చీకటితెరలు తొలగక ముందే…పడగ్గది కిటికీ తలుపు వేయబోతూ ఉలిక్కిపాటుతో వణికిపోయాడు.. కిటికీ అవతల..ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (15 -04 -2018 )

                                    4
రెండునిమిషాల్లో అతనేం చేసాడో అర్థమైంది.కానీ అదెలా సాధ్యమైందో అర్థం కాలేదు.కేవలం సినిమాల్లోనే చూసాడు.అతను చెప్పిన నిజం ఏమిటి?ఇంతకూ అతనెవరు? ఆలోచనలతో జేమ్స్ బుర్ర వేడెక్కిపోయింది.అలాగే ఆలోచిస్తూ నిద్రపోయాడు.
ఇంకా పూర్తిగా  తెల్లవారాక ముందే….
ఉదయం నుంచి విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి.పొద్దునే తన భార్య తనని హడావుడిగా నిద్రలేపడం గుర్తుంది.తను నిద్రమొహంలోనే అడిగాడు”విషయం ఏమిటని?
“డేవిడ్ అన్నయ్య మీకోసం బయట నిలబడ్డాడని చెప్పింది…”తను దిగ్గున లేచాడు.
నిద్రమత్తు ఎగిరిపోయింది.ఎందుకంటే…”డేవిడ్ రెండురోజుల క్రితమే కారు ఆక్సిడెంట్ లో చనిపోయాడు..పుట్టింటి నుంచి రాత్రే వచ్చిన భార్యకు ఆ సంగతి చెప్పలేదు…”
” వెళ్ళండి … ఇంత  పొద్దున్నే డేవిడ్ అన్నయ్య మనింటికి వస్తే “పనీపాటా లేదా అన్నయ్యా..మా ఆయన్ని చెడగొట్టడానికి ..అని నేను తిడతానని బయటే వున్నాడు…రాత్రి జీసస్ కనిపించి ఎవ్వర్నీ నిందించవద్దు,,,నొప్పించవద్దు”అని చెప్పారు…లోపలి రమ్మనండి..కాఫీ తాగి వెళ్తాడు “అంది
ఒక్కక్షణం జేమ్స్ మనసు చివుక్కుమంది.
“డేవిడ్ ఈ మాటలు వింటే చాలా సంతోషించేవాడు…ఒక్క తాగడం తప్ప మరే దురలవాటు లేదు..అ.అందుకే తన భార్య లోపలికి   రానివ్వదు..అయినా రెండ్రోజుల   క్రితమే తను తాగుడు మానేస్తున్నట్టు చెప్పాడు..అంతలోనే ఆక్సిడెంట్…చిన్నచిన్న తప్పులను క్షమించినా…ఓర్పును వహించినా ద్వేషాన్ని విడిచి ప్రేమను పంచినా ప్రపంచ పచ్చదనపు  మానవత్వంతో పచ్చగా ఉంటుంది..అనుకున్నాడు.
విచిత్రమేమిటంటే డేవిడ్ మందు మానేసాడు…మానేసిన రెండో రోజే ఆక్సిడెంట్ లో చనిపోయాడు.
భార్య  లోపలికి వెళ్ళింది..జేమ్స్ మెదడు పనిచేయడం మానేసింది….కొద్దిక్షణాలు.
డేవిడ్ భార్యకు కనిపించడం ఏమిటి? జేమ్స్ కు కొన్ని నమ్మకాలున్నాయి..కొన్నింటికి లాజిక్కులు ఉండకపోవచ్చు..మరికొన్ని లాజిక్కులు దొరికేవరకు నిలబడకపోవచ్చు…ఒక రచయిత రాసిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు…
“మనల్ని భయపెట్టే వాటిని లాజిక్కు వున్నా వదిలేయండి…
నమ్మకం కన్నా నిజం కన్నా..మనం సంతోషంగా బ్రతకడం ముఖ్యం..మనల్ని భయానికి లోనుచేసే ..అభద్రతాభావాన్ని కలిగించే విషయాలను వదిలేయండి…”
నిజమే కానీ ఇప్పుడు రెండు విషయాలు అతడిని ఆలోచింపజేస్తున్నాయి..
చనిపోయిన డేవిడ్ భార్యకు కనిపించడం…
ఒక మామూలువ్యక్తి కోసం పేరుమోసిన రౌడీలు రంగంలోకి దిగడం రెండే నిమిషాల్లో వాళ్ళను ఘోరంగా గాయపరచడం….
అతని ప్రశ్నకు సమాధానం దొరకడానికి ఆలోచనల చీకటితెరలు తొలిగిపోవాలి
చీకటితెరలు తొలగక ముందే…పడగ్గది కిటికీ తలుపు వేయబోతూ ఉలిక్కిపాటుతో వణికిపోయాడు..
కిటికీ అవతల..తన ఇంటి ముందు…తనవైపే చూస్తూ డే…వి…డ్ 
(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్)
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY