స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (17-06-2018)

సాయిబాబా అలా అందరిని (అడిగిన వారిని అడగని వారిని కూడా) ఆశీర్వదిస్తూ ముందుకు కదిలాడు. వెనుక మంది మార్బలం కదులుతుంది… అందులో కొంతమంది తదేకంగా చూస్తున్నారు. మరికొంత మంది భక్తి భావంతో చేతులు జోడించి మొక్కుతున్నారు.
సాయిబాబా అలా నడుచుకుంటూ ఆశ్రమం ముందు భాగంలోకి వచ్చాడు.
అక్కడ వెండితో చేసిన ఒక సింహాసనం లాంటి చైర్. నగిషీలు చెక్కినట్టు ఉంది. ఎండలో వెండి కొండలా మెరిసిపోతోంది.
దానిపై సిల్క్ తో మెత్తగా చేసిన దిళ్ళు. ఆ సింహాసనం ముందు కాళ్ళు ఉంచుకోవడానికి పాద పీటిక. అది కూడా వెండితో చేసిందే..
సాయిబాబా నడిచే దారి మొత్తం పూలు చల్లి ఉన్నాయి. పొరపాటున పువ్వు కాళ్ళ కింద పడితే ప్రాణం గిలగిలలాడిపోతుంది నాకు. అటువంటి సున్నితమైన పూల మీద నడవడమా?
రోజా పూలు, బంతిపూలతో పాటు రకరకాల పూలు దారి మొత్తం బాటలా పోశారు. బహుశా ఆయన దాని పైన నడవాలని ఆయనకు చెప్పడానికి (రూట్ మ్యాప్ చూపించినట్టు) శిష్యులు చేసిన పని అనుకుంటా…
సాయిబాబా ఆ పూల మీద నడవడం ప్రారంభించాడు. ఆయన నడిచే దారిలో కొంతమంది నిలిచి ఉన్నారు. చేతిలో పూల బుట్టలు ఉన్నాయి.
ఆయన నడుస్తూ ఉంటే ఆయన పైన పూలు చల్లుతున్నారు. వెనుక ఉన్న భక్తజనం ఆయనను స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు.
ఆయనకు అలవాటైన పద్దతిలో చేతులు ఊపుకుంటూ శూన్యంలో చూస్తూ (ఎదురుగా ఇంత మంది మొక్కుతూ ఉంటే సూన్యంలో ఎందుకు చూస్తున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు) నడుస్తూ వస్తున్నారు.
ఆయన కాళ్ళ కింద నలిగిన పూలను కొంతమంది పోటీ పడి తీసుకుని కళ్ళకు అద్దుకుంటున్నారు…

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY