“వెరీ గుడ్..డ్రగ్స్ ఇంత ఈజీ గా దొరుకుతాయనుకోలేదు…మిస్టర్ డి గ్రేట్ ” అన్నాడు సిద్దార్థ….ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (08-07-2018)

     16
” ఇప్పటివరకూ అతితక్కువ వ్యవధిలో డ్రగ్స్ వ్యాపారం వేలకోట్లతో సాగింది.చాప కింద నీరులా డ్రగ్స్ పిల్లల శరీరాల్లోకి  వెళ్తుంది.యువత డ్రగ్స్ కు బానిస అవుతుంది.మిస్టర్ డి నయాట్రెండ్ మరొకటి వుంది ? “అని ఆగి ఒక్కసారి అందరి వైపు చూసాడు..
అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్
డ్రగ్స్   కు యూత్ ను బానిస చేసి యువతను నిర్వీర్యంచేసే స్థాయి నుంచి ఇంకా దిగజారి ప్రమాదకరమైన స్థాయికి తీసుకువచ్చాడు మిస్తే డి…ఈసారి పెద్దలను కూడా టార్గెట్ చేసాడు…ముంబై లో పావ్ బాజీ ద్వారా డ్రగ్స్ ను అందించాడు..చాలా తెలివిగా క్రూరంగా చేసిన ప్లాన్ డి.పావ్ బాజీని ఇష్టంగా తినేవారికి మొదట్లో ఈ రుచి కొత్తగా అనిపించింది  .మెల్లిమెల్లిగా ఈ తరహా డ్రగ్స్ కు అలవాటు అయ్యారు..అప్పుడే మిస్టర్ డి టీమ్ బయటకు వస్తుంది…డ్రగ్స్ వ్యాపారం మొదలుపెడుతుంది..పత్రికల్లో వచ్చే పబ్లిసిటీ   కన్నా టీవీ ఛానెల్స్ పబ్లిసిటీ కన్నా మోస్ట్ పవర్   ఫుల్ మౌత్ టాక్…ఒక్కరు ఒక్కసారి దీనికి బానిస అయితే వదిలిపెట్టరు…ఇంటిల్లిపాది బానిస అయితే ఊహించడానికే భయంగా ఉంటుంది కదా…
ఈ భయాన్ని డ్రగ్స్ వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టాడు…పావ్ బాజీ అమ్మేవాళ్ళల్లో చాలామంది మిస్టర్ డి అనుచరులే వున్నారు.మాములుగా పావ్ బిజీ అమ్మేవాళ్ళను భయానో నయానో కనేసాడు.కార్పొరేట్ లెవల్లో నీట్ గా డ్రెస్ ..అతి తక్కువరేటుకే పావ్ బాజీ అర్థరాత్రుళ్ళ వరకూ అమ్మకాలు..కొన్నివేల మంది పావ్ బిజీ అమ్మకదారులు రోగులపక్కన అమ్మేవాళ్ళు ఏఈ పోటీకి తట్టుకోలేక పోతున్నారు…
అలా తన డ్రగ్స్ వ్యాపారాన్ని హైద్రాబాద్  కూ తీసుకువచ్చాడు.ఇక్కడ పానీపూరి లో డ్రగ్స్…ఇలా ప్రతీరాష్ట్రంలో మెల్లిమెల్లిగా   డ్రగ్స్  ను జనంలోకి ఇంజెక్ట్ చేస్తున్నాడు.
ఒక  సంవత్సరం నుంచి ముంబైలో దాదాపు  రెండువేల  మందిని కలిసాను.. అందులో స్కూల్ కు వెళ్ళే పిల్లలు కూడా వున్నారు.వీళ్ళలో కొందరికి వైద్యపరీక్షలు చేయించాం.డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తెలిసింది.దీనిని ఆపరేట్ చేస్తున్న మిస్టర్ డి హైద్రాబాద్ లో తలదాచుకుంటున్నారు.ఇక్కడ కార్యకలాపాలు ముమ్మురం చేసాడు.
ఇదో పెద్ద నెట్ వర్క్….పానీపూరిలో డ్రగ్స్ కలపడం నయాదందా..గుట్టు చప్పుడు కాకుండా ఈ దందాను మిస్టర్ డి చేస్తున్నాడు..రోజూ కోట్ల ల్లో బిజినెస్,యూత్ ను మాత్రమే కాదు ప్రతీఒక్కరిని పానీపూరికి  ఎడిక్ట్ చేస్తున్నారు.
ఈ నాటకానికి మనం తెరతీయాలి.మిస్టర్ డి గుట్టును మనము రట్టు చేయాలి.
మిస్టర్  డి కుడుభుజాన్ని తెగనరకాలి .ముందు అతడిని మానసికంగా దెబ్బతీయాలి.మిస్టర్ డి ను మనం ఉపేక్షిస్తే చాలా ప్రమాదకరం
ఇప్పటివరకూ మీరు నాకు సహకరించారు…ఇకముందు కూడా ఇలానే మీ సహకారం కావాలి.మిస్ సుగాత్రి  గారి సహకారం మర్చిపోలేను…” చెప్పుకు పోతున్నాడు డిటెక్టివ్ సిద్దార్థ
అలానే వింటూ ఉండిపోయింది సుగాత్రి.మాములుగా తనకు తెలిసిన సిద్దార్థ వేరు.వృత్తిపరంగా అతనిలోని సీరియస్ నెస్ .సిన్సియారిటీ  చూస్తుంటే..ఈ సిద్దార్థ తన మనసుకు దగ్గరైన సిద్దార్థ ఒక్కరేనా ? అనిపిస్తుంది.
ఆ ఆలోచన ఆమె బుగ్గలను ఎరుపెకిందినుంచి.
 డిటెక్టివ్ సిద్దార్థ కొనసాగించాడు…
” మొత్తం ఇరవైఏడు ప్రథాన  నగరాల్లో తన వ్యాపారాన్ని విస్తరించాడు మిస్టర్ డి..ఈ రోజు కరూర్ జంక్షన్ లో జరుగబోయే హాయ్ డ్రామాతో మిస్టర్ డి సామ్రాజ్యం లోని ఒక భాగం కుప్పకూలుతుంది.వెంటనే ఆపరేషన్ కరీం..మిస్టర్ డి కుడిభుజం మీద …మిస్టర్  డి తన కన్నును తనే ఎలా పొడుచుకుంటాడో మనకు తెలుస్తుంది..ఎన్నోనేరాలు చేసి మనకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అతడిని మిస్టర్ డి ద్వారానే శిక్షించేలా చేస్తున్నాం ” చెప్పాడు సిద్దార్థ
అక్కడ కరతాళధ్వనులు మిన్నంటాయి.
                             ***
                               ***
అపార్ట్ మెంటు లో మూడవ అంతస్థులో వున్న మూడువందల మూడు నంబర్ ఫ్లాట్ లో ఇద్దరే వున్నారు.
సుగాత్రి సిద్దార్థ ఒకరికొకరు ఎదురెదురుగా కూచున్నారు.బుద్ధిగా కూచోని వుంది.చీరలో మరింత అందంగా కనిపిస్తోంది.
మెల్లిగా తలెత్తి చూసింది సుగాత్రి.ఆ క్షణం తను ఒక సిబిఐ ఆఫీసర్ అన్న విషయం మర్చిపోయింది.ఒక ఆడపిల్లల ఆలోచిస్తుంది.
” చీరలో బుద్ధిగా ఇలా కూచోని ఉంటే బాపు బొమ్మలా ముద్దొస్తున్నావ్ ?”  సిన్సియర్ గా అన్నాడు సిద్దార్థ
చిత్రంగా సుగాత్రికి కోపం రాలేదు..సిగ్గు ముంచుకొచ్చింది.
” సుగాత్రి నువ్వు బావుంటావు…”  అన్నాడు మొదటిసారి ఏకవచనంతో ..వెంటనే ” సారీ ” అన్నాడు
” సారీ చెప్పి నన్ను వేరు చేయకండి…నన్నిలా పిలుస్తుంటేనే కొత్తగా వుంది ..బావుంది ” మనఃస్ఫూర్తిగా అంది సుగాత్రి
” కొందరిని చూడగానే చాలా దగ్గరగా  కనిపిస్తారు…అనిపిస్తారు..సుగాత్రిని చూడగనే సిద్దార్థకు కలిగిన ఫీలింగ్ కూడా అదే ..సుగాత్రి కూడా అలాటి పరిస్థితిలోనే వుంది..కానీ తన ఫీలింగ్స్ ను బయటకు చెప్పలేకపోతుంది…
ఇద్దరు ఒకరిగురించి ఒకరు ఆలోచిస్తన్న సమయంలోనే  కాలింగ్ బెల్ మోగింది.ఆ వచ్చిందెవరో ఇద్దరికీ తెలుసు…వాళ్ళు వెయిట్ చేస్తుంది కూడా వాళ్ళకోసమే.
ఇద్దయే లేచారు…హాలులో వున్న ఫోటో వైవు చూసారు. తామిద్దరూ దిగిన ఫోటో.అందులో దండాలు మచుకుంటున్నట్టు వుంది.ఫోటో షాప్ ద్వారా ఆలా చేసారు.
అదిచూసి సుగాత్రి అనుకుంది  ..నిజంగా దండాలు మార్చుకుంటూ దిగితే ఇంకెంత బావుంటుందేమో…అని
ఆ ఫొటోలో సీక్రెట్ గా అమర్చిన స్పై కెమెరా వుంది.ఆ ఫ్లాట్ కు అనుకుని వున్న ఫ్లాట్స్ లో కూడా పోలీసులు వున్నారు.
సుగాత్రి వెళ్లి చీర సర్దుకుంటున్నట్టు నటిస్తూ నిద్రమొహాన్ని నటించి తలుపు తీసింది.
ఇద్దరు ఆగంతకులు లోపలికి  వచ్చారు.తలుపు ఏసింది సుగాత్రి.
” మీరు అడిగిన సరుకు తెచ్చాం..మీ అయన ఎక్కడ ? అడిగారు వాళ్ళు
”  అప్పుడే  లేచినట్టు నటిస్తూ వచ్చి వాళ్ళను చూసి కళ్ళు పెద్దవి చేసి ” వచ్చారా..? సరుకు తెచ్చారా ? అని అడిగాడు
” ముందు క్యాష్ ఇవ్వండి..ఈ విషయం బయటకు తెలిస్తే మీరు ప్రాణాలతో  వుండరు ” బెదిరిస్తున్నట్టు అంటూ తమ చేతిలో వున్న కవర్ ఇచ్చారు  …
సిద్దార్థ కవర్ తీసుకుని ఓపెన్ చేసి చూసి..” వెరీ గుడ్..డ్రగ్స్ ఇంత ఈజీ గా దొరుకుతాయనుకోలేదు…మిస్టర్   డి గ్రేట్ ” అన్నాడు సిద్దార్థ
(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్) 
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY