దగ్గరలో ఉన్న ఒక సిమెంట్ బెంచ్ ఎక్కి నిలుచున్నాను. అందరూ చేతులు జోడించి ఒక వైపుకు చూస్తున్నారు…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (22-04-2018)

నా ప్రక్కన ఉన్నవారు ఏదో మాట్లాడుకుంటున్నారు…
ఆ మాటల్లో నాకు అర్థం అయ్యింది ఏమంటే సాయిబాబా భక్త జనాన్ని చూడడానికి (తన దర్శనం ఇవ్వడానికి) వస్తున్నారంట…
అక్కడ ఉన్నవారితో పాటు నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది.
అందరూ ఇంతగా భజనలు చేసేస్తూ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో చూడాలనిపించింది. అవకాశం దొరికితే మా స్కూల్ లో ఆయన కోసం చైర్ వేసి భజన చేసినప్పుడు ఎందుకు రాలేదా అని అడగాలని అనిపించింది.
దగ్గరలో ఉన్న ఒక సిమెంట్ బెంచ్ ఎక్కి నిలుచున్నాను. అందరూ చేతులు జోడించి ఒక వైపుకు చూస్తున్నారు. నేను కూడా వాళ్ళు చూస్తున్న వైపు చూశాను.. అక్కడ ఏమీ కనపడలేదు.బహుశా భక్తి ఉంటే కాని దేవుడు కనపడడు కదా…నాకు భక్తి ఎలాగూ లేదు కాబట్టి నాకు కనపడకపోవడంలో వింత ఏమీ లేదు అనుకున్నా…
ఇంతలో…
అక్కడ ఒక్కసారి నిశబ్ధం…
ఒక్క మనిషి కూడా కదలడం లేదు. రెప్ప ఆర్పడం లేదు. వాళ్ళను అలా చూస్తుంటే నాకు నేను చిన్నప్పుడు ఆడిన స్టాట్యూ ఆట గుర్తుకు వచ్చింది.
మనిషి కదులుతుంటే ఒక్కసారి స్టాట్యూ అనగానే అలా బొమ్మలా కదలక నిలుచుండిపోవాలి. రిలీజ్ అని అనగానే కదలొచ్చు… ఇప్పుడు వీళ్ళను చూస్తుంటే అలాగే ఉంది. పైగా నాకు చూడడానికి సరదాగాఉంది…
అలా కొన్ని మొహాలు చూస్తుంటే భక్తి మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఆనందంతో తన్మయత్వంలో మునిగి తేలిపోతున్నారు.. కనురెప్పలు కదిలితే ఎక్కడ దర్శనం మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా ఉన్నారు.
ఇంతలో అందరి చూపు ఒక దిక్కున నిలిచింది. నేను కూడా ఆ వైపు చూశాను.
దూరంగా…
వెల్వెట్ కాషాయ దుస్తులలో పొట్టిగా తల నిండా జుత్తుతో నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు..
సాయిబాబా… జనం ఎంత పిచ్చిగా పూజిస్తారో… ఎంత భక్తిగా మొక్కుతారో… అతనే
నాకు కాస్త దూరంలో… అందరూ అతని కాళ్ళపై పడిపోతున్నారు…
అతను కూడా తానే దేవుడని ఫీల్ అయినట్టు ఉన్నాడు…. ఆశీర్వాదాలు ఇస్తూ చిరునవ్వు నవ్వుతూ… గాలిలో చేతులు ఊపుతూ వస్తున్నాడు.
గాలిలో చేతులు ఊపడం కూడా వెరైటీగా ఉంది… ఏమిటో ఈ భ్రమ అన్నట్టు చేతులు ఆకాశం వైపు చూపుతున్నాడు.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY