాలు, చిన్నచిన్న కవితలు సేకరించి పెట్టేవారు. అప్పుడు తట్టిన ఆలోచనే విధ్యార్థులతో ఒక సంకలనం తేవాలని వెంటనే ఆ సంవత్సరం విధ్యార్థులకు కవిత్వం అంటే ఏమిటని ఎలా రాయాలని విధ్యార్థులకు అభిరుచి కలిగించి దాదాపు 46మంది విద్యార్థులతో ఒక సంకలనం వేయడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది.
మొత్తానికి “బాలలవనం” అనే పేరుతో ఒక సంకలనం తీసుకువచ్చారు. ఈ సంకళనం నాకు తెలిసి ఇరు రాష్ట్రలలో మొదట తీసుకువచ్చారు.
యం.రమేష్ అనే 7వ తరగతి విద్యార్థి చినుకు అక్షరం అనే కవితలో చినుకు చినుకు కలిసి పడితే వర్షం అంటారు/ అక్షరం అక్షరం కలిసి కాగితం మీద పడితే దానిని పుస్తకం అంటారని ఎంతో కొంత కవిత్వ చాయలుంటే కానీ ఇలాంటి భావం రాదని మనం చదివితే అర్థమైపోతుంది.
నదిలాంటి జీవితం అనే కవితలో విద్యార్థి కరుణ జీవితం పై ఎంత అవగాహన ఉంటే ఇలాంటి వాస్తవాలు రాస్తుందో చూడండి. కదులుతూ కదులుతూ ముందుకు నడువు నేస్తమా/ కష్టాలు రానీ దుఃఖాలు రానీ/ నీ ప్రయాణం సాగనివ్వు/ నీ ప్రయాణం కొనసాగనివ్వు/ కష్టాలే నీ జీవితం/ దుఃఖాలే నీ జీవెతం/ జీవితమనేది ఒక నదిలాంటిది ఇలా నది మలుపులు జీవిత మలుపులకు ముడి పెట్టి ఒక విద్యార్థి రాయడం అద్భుతమనిపించింది.
అర్పిత 10వతరగతి విద్యార్థి ఓ భరతమాత కవితలో ఓ భారతమాత అందుకో నా వందనాలు/ పిల్లలు నీ స్వేచ్ఛ కోరుతున్నారమ్మా/ కంటికి రెప్పలా కాపాడుతారమ్మా అంటూ భరతమాతని కాపాడుకోవాలని ఎంత దేశభక్తి ఉంటే ఇలాంటి అక్షరాలు ఒక మాల కూర్చిందోమరి.
మా ఊరి చెరువు అంటూ దీపిక 8వ తరగతి విద్యార్థి ఆ చెరువుపై ఉన్న అమితమైన ప్రేమను ఎంతో ఇష్టంగా చెప్పింది.
దేవుళ్ళు అనే కవితలో రాంచరణ్ 8వ తరగతి విద్యార్థి రాసిన వాక్యాలు దేవుళ్ళు పంచుతారు భక్తిని/ గురువులు పంచుతారు విద్యని/ అమ్మ నాన్నలు పంచుతారు ప్రేమని/ స్నేహితులు పంచుతారు సంతోషాన్ని అంటూ మనం ప్రతి ఒక్కరి నుండి ఎదో ఒకటి
ఈ పుస్తకంలో ఇంకా అమ్మ, ఆట, ఉదాహరణ, విజ్ఞానం, ఆకాశరాజు, నా ఆశ, విత్తనం, ప్రకృతి, చదువులమ్మ జీవితం, గోరింటాకు, ప్రాణం, నేనే శ్రీశ్రీ, అయ్యోపాపం, కత్తి కన్నా కలం మిన్న ఇలా ఈ పుస్తకంలో 146 కవితలు, మినీ కవితలు ఉన్నాయి. విద్యార్థులులతో ప్రతి ఉపాధ్యాయుడు అందరూ తప్పకుండా చదివించాల్సిన పుస్తకం.

నూలు పోగుకు నోచుకోని మగ్గంబతుకు
అతి ప్రాచీన కాలం నుండి స్రీ పురుషుల శరీరాలకు ధరిస్తున్న గుడ్డలను తయారు చేస్తున్న చేనేత కారులకు ఆనాటి నుండి ఈనాటి వరకూ వారి శ్రమకు తగ్గఫలితం అందక, పూట గడవక, చేసిన అప్పులు తీరక బతుకు బారంగా సాగుతోంది అలాంటి సమయంల మగ్గంబతుకు దీర్ఘ కవితను డా.ఉమ్మడిశెట్టి రాధేయగారు రాశారు. ఆయన చేనేత కుటుంబం నుండే వచ్చారు. చేనేత కుటుంబంలోని కష్టాలు బాధలు అన్నీ ఆయనకు తెలుసు అందుకే ఈ “మగ్గంబతుకు”గా పురుడుపోసుకుంది.
మగ్గంబతుకు దీర్ఘ కవిత పుస్తకంలో మొదటగా ఇది మా యదార్థ కథ, చేనేత చిత్రపటంలో విరిగిన మగ్గం వ్యదతో మొదలవుతుంది. చేనేత పని చేసే వారి దేహం సగం గుంతలో సంగం భాగం పైన ఉంటుందంటూ ఎంతో ఆర్తిగా చెప్పారు.
రాధేయ గారు చేనేతల ఆత్మహత్యలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎందుకు చేసుకున్నారో అంటూ అప్పుల చావులు, వలసల బాటలు, వెతలపాటలు, పురుగుల మందుతో చావులు, పుట్టెడు వ్యథలు, నలిగిపోతున్న బతుకులు చేనేత బతుకులు అంటూ వారి కన్నీటికి సాక్షమయ్యారు.
చేనేత వృత్తి పురాణాలకంటే పవిత్రమైన వృత్తి, వెలిగే వృత్తి, ప్రాచీన వృత్తి, వ్యవసాయం తర్వాత ఈ చేనేత వృత్తికి అంత విలువుందని చేనేత వృత్తి గగన సీమలో జాతీయ పతాకమై రెపరెపలాడిందని చేనేత వృత్తి ఔన్నత్యాన్ని తెలిపారు.
చేనేతకార్మికుల కళా నైపుణ్యాన్ని రాధేయ గారు ఇలా చెప్పారు ఆరు గజాల నేత చీరను అగ్గిపెట్టెలో అందంగా మడత పెట్టి అంతర్జాతీయ కీర్తిని సాధించిన కళాకారుడు చేనేత కారుడు. అలాండి వారికి నేడు జానెడు పొట్టకు పిడికెడు మెతుకులు నింపుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడని తెలిపారు.
చివరగా మా నేతగాళ్ళ ఆకలి చావులకు మా ఓటుతో గెలిచిన నాయకులంతా బాధ్యులు కారా? కొత్త వాగ్దానాలు పుట్టుకొస్తుంటాయ్ ఈ పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నించక తప్పలేదు మాకు అని మగ్గం బతుకులో రాధేయ గారు భళిరే..కోబలీ అంటూ మా చేనేత వృత్తిని కాపాడుకుంటామని పాలకులను ప్రశ్నించి హెచ్చరించారు.

సమీక్ష: కుంచె చింతాలక్ష్మీనారాయణ (ఎద్దులపల్లి)

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY