ఇక తప్పదు అన్నట్టు పైకి లేచాను. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (13-05-2018)

అర్థరాత్రి…
ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది…
పక్కన చూస్తే మా జూనియర్స్ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు..
నాకు ఎందుకు మెలకువ వచ్చిందో అర్థం కాలేదు. కదలకుండా అలాగే పడుకున్నాను..
కాసేపటి తరువాత తెలిసింది. కొత్త ప్రదేశం… కొత్త ఫుడ్ వల్ల కడుపు గడబిడ స్టార్ట్ అయ్యింది.
ఆ ప్రభావమే నా మెలకువ. ఇక ఎక్కువసేపు అలానే పడుకుంటే పరిస్థితి విపరీతం అయిపోతుందని తెలిసింది.
మంచి నిద్రలో ఉండి లేవడానికి చాలా బద్దకిస్తోంది శరీరం. కానీ తప్పదు. ప్రకృతి పిలిచినప్పుడు వెళ్ళకపోతే అది కోపగిస్తుంది.
ఇక తప్పదు అన్నట్టు పైకి లేచాను. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
ఎవరినీ డిస్టర్బ్ చెయ్యకుండా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ షెడ్ బయటకు వచ్చాను.
దూరంగా టాయిలెట్స్ కనపడుతున్నాయి. విషయం అర్జెంటు కావడంతో గబగబా ఆ వైపుకు కదిలాను.
టాయిలెట్స్ దగ్గరకు చేరుకోగానే ఎందుకో కాస్త రిలీఫ్ అనిపించింది. ఇక లోపలి అడుగు పెట్టబోతుండగా “ఎవరు అక్కడ” అంటూ పెద్దగా వినిపించింది.
అనుకోని విధంగా వినిపించిన అరుపుకు ఒక్కసారి హడలిపోయాను.
టాయిలెట్ కి వెళ్ళాలన్న ఆలోచనను విరమించుకుని వెనుకకు తిరిగి చూశాను.
నా ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. చేతిలో పెద్ద కర్ర…
అతని వాలకం చూస్తుంటే అక్కడ కావలి కాసేవాడిలా ఉన్నాడు.
“నేను బాల వికాస్ స్టూడెంట్. బాత్ రూమ్ కి వచ్చాను” అంటూ నెమ్మదిగా చెప్పాను.
అతను నా వంక అనుమానంగా చూశాడు.
నా పరిస్థితి గందరగోళంగా తయారైంది. నా హడావిడిని చూసి అతనికి అనుమానం ఎక్కువ అయినట్టు ఉంది.
నన్ను వదలకుండా చూస్తున్నాడు.
“నాకు చాలా అర్జెంటు. టాయిలెట్ వెళ్ళకపొతే ఇబ్బంది” అంటూ చెప్పాను.
అప్పటికి నా పరిస్థితిని అతను అర్థం చేసుకున్నట్టు ఉన్నాడు.
“సరే వెళ్ళు” అంటూ అతను వెళ్ళిపోయాడు..
నేను టాయిలెట్ లోకి వెళ్లానన్న మాటే కానీ నా గుండె దడ తగ్గలేదు.
ఎక్స్ పెక్ట్ చేయని సిట్యువేషన్ ఎదురైతే ఇలానే గుండె దడ వస్తుందేమో…
కాసేపటి తరువాత గుండె దడ కాస్త కంట్రోల్ కి వచ్చింది.
కానీ… నాకు ఒక్క విషయం అర్థం కాలేదు.
ఆశ్రమంలో కాపలా అవసరమా?
అది కూడా దుడ్డుకర్రలతో ఎందుకు కాపలా కాయడం?
అంత సెక్యూరిటీ ఎందుకు?
ఈ విషయాలకు ఆన్సర్ ఇప్పటి దాకా నాకు దొరకలేదు…
***

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY