జనం అంతా అతని వెంట వెళ్ళడంతో అక్కడక్కడా నాలా ఒకరిద్దరు ఉన్నారు….స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (06-05-2018)

నన్ను నేను పరీక్షగా చూసుకున్నాను. నాలో ఏ మార్పు కనపడలేదు.
నిజ జీవితంలో సినిమాలో జరిగే విధంగా జరగే ఛాన్స్ లేదని అప్పటికికానీ నాకు అర్థం కాలేదు.
సాయిబాబా నన్ను దాటుకుని ముందుకు వెళ్ళాడు. నా చుట్టూ ఉన్న జనం ఆయనతో పాటు ముందుకు కదిలారు.
ఒక్కసారిగా తుఫాన్ వచ్చి వెలసినట్టుగా ప్రశాంతత..
జనం అంతా అతని వెంట వెళ్ళడంతో అక్కడక్కడా నాలా ఒకరిద్దరు ఉన్నారు.
నేను ఆ బెంచ్ పైన అలానే కూర్చుని ఉండిపోయాను. మా జూనియర్స్, ఆంటీ అందరూ సాయిబాబా భక్తులు కావడంతో జనం వెంట వెళ్ళారు.
నేను హ్యాపీగా అక్కడే కూర్చుని ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాను…
కాసేపటితరువాత ఆంటీ వచ్చింది.
“ఏరా… ఇక్కడ ఏమి చేస్తున్నావు?” అని అడిగింది
ఏమీ లేదంటూ సమాధానం చెప్పాను.
“స్వామితో పాటు ఎందుకు వెళ్ళలేదు?” అని అడిగింది
నేను సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాను.
ఈ దొంగ బాబాలపై నాకు నమ్మకం లేదంటే తన్నడం ఖాయం అని బాగా తెలుసు.
ఉత్తి పుణ్యానికే ఎందుకు తన్నించుకోవడం… పైగా మా జూనియర్స్ ముందు తన్నించుకుంటే ఆ ఇమేజ్ డ్యామేజ్ కావడం గ్యారంటీ…
ఆంటీ మరేదో చెప్పబోయేంతలో మా జూనియర్స్ ఆకలి అంటూ కాంటీన్ వైపు బయలుదేరదీశారు.
అదే మంచి అదను అనుకుంటూ నెమ్మదిగా వారి వెంట బయలుదేరాను. ఆంటీ ఇక ఏమీ అడగలేక మా వెంట కదిలింది.
***
డిన్నర్ పూర్తి చేసుకుని నిద్ర పట్టక మా షెడ్ ఎదురుగా ఉన్న సిమెంట్ బెంచ్ పై కూర్చున్నాను.
సాదారణంగా తిన్న తరువాత వాకింగ్ చేయడం అలవాటు. మా జూనియర్స్ సాయిబాబా వెంట తిరిగి బాగా అలసినట్టు ఉన్నారు. అందరూ బాగా నిద్రపోతున్నారు. ఆంటీ కూడా పడుకున్నట్టు ఉంది.
ఇక నాకు నిద్ర పట్టక వాకింగ్ కి బయలుదేరాను. సాయిబాబా మెయిన్ హాల్ వైపు కదిలాను.
అక్కడ లైట్స్ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఇంత కరెంట్ వాడుతుంటే కరెంట్ బిల్ ఎంత వస్తుందో అనుకుంటూ నడిచాను. సాయిబాబా ఆశ్రమం కరెంట్ బిల్ అసలు కట్టదని తరువాత ఎప్పుడో తెలిసింది నాకు…
అప్పట్లో పవర్ కట్ చాలా దారుణంగా ఉండేది. రోజుకు 2 నుండి 4 గంటలు కోత కోసేవారు.
నేను ఉన్న వారం రోజులో సాయిబాబా ఆశ్రమంలో ఒక్కసారి కూడా కరెంట్ కట్ చేసినట్టు అనిపించలేదు.
దేనికైనా అదృష్టం ఉండాలి అనిపించింది.ఏవో నోటికి వచ్చిన నాలుగు మంచి మాటలు చెప్తే ఇంత రాజభోగం ఉంటుందని అప్పుడే తెలిసింది.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY