ఆ మాటలు విని ఉలిక్కిపడి ఆమె వైపు చూసి “మీరెవరు మేడం?అని అడిగాడు….ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (22 -04 -2018)

   5
భయం అనుమానం రెండూ ఏకకాలంలో కలిగాయి జేమ్స్ లో…
తాను చూస్తున్నది డేవిడ్ నేకదా ? డేవిడ్ డెవిల్ లా మారాడా? చచ తన ఆలోచన తనకే ఏదోలా అనిపించింది ఇలాంటి విచిత్రమైన సంఘటనలు తనకే ఎదురవుతున్నాయా? బుర్ర హీటెక్కిన ఫీలింగ్ ..వెంటనే అక్కడి నుంచి కదిలాడు….
***
ప్యాంట్ జేబులో చేయిపెట్టుకుని నడుస్తున్నాడు సిద్ధార్థ.హైద్రాబాద్ అతనికి కొత్తగా కనిపిస్తోంది.ఒకసంవత్సరంలోనే ఎంతో మారినట్టు అనిపిస్తోంది.మెట్రో రైలు పైనుంచి వెళ్తుంటే చూడ్డం బావుంది.స్కూల్ పిల్లలు యుద్ధానికి వెళ్తున్నట్టు వీపున పుస్తకాల బ్యాగు మోస్తూ వెళ్తున్నారు…ఇంకా సూర్యుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టలేదు.
ఓ మూలమలుపు తిరిగాడు..ఇంకా తాను ఎదురుచూస్తోన్న సంఘటన ఎదురవ్వలేదు.తన అంచనా ప్రకారం ఈపాటికి రియాక్షన్ ఆక్షన్ లోకి వచ్చి ఉండాలి.
రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది.తాను క్యాబ్ డ్రైవర్ జేమ్స్ ను కాపాడి…గోడౌన్ లో రౌడీలను చితక్కొట్టాక జేమ్స్ ను పంపించి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కొందరు ఆగంతకులు తన మీద ఎటాక్ చేయడం గుర్తొచ్చింది.తను పరుగెడుతున్నాడు..ఆ ఏరియా లో వున్న సిసి కెమెరాలకు తన పేస్ కనిపించేలా పరుగెడుతున్నాడు….
తనకు వాళ్లకు మధ్య ఛేజింగ్…వాళ్ళు కత్తులతో వెంబడించారు…ఈ తతంగాన్ని ఆ వీధిలో వున్న సిసి కెమెరాలు రికార్డు చేస్తూనే వున్నాయి…దానికి తోడు మరో స్మార్ట్ ఫోన్ లో కూడా ఛేజింగ్ దృశ్యాలు షూట్ అవుతున్నాయి….
సరిగ్గా తెల్లవారు ఝామున కొని మీడియా ఛానెల్స్ కు వాట్సాప్ మెసేజెస్ వెళ్ళాను…వీడియో క్లిప్స్ తో సహా..డిటెక్టివ్ సిద్ధార్థ ను హైద్రాబాద్ లో కొందరు రౌడీలు వెంటబడి దాడి చేసే ప్రయత్నం చేసారు..అని ఆ వాట్సాప్ సారాంశం..
ఆ మాత్రం చాలు మీడియా కు …డిబేట్స్..లైవ్ లు…రచ్చరచ్చ చేయడానికి..
అప్పటికి కొన్ని ఛానెల్స్ స్క్రోల్స్ మొదలెట్టాయి..అర్థరాత్రి డిటెక్టివ్ సిద్ధార్థ మీద హత్యాప్రయత్నం..?
డిటెక్టివ్ సిద్ధార్థ హైద్రాబాద్ కు ఎందుకు వచ్చినట్టు?
డిటెక్టివ్ సిద్ధార్థ మీద హత్యాప్రయత్నానికి మోటివ్ ఏమిటి?
దానికి తోడు డిటెక్టివ్ సిద్ధార్థను రౌడీలు వెంబడిస్తున్న దృశ్యాలు..పొద్దున్నే కావలిసినంత మసాలా…. టీవీ ఛానెల్స్ కు.
ఈ స్క్రోలింగ్స్ తో పోలీసులు ఎలర్ట్ అయ్యారు..సిద్ధార్థను ఛేజ్ చేసిన ఏరియాలలో వున్న సిసి కెమెరాల ఫుటేజ్ లను తెప్పించారు….
డిటెక్టివ్ సిద్ధార్థ ఆలోచన అంచనాలు ఎప్పుడూ తప్పవ్వవు..తలక్రిందులు అవ్వవు..సిద్ధార్థ మూలమలుపు తిరుగుతుండగానే కొని టీవీ ఛానెల్స్ వెహికల్స్ అక్కడికి వచ్చేసాయి..వస్తూనే సిద్ధార్థను చుట్టేసాయి.
సిద్ధార్థకు కావలిసింది అదే
“మీరు డిటెక్టివ్ సిద్ధార్థ కదూ.,నిన్న రాత్రి మిమ్మల్ని కొందరు రౌడీలు చంపాడని ప్రయత్నించారా?ఇలా ప్రశ్నలు సంధిస్తూనే అతడిని
స్టూడియోకు తీసుకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు…
***
జేమ్స్ టిఫిన్ చేసి బయటకు వెళ్తూ ఓసారి టీవీ ఆన్ చేసాడు..ఎప్పుడైనా బయటకు వెళ్లే ముందు టీవీ చూడ్డం అతనికి అలవాటు..వాతావరణం గురించి..ట్రాఫిక్ గురించి తెలుస్తుందని అతని ఉద్దేశం…
అప్పుడే స్క్రోల్న్గ్స్ చూసాడు.. ఓ స్టూడియోలో రాత్రి తనను కాపాడిన వ్యక్తిని చూసాడు…తనను కాపాడింది డిటెక్టివ్ సిద్ధర్హ అని తెలిసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు..
టాక్సీ స్టాండ్ కు బదులు సిద్ధార్థను ఇంటర్వ్యూ చేస్తున్న స్టూడియో కు వెళ్లాలని డిసైడ్ అయ్యాడు.. డిటెక్టివ్ సిద్ధార్థను కలుసుకోవాలి..అనుకున్నాడు.
తన క్యాబ్ ను స్టూడియో వైపు తిప్పాడు…
కొద్దిదూరం రాగానే బ్లూ జీన్స్ ,వైట్ రౌండ్ నెక్ టీ షర్ట్ తో వున్న ఒకమ్మాయి క్యాబ్ ను ఆపింది…
మహిళలు వృద్ధులు పిల్లలు ఆపితే వెంటనే క్యాబ్ ను ఆపే మంచి అలవాటు వున్న జేమ్స్ క్యాబ్ ఆపి తల బయటకు పెట్టి”సారీ మేడం…నాకు వేరేపని వుంది”అని చెప్పాడు.
“టీవీ స్టూడియో వరకే….”అంది ఆ అమ్మాయి.
ఒక్కసారిగా ఆమె వైపు చూసాడు…టీవీ ఛానెల్ లో పనిచేసే యాంకర్ కాదు కదా?లేకపోతె న్యూస్ ప్రెజెంటర్ ? డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదివే జేమ్స్ అలా లోచిస్తూ ఉండగానే ఆ అమ్మాయి క్యాబ్ ఎక్కి చెప్పింది”సారీ ఇంతకన్నా వేరే మార్గం లేదు..లేదంటే ఆ సిద్ధార్థ జారిపోతాడు”అంది.తంలో తాను గొణుక్కుంటున్నట్టు
ఆ మాటలు విని ఉలిక్కిపడి ఆమె వైపు చూసి “మీరెవరు మేడం?అని అడిగాడు.
“సుగాత్రి…ప్రం సిబిఐ “చెప్పింది

(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్)
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY