ఈ టైం లో తన ఇంటి తలుపు తట్టేదెవరు?ఖచ్చితంగా డేవిడ్ అయి ఉంటాడు.అయినా చనిపోయిన డేవిడ్ తనకు కనిపించడం ఏమిటి?…ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (20-05-2018)

      (9)
ఒక్కక్షణం భయంతో వణికిపోయాడు.గట్టిగా కళ్ళుమూసుకుని కొద్దిక్షణాల తర్వాత కళ్ళు తెరిచాడు జేమ్స్.ఎదురుగుగా తననే చూస్తూ డేవిడ్.తనను చేతులుచాచి పిలుస్తున్నాడు.వెంటనే కిటికీ తలుపులు మూసాడు.జేమ్స్ భార్య వైపు చూసాడు.తను ప్రశాంతంగా పడుకుంది.ప్చ్ ..తనకలా ప్రశాంతంగా పడుకునే అవకాశం లేదు.తనకే ఎందుకిలా జరుగుతుంది? వెళ్లి భార్య పక్కనే పడుకున్నాడు.అనీజీగా వుంది.ఎవరికి చెప్పగలడు? ఏమని చెప్పగలడు?
గోడగడియారంలోని చిన్నముల్లు తిరిగే శబ్ధం స్పష్టంగా వినిపిస్తోంది.పెద్దశబ్దంతో తిరుగుతున్నట్టు అనిపించింది.ఏ సమయంలో తనను ఆదుకునేవారెవరు ?తన సమస్యకు పరిష్కారం చెప్పేవారెవరూ…ప్రభువా నువ్వే దిక్కు …క్రాస్ చేతిలోకి తీసుకుని అనుకున్నాడు.
సరిగ్గా అప్పుడే తలుపుల మీద దబదబ బాదిన శబ్దం.ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.అతని గుండె చప్పుడు అతనికే స్పష్టంగా వినిపిస్తుంది.
ఈ టైం లో తన ఇంటి తలుపు తట్టేదెవరు?ఖచ్చితంగా డేవిడ్ అయి ఉంటాడు.అయినా చనిపోయిన డేవిడ్ తనకు కనిపించడం ఏమిటి?
తలుపుల మీద శబ్దం వినిపిస్తూనే వుంది.ఏంచేయాలి?భార్యను లేపాలా ?తను మరింత భయపడుతుంది.క్రాస్ చేతిలోకి తీసుకుని లేచాడు.మెల్లిగా ఒక్కోఅడుగు వేసుకుంటూ తలుపు హాలులోకి నడిచాడు.వణుకుతోన్న చేతులతో తలుపుతీసాడు.ఎదురుగా ఉన్నదెవరో చూడాలన్నా భయం.తన భుజం మీద చెయ్యిపడింది.బలవంతాన గొంతులో నుంచి వచ్చిన కేకను ఆపుకుని కళ్ళు తెరిచి షాక్ కు గురయ్యాడు.
ఎదురుగా సిద్దార్థ…డిటెక్టివ్ సిద్దార్థ
“సర్ మీరా?ఆశ్చర్యం ఆనందం ఏకకాలంలో కలిగాయి.సిద్దార్థ రాకతో కొండంత బలం వచ్చినట్టు అనిపించింది.
“వేరే ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేసావా?నవ్వుతూ అన్నాడు సిద్దార్థ
“అదికాదు సర్ మీరు ఇక్కడికి..నా ఇంటిని వెతుక్కుంటూ…”సంశయంగా చెప్పాడు.
“పారిపోయి వచ్చాను “తాపీగా చెప్పాడు సిద్దార్థ
నమ్మలేనట్టు చూసి అన్నాడు”పారిపోవలిసిన ఖర్మ మీకంటి సర్ ?మీరు పెద్ద డిటెక్టివ్”అన్నాడు సుగాత్రి అన్న మాటలు గుర్తొచ్చిజేమ్స్.
“ఏంచేస్తాం..పానీపూరి తినడం నేరమైంది..అప్పటికీ మా బామ్మ చెప్పింది హైద్రాబాద్ లో పానీపూరి తినేప్పుడు జాగ్రత్త?అని “సిద్దార్థ చెప్పి ఆ ఇంటిని పరిశీలంగా చూసాడు.
“జోకులేయకండి సర్…”డేవిడ్ సంగతి కాసేపు మర్చిపోయి అన్నాడు రిలాక్స్ అవుతూ జేమ్స్
“నీతో జోకులేస్తానా జేమ్స్..ఎంతకాదన్నా నన్ను ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకువచ్చావు…”అన్నాడు సిద్దార్ధ
“ముందు కూర్చోండి సర్ వేడివేడిగా కాఫీ తీసుకువస్తాను” అంటూ కిచెన్ వైపు కదలబోతుండగా అన్నాడు సిద్దార్థ
“జేమ్స్ ఓసారి మీ ఫ్రెండ్ డేవిడ్ ను కలవాలి”

(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్)
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY