“సిద్ధార్థను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయలేము..తాను అరెస్ట్ కావాలనుకుంటేనే అరెస్ట్ చేయగలం” చెప్పింది.సుగాత్రి … ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (29-04-2018)

                                         (6)
ఒక్కక్షణం జేమ్స్ కు తను థియేటర్ లో స్క్రీన్ మీద కాకుండా కళ్లెదురుగానే క్రైమ్ సినిమా చూస్తున్నట్టు ఫీలయ్యాడు.తను చదివిన డిటెక్టివ్ నవలల్లోని పాత్రలు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఫీలయ్యాడు.
కొద్దిగా సంశయంగా అడిగాడు”మేడం మీరు సిద్ధార్థ గారిని అరెస్ట్ చేస్తారా?”తన ప్రశ్న తనకే చిత్రంగా అనిపించింది .అదీగాక తను అనవసరంగా నోరు జారేనేమోననుకున్నాడు.
సుగాత్రి జేమ్స్ వైపు చూసి చిన్నగా నవ్వి “సిద్ధార్థను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయలేము..తాను అరెస్ట్ కావాలనుకుంటేనే అరెస్ట్ చేయగలం” చెప్పింది.
ఇంకా ఏదో అడగలనుకున్నాడు కానీ అప్పటికే టీవీ స్టూడియో వచ్చింది.టీవీ స్టూడియో దగ్గర సెక్యూరిటీ జేమ్స్ క్యాబ్ ను ఆపింది…సుగాత్రి తన ఐడెంటిటీ చూపించింది.క్యాబ్ తో సహా లోపలికి పంపించింది సెక్యూరిటీ,
“థాంక్యూ మేడం..మీరు నన్ను గేట్ బయటే వదిలేస్తారనుకున్నా…నాకు సిద్దార్థ సర్ ను కలవాలనుంది..రాత్రి ఏం జరిగిందంటే….”జేమ్స్ చెప్పడం మొదలుపెట్టాడు..ఒక్క డేవిడ్ ఇన్సిడెంట్ తప్ప.
అదికూడా చెప్పి ఉంటే కథలో మరోమలుపు వచ్చి చేరేది.జేమ్స్ ఇంకా కన్ఫ్యూజన్ లోనే వున్నాడు…సిబిఐ ఆఫీసర్ తన క్యాబ్ లో రావడమేమిటి ? గవర్నమెంట్ వెహికల్ వుంటుందిగా ?
జేమ్స్ ప్రశ్నకు సమాధానం దొరకడానికి టైం పడుతుందని ఆ క్షణం అతనికి తెలియదు.
అదే సమయంలో స్టూడియోలో డిటెక్టివ్ సిద్ధార్థను లైవ్ లో ఇంటర్ వ్యూ చేస్తున్నారు,
***
సిద్దార్థ కాఫీ కప్ ను చేతిలోకి తీసుకుని కాఫీ స్మెల్ చూసి యాంకర్ తో “కాఫీ స్మెల్ అదిరింది..ఫిల్టర్ కాఫీ అనుకుంటా…వేడివేడి జీడిపప్పు ఉప్మా అయితే ఇంకా బావుండేది”అన్నాడు.
లైవ్ కవర్ చేస్తోన్న క్రూ షాకైంది లైవ్ లో సిద్దార్థ ఇలా మాట్లాడుతాడనుకోలేదు..యాంకర్ ఓ వెర్రి నవ్వునవ్వి “మీరు చాలా సరదాగా మాట్లాడుతారు సిద్దార్థగారు “అంది.
“నేను సీరియస్ గానే అడిగాను..అన్నట్టు చిన్న డౌట్ అడగొచ్చా?అన్నాడు
యాంకర్ ఒక్కక్షణం ఉలిక్కిపడింది.”ఏమడుగుతాడు? తన కురచ దుస్తులవైపు చూసుకుని కంగారు “అడగండి”అని
“షార్ట్ బ్రేక్ లో గప్ చుప్ అదే పానీపూరి ఇవ్వగలరా..ఇలా కాఫీ కప్ పట్టుకుని గంటసేపు ఇంటర్ వ్యూ అయ్యేవరకూ లిబర్టీ అఫ్ స్టాచ్యూలా పట్టుకుని కాఫీ చప్పరిస్తూనే…తాగుతున్నస్టు పెదవులకు పెట్టుకుని ఉండడం బోర్ ..అదే పానీపూరి ఐతే సూపర్ టేస్ట్..”అన్నాడు.
“ష్యూర్ ష్యూర్ ముందు మనం మేటర్ కు వద్దాం “అంది యాంకర్
“ముందు చల్లని వాటర్ తెప్పించండి..మినరల్ వాటర్…”చెప్పాడు సిద్దార్థ
లైవ్ లో ఇదంతా టీవీల ముందు కూచున్న జనం చూస్తున్నారు.స్టూడియో లో వున్న టీవీలో సుగాత్రి,జేమ్స్ చూస్తున్నారు…వీళ్ళతో పాటు మరో వ్యక్తి..చూస్తున్నాడు.
అతనే…మిస్టర్ ” డి “…
నేర ప్రపంచంలో చీకటిరాజు…
మాఫియాసామ్రాజ్యంలో ” డి “అంటే “డి ఫర్ డెత్..: దయాళ్ కు ఎదురువెళ్తే చావు తప్పదు…
పోలీస్ రికార్డ్స్ లో డి అంటే డెవిల్…డి అంటే దయాళ్…
దయ అనే పదానికి అర్థం తెలియని అండర్ వరల్డ్ డాన్…డ్రగ్స్ ను ఆయుధంగా మార్చి దేశాన్నే కాదు ప్రపంచదేశాల్లో యువతను చిన్నారులను సైతం డ్రగ్స్ కు బానిసలుగా చేసే అతి ప్రమాదకరమైన వ్యక్తి….

***
“మీరు హైద్రాబాద్ కు ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా?అడిగింది యాంకర్
“ష్యూర్…హైద్రాబాద్ లో పానీపూరి అంటే చాలా ఇష్టం…ఐ లవ్ పానీపూరి “అన్నాడు సిద్దార్థ.
“పానీపూరి గురించి ఢిల్లీ నుంచి వచ్చారా? ఆశ్చర్యంగా అనుమానంగా అడిగింది యాంకర్
“మన హైద్రాబాద్ బిర్యాని కోసం విదేశాల నుంచి ఇండియా వచ్చి హైద్రాబాద్ కు వచ్చి బిర్యానీ తినేసి వెళ్తారు..అంతెందుకు మన రాహుల్ గాంధీకి కూడా హైద్రాబాద్ బిర్యానీ అంటే ఇష్టం” చెప్పాడు సిద్దార్థ.
“మరి మీ మీద ఎటాక్ ఎందుకు జరిగింది? అంటూ ఎటాక్ జరిగిన విజువల్స్ ను ప్లే చేసింది టీవీ ఛానెల్.
“అదే నాకర్థం కావడం లేదు…”అమాయకంగా మొహం పెట్టి అన్నాడు సిద్దార్థ
ఈలోగా యాంకర్ కు వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది.అది చదివి సిద్ధార్థతో చెప్పింది యాంకర్.”మిమల్ని అరెస్ట్ చేయబోతున్నారట…మాకు అందిన విశ్వసనీయ సమాచారం ”
“పానీపూరి తింటే అరెస్ట్ చేస్తారా? మరింత అమాయకంగా అడిగాడు సిద్దార్థ,
“మీరు సంవత్సర కాలంగా ఈ వృత్తికి దూరంగా వున్నారు.ఎందుకో తెలుసుకోవచ్చా? అడిగింది యాంకర్
“ప్రతీక్షణం టెన్షన్ ..అవసరమా? పైగా సినిమాల్లో యాక్ట్ చేయాలనిపించింది.ఒక్క సినిమా హిట్టయితే కోట్లలో రెమ్యూనరేషన్ ..చూడ్డానికి ఇంచుమించు మహేష్ బాబు లా వుంటాను కదా…”అన్నాడు.
“హైద్రాబాద్ లో జరిగిన బాంబుదాడి కేసును ఎంతో ధైర్యంగా సాల్వ్ చేసిన మీరు అజ్ఞాతంలోకి వెళ్లారు …మీ గురించి జాతీయస్థాయిలో వార్తలు వచ్చాయి.సడెన్ గా అదృశ్యమయ్యారు “యాంకర్ అంది.
“చెప్పానుగా సినిమాల్లో వేషాల కోసం ట్రై చేస్తున్నా..వర్మను కూడా అడిగా మొన్నటిదాకా జీఎస్టీ బిజీలో వున్నాడు..తర్వాత నాగ్ తో ఆఫీసర్ సినిమా బిజీ…”చాలా తాపీగా చెప్పాడు.
ఆ ఇంటర్వ్యూ జరుగుతోన్న సమయంలోనే టీవీ స్టూడియోను కొందరు ఆగంతకులు చుట్టుముట్టారు.

(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్)
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY