ఆయన దృష్టి తమపై ఎప్పుడు పడుతుందా అన్నట్టు ఎదురుచూస్తున్నారు…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (29-04-2018)

సాయిబాబా చుట్టూ జనం…
ఆయన వెనుక శిష్యులు.. భజన చేస్తూ వస్తున్నారు. ఆ భజన వింటూ ఆనందంలో తేలిపోతూ చేతులు ఊపుకుంటూ ఏదో లోకంలో విహరిస్తున్నట్టు ఉన్నాడు సాయిబాబా.
అతను ఎవరిని పట్టించుకునే స్థితిలో ఉన్నట్టు కనపడలేదు. అయినా అతను ఎవరిని పట్టించుకోనవసరం లేదనిపించింది.
భగవాన్ సత్య సాయి బాబా అన్న బిరుదు ఆల్రెడీ తగిలించేశారు.
ఇక చుట్టూ ఉన్నవారే ఆయన్ను పట్టించుకోవాలి అనిపించింది. అందరినీ కరుణతో కూడిన దృష్టితో చూస్తూ చిరునవ్వు చెక్కు చెదరకుండా నడుస్తూ వస్తున్నాడు.
ఆయనను చుట్టుముట్టిన జనం భక్తిపారవశ్యంలో ఓలలాడుతున్నారు…
ఆయన దృష్టి తమపై ఎప్పుడు పడుతుందా అన్నట్టు ఎదురుచూస్తున్నారు.
సాయిబాబా తమను దాటగానే తిరిగి ఆయన ముందు కనపడాలని ముందుకు వెళ్లి నిలబడుతున్నారు. చుట్టూ చూస్తూ వెళుతున్న సాయిబాబాను చూడగానే అక్కడ ఉన్న కొంతమంది తమను చూసినట్టు ఫీల్ అయ్యి తన్మయత్వంలో కళ్ళు మూసుకుని ఉన్నారు.
మొత్తానికి అక్కడ మాస్ హిస్టీరికల్ సిట్యువేషన్…
ఎవరిని కదిలించినా సాయిబాబా జపమే… ఆయన వెనుక ఉన్న భజన బృందం ఎక్కడా తగ్గకుండా పైస్థాయిలో భజన చేసేస్తున్నారు.
నేనే కనుక ఆ సాయిబాబా పొజిషన్ లో ఉంటే గ్యారంటీగా తలనొప్పి వచ్చి ఉండేది.
రోజు భజనలు వినడం వల్ల కాబోలు ఆనందంతో తల ఊపుతున్నాడు. అయినా మనలను పొగిడే సిట్యువేషన్ లో సౌండ్ పెరిగినా ఇబ్బంది అనిపించదేమో..
ఒకవేళ అనిపించినా భరించే పేషన్స్ వచ్చేస్తుందేమో అనిపించింది.
నేను సిమెంట్ బెంచ్ పై నిలబడి అక్కడ జరుగుతున్న తంతును చూస్తూ ఉండగానే సాయబాబా నా ముందు వచ్చాడు.
నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. నేను తప్ప అందరూ నేలపై నిలబడి ఉండడంతో నా వంక చూశాడు. నేను అతని వంక చూశాను.
నన్ను చూస్తూ ఆకాశంలోకి చేతులు తిప్పుతూ ముందుకు సాగాడు.
ఏదైనా శాపం పెట్టాడేమో… నేను రాయిగానో రాప్పగానో మారిపోయానేమో అనుకుని చూసుకున్నాను.
అలాంటిది ఏమి జరగలేదు. కొంపదీసి ఏ చేతబడో చేసి కాలు చెయ్యి చచ్చుబడేటట్టు చేసేశాడేమో అనుకుని కాలు చెయ్యి జాడించాను.
ఏమీ మార్పు లేదు..
అతని చూపుల వల్ల నా మాతెమైనా పడిపోయిందేమో అన్న అనుమానం వచ్చింది…

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY