స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (01-07-2018)

“ప్రేమైక స్వరూపులారా…” ఒక సన్నని గొంతు వినపడింది.
నా పక్కన ఉన్న బుద్ధిష్ట్ డ్రెస్ మీద కాన్సంట్రేషన్ చేసిన నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఎవరు మాట్లాడుతున్నారా అంటూ చుట్టూ చూశాను.
ఇంతలో దానికి సంబందించిన ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ వినపడింది.
నేను అక్కడ ఉన్న ప్లేస్ అంతా కలయచూశాను. దూరంగా సాయిబాబా వద్ద నా చూపులు నిలిచాయి.
చేతిలో మైక్ తో ఉపన్యాసం ఇవ్వడానికి రెడీ అయినట్టు కనిపించింది.
“ప్రేమైక స్వరూపులారా…” అంటూ ప్రారంభించాడు.
మేమంతా ప్రేమైక స్వరూపులమైతే ఆ ఆశ్రమంలో అంతటి వివక్ష ఎందుకో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
డబ్బు పేరు ఉన్నవారికి ప్రత్యేక మర్యాదలు. బాలవికాస్ హెడ్ హోదాలో ఉన్నవారితో ప్రత్యేకమైన సమావేశాలు, వి ఐ పి ట్రీట్మెంట్….
ఉపన్యాసం మొదలవగానే అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు.
సాయిబాబా తెలుగులో చెపుతుంటే పక్కన ఉన్న వైట్ డ్రెస్ అతను ఇంగ్లీష్ లో ట్రాన్స్ లేట్ చేస్తున్నాడు.
ఉపన్యాసం యొక్క సారాంశం నాకు అర్థం అయ్యింది ఏమంటే నా వల్లే పుట్టపర్తి డెవలప్ అయ్యింది.. నా వల్లే ఇక్కడ చాలా మందికి ఉపాది దొరుకుతుంది. అన్నట్టు సాగింది.
అక్కడ ఉన్నవారికి అందరికి ఆ ఉపన్యాసం నచ్చినట్టుంది ఒక్క వ్యక్తికీ తప్ప. అది నేనే అని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదని తెలుసు.
నాకు సాయిబాబా అంటే ఇష్టం ఉండదని ఆంటీకు అంతకు ముందే తెలుసు.
మా జూనియర్స్ ఎవరో అందించి ఉండాలి. అయినా ఆంటీ నన్ను ఏమి అనలేదు.
నేను పెద్దగా పట్టించుకోలేదు. ఉపన్యాసం జరుగుతూ ఉంటే నేను మా గ్యాంగ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని కళ్ళతోనే వెదుకడం మొదలుపెట్టాను.
మా వాళ్ళు ఎక్కడా కనపడలేదు. ఇక్కడ కూర్చోవడం ఎందుకో ఇబ్బందిగా ఉంది. లేచి పోవాలంటే ఎందుకో బద్ధకం.
మొత్తం జనం అక్కడే ఉంటే ఇక ఎక్కడికి పోవాలో తెలియలేదు.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY