“సర్ నాకు అంత అయోమయంగా వుంది .మిమ్మల్ని నా క్యాబ్ లో తీసుకువచ్చినప్పటి నుంచి అనూహ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి.”చెప్పాడు జేమ్స్. …ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (27-05-2018)

                                        (10)
“ఇప్పుడా? ఈ టైం లోనా? ఏమనాలో తోచక అన్నాడు…జేమ్స్ లో భయం మొదలైంది..కంగారు ఆందోళన మొదలయ్యాయి?
ఒక ప్రశ్న వెనుక మరో ప్రశ్న…ఒక అనుమానం వెనుక మరో అనుమానం …అసలు ఏం ఆగుతుంది?
డిటెక్టివ్ సిద్దార్థకు చనిపోయిన డేవిడ్ తో ఏం పని? ఇప్పుడు తనేం చేయాలి?జరిగినదంతా డిటెక్టివ్ సిద్దార్థకు చెప్పాలి.
ఆ నిర్ణయం అతని మనసులోకి రావడంతో మనసు తేలికపడింది.
“సర్ ఒకసారి ఇలా రండి..”అంటూ బయటకు తీసుకువెళ్లాడు. ఇంటి ముందు నిలబడి వున్నారిద్దరూ….
“సర్ నాకు అంత అయోమయంగా వుంది .మిమ్మల్ని నా క్యాబ్ లో తీసుకువచ్చినప్పటి నుంచి అనూహ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి.”చెప్పాడు జేమ్స్.
“అనూహ్యమైన సంఘటనలు అంటే?అడిగాడు జేమ్స్ వైపు చూస్తూ సిద్దార్థ
“మీరు డేవిడ్ కోసం ఎందుకు వచ్చారో…?డేవిడ్ మీకెలా తెలుసో నాకు తెలియదు కానీ…డేవిడ్   చనిపోయాడు..యాక్సిడెంట్ లో:”చెప్పాడు జేమ్స్.
“ఆ విషయం నాకు తెలుసు”తాపీగా అన్నాడు డిటెక్టివ్ సిద్దార్థ.
“తెలుసా…మరి డేవిడ్ ను కలుద్దామన్నారు…అంతేకాదు డేవిడ్ నాకు కనిపించాడు..”ఎదురుగా వున్న డేవిడ్ ఇంటివైపు చూస్తూ చెప్పి మరోసారి ఉలిక్కిపడ్డాడు…
“స…స…సర్ డే…వి…డ్ “ఎదురుగా డేవిడ్ నిలబడి తమ  వైపే చూస్తున్నాడు.అటువైపు చూపించి చెప్పాడు జేమ్స్ సిద్ధార్థతో .
సిద్దార్థ జేమ్స్ చూపించిన వైపు చూసి”బహుశా డేవిడ్ నీకు ఏదో చెప్పాలని  అనుకుంటున్నాడు…పద…”అన్నాడు.
జేమ్స్ ఈసారి భయపడలేదు.సిద్దార్థ తన వెంట వున్నాడన్న ధైర్యం కాబోలు.
“సర్ ఇంతకు మనం డేవిడ్ ఇంటికి వెళ్లి ఏం చేస్తాం?
“డేవిడ్ ను ఎందుకు చంపారో తెలుసుకుంటాము”తాపీగా చెప్పాడు.
“డేవిడ్ ను చంపారా? ఎందుకు?జేమ్స్ మోహంలో ఆశ్చర్యం ..భయం.
“ఎందుకంటే…డేవిడ్ మిస్టర్  డి గురించి తెలుసుకున్నాడు…మిస్టర్ డి అంటే ..మిస్టర్ దయాళ్…మాఫియా కింగ్..చెప్పడం మొదలుపెట్టాడు సిద్దార్థ.”డేవిడ్ క్యాబ్ లో డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయం డేవిడ్ కు తెలియదు…ఓ రోజు క్యాబ్ డిక్కీలో మిస్టర్ డి మనుష్యులు డ్రగ్స్ పెడుతుండగా చూసాడు…నిలదీసాడు..పోలీస్ స్టేషన్ కు వెళ్లి చెబుతానన్నారు..యాక్సిడెంట్ చేసి చంపేశారు.ప్రమాదంగా సృష్టించారు..అయితే డేవిడ్ తెలివైన వాడు..ఏదో ఆధారం దాచే ఉంటాడు…”అన్నాడు సిద్దార్థ
“డేవిడ్ కు అంత ఆలోచన ఎలా వస్తుంది సర్..”డేవిడ్ ఇంటి దగ్గరికి వస్తుండగా అన్నాడు జేమ్స్..అప్పటికే జేమ్స్ కు భయం కొద్దిగా మొదలైంది.ఇంటి ముందు డేవిడ్  నిలబడి వున్న ఫీలింగ్
“వస్తుంది ఎందుకంటే…”అని ఆగి డేవిడ్ ఇంటి ముందు నిలబడి చెప్పాడు  …”డేవిడ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మర్ కాబట్టి”
షాకింగ్ గా అలాగే చూస్తుండిపోయాడు.క్రైమ్ సినిమా చూస్తున్నట్లుంది.
“డేవిడ్ ఇంటికి తాళం వేసుంది కదా…పగలకొడదామా సర్”అన్నాడు జేమ్స్. రాయి కోసం చూస్తూ…
అప్పుడే డేవిడ్ జేమ్స్ వైపు చూసాడు.జేమ్స్ కు ముచ్చెమట్లు పట్టాయి..తనకు నాలుగడుగుల దూరంలోనే వున్నాడు.డేవిడ్..ఇంటిముందు వున్న పూలకుండీ దగ్గరికి వచ్చాడు.
జేమ్స్ ట్రాన్స్ లో ఉన్నట్టు అక్కడికి వెళ్లి పూలకుండీ పక్కకు జరిపాడు.అక్కడ పూలకుండీ కింద తాళం చెవి వుంది.
అప్పటికే ఆ ఇంటి పరిసరాల్లోకి మిస్టర్ డి మనుష్యులు వచ్చారు.
(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్)
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY