” ఇదే నీకు మంచి అవకాశం జమిలి ..ఇప్పుడు నువ్వు కరీమ్ కు ఫోన్ చేసి …” ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (15-07-2018)

                                                       17
మిస్టర్ డి అన్న పేరు విని వాళ్ళు కంగారుపడ్డారు.మిస్టర్ డి గురించి సామాన్యులకు తెలిసే అవకాశం లేదు..ఒకవేళ పోలీస్ వాళ్లయితే తప్ప..అంటే…” వాళ్ళు అనుమానంతో  తమ జేబుల్లోవున్న రివాల్వర్లు తీయబోయారు..అప్పటికే సుగాత్రి చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది..ఒకటి కాదు రెండు రివాల్వర్లు..రెండు చేతుల్లో..ఇద్దరి కణతలకు గురిపెట్టింది.
” అసలే రివాల్వర్ చాలాకాలంగా ఉపయోగించక చికాగ్గా వున్నాను ..నన్ను రెచ్చగొడితే ఠపీమని పేల్చేస్తాను ” అంది సుగాత్రి
”  వద్దు  బ్రోస్ ..ఆవిడకసలే తిక్క…దానికి లెక్కకూడా లేదు..పేల్చినా పేల్చేస్తుంది.పైగా తను మంచి షూటర్..పైపెచ్చు… సర్వీస్ రివాల్వర్..బులెట్స్ కు లెక్క అడిగేవారులేరు..ఎందుకంటే నీఇష్టమొచ్చినట్టు  కాల్చుకో..రికార్డులో వున్న రౌడీ షీటర్స్ అయితే చాలు ” అన్నారు..మూడు స్టేట్స్ లో మీకు మాంచి ట్రాక్ రికార్డు వుంది ..ఠపీమని కాల్చిన పేల్చినా ఏమీ  అనరు …పైగా సైలెన్సర్ అమర్చిన రివాల్వర్లు..సౌండ్ కూడా చేయవు…” తాపీగా చెప్పాడు సిద్దార్థ
వాళ్లకు ఓ విషయం అర్థమైంది.తాము ట్రాప్ చేయబడ్డాం  …. లక్షల్లో డీల్ అని చెప్పి వచ్చి ఇరుక్కుపోయారు.
” మేము అరగంటలో వెళ్లకపోతే మిస్టర్  డి రైట్ హ్యాండ్ కార్తీఎం మిమ్మల్ని వదిలిపెట్టడు…ఈ ఇంటిని చుట్టుముడతాడు…” వాళ్లిద్దరూ అన్నారు
” మీరు అప్పటివరకూ బ్రతికి  ఉంటే కదా…” అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు…వాళ్ళ జేబుల్లో చిన్న బాటరీ లాంటిది పెట్టారు..దానిచివర లైట్ వెలుగుతుంది..ఎరుపురంగులో వుంది.తన జేబులో వున్న మొబైల్ తీసాడు..వాళ్లకు కనిపించేలా చూపెడుతూ ” నేను ఇందులో ఒక నంబర్ కు డయల్ చేయగానే మీ లైఫ్ ఢమాల్ అంటుంది  ..బెల్ట్ బాంబులా బాటరీ బాంబు…చెరో సెల్ వేసాను…మృత్యువు నంబర్ డయల్ చేయమంటావా..?
అప్పటికే వాళ్ళకే భయం మొదలైంది.
అప్పటికే ఆ ఫ్లాట్ లో పక్కగదుల్లో వున్న పోలీసులు చుట్టుముట్టారు వాళ్ళిద్దరినీ…
” మమ్మల్ని రిమోట్ బాంబుతో చంపేస్తారా  ? భయంగా అడిగారు వాళ్లిద్దరూ
” మిమ్మల్ని చూస్తుంటే నాకు చంపేయాలని అనిపించడం లేదు.ఒకపని చేయండి.ఇక్కడి నుంచి సిటీ లిమిట్ అయిదు కిలోమీటర్లలో ముగిసిపోతుంది.మీరు ఇరవైనిమిషాల్లో ఈజీగా అయిదు కిలోమీటర్లు దాటి వెళ్ళగలరు..సిటీ లిమిట్స్ వరకు రిమోట్ పనిచేస్తుంది.మీరు కిందవున్న మీ బులెట్ లో బులెట్ స్పీడ్ తో వెళ్ళండి…  సిటీ లిమిట్స్ దాటి వెళ్తే మిమ్మల్ని ఏమీ చేయను…లేదంటే సిటీలో కనిపిస్తే మా వాళ్ళే ఎన్ కౌంటర్ చేస్తారు…ఛాయిస్ ఈజ్ యువర్స్ ” తాపీగా  చెప్పాడు  సిద్దార్థ.
ప్రాణంభయం లాజిక్ ను ఆలోచించనివ్వదు.పైగా తరుముతున్నట్టు కనిపించే మృత్యువు…సిద్దార్థ కెపాసిటీ వాళ్లకు అర్థమైంది.ఇప్పుడు వాలు చెప్పనట్టు వినడం కన్నా గత్యంతరం లేదు.సిటీలోకి వెళ్తే పోలీసులు చుట్టుముట్టవచ్చు..లేదా రిమోట్ తో పేల్చేయవచ్చు.తమకున్న ఆప్షన్ ఒక్కటే…
అందుకే సిద్దార్థ చెప్పినట్టు చేయడానికి సిద్ధమయ్యారు.బయటకు పరుగెత్తారు  .బాటరీ నుంచి సౌండ్స్ వస్తున్నాయి.మృత్యువుకు కొనుట డౌన్ అన్నట్టు…
వాళ్ళు బయటకు పరుగెత్తి బుల్లెట్స్ తీసి స్టార్ట్ చేసారు..సిటీ అవుట్ స్కట్స్ వైపు.
వాళ్ళు వెళ్ళగానే సిద్దార్థ  సుగాత్రి  బయటకు వెళ్లారు.
ముప్పయేళ్ల జమిలి వాళ్లిద్దరి ఎదురుగా నిలబడివుంది.
జమిలి  క్లబ్ లో డాన్సర్.
సిద్దార్థ జమిలి వైపు చూసి ” నువ్వు డిపార్ట్మెంట్ కు చేస్తున్న సహాయం చాలా గొప్పది…నీకు మేము ఇచ్చే లాస్ట్ టాస్క్…అనుకో ” నవ్వుతూ అన్నాడు సిద్దార్థ
” లేదు సర్ నేనే మీకు కృతఙ్ఞతలు తెలుపుకోవాలి. క్లబ్ లో డాన్సర్ అనగానే ఒళ్ళు అమ్ముకుంటుంది అనుకుంటారు.మమ్మల్ని హీనంగా చూస్తారు.కానీ మీరు…ఆరోజు నన్ను కాపాడారు..అంతేకాదు నా జీవితాన్ని ఓ అర్థాన్ని కలిపించారు.కరీమ్ లాంటి కామాంధుడిని కార్నర్  చేసే   అవకాశం ఇచ్చారు.నా చెల్లెలు మీద వాడు చేసిన అత్యాచారం అమానుషకాండ మరిచిపోలేను…” కళ్ళు తుడుచుకుంటూ అంది జమిలి
” ఇదే నీకు మంచి అవకాశం జమిలి ..ఇప్పుడు నువ్వు కరీమ్ కు ఫోన్ చేసి నేను చెప్పమన్నట్టు చెప్పు…” అన్నాడు
సరేనంది జమిలి
ముల్లును ముల్లుతోనే తీయాలి
కరీమ్ కు అమ్మాయిల బలహీనత’…ఆ బలహీనతే ఎందరో అమ్మాయిల జీవితాలను కాలరాసింది.అందుకు శిక్ష కరీమ్ అనుభవించవలిసిందే
కరీమ్ కు శిక్ష ఖరారైంది.
                          ***
కరీమ్   ట్రిమ్ గా తయారయ్యాడు..కొత్తకొత్త చొక్కాలు వేసుకుంటున్నాడు.మిస్టర్ డి కరీమ్ ను ఓ కంట కనిపెడుతూనే వున్నాడు.అతనిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.అప్పటికే మిస్టర్ డి ఓ నిర్ణయానికి వచ్చాడు.కొన్నేళ్లుగా  కరీమ్ ను నమ్మి కోట్ల దందాను అతనికి అప్పగించాడు.నమ్మకద్రోహాన్ని సహించలేకపోతున్నాడు.
కరీమ్ బయటకు నడిచాడు.అతని కారు కదిలాక మిస్టర్ డి ఓ అనుచరుడికి చెప్పాడు..” కరీమ్ ను ఫాలో చేయమని “
                                            ***
కరీమ్ కు కొత్తగా వుంది.అమ్మాయిలను బలంతంగా అనుభవించడం.. తరువాత నిర్దాక్షిణ్యంగా  చంపివేయడం…అలాంటిది జమిలి తనను ఎట్రాక్ట్ చేయడం కొత్తగా వుంది.తాను లేకపోతే చచ్చిపోతానంటుంది.మొన్నటికి   మొన్న రాత్రి తనను ఎవరో చంపుతున్నట్టు కలొచ్చిందని రాత్రంతా ఏడుస్తూ కూచోని తను వెళ్ళగనే తనని గట్టిగా వాటేసుకుని ఏడ్చేసింది.
అందుకే ఈరోజు ముఖ్యమైన పని వున్నా ఆ పనిని తన అనుచరులకు   చెప్పి జమిలి దగ్గరికి వెళ్తున్నాడు..ఇరవై లక్షల సరుకు …మిస్టర్ డి ని సర్ ప్రయిజ్ చేయాలి..ఈ మధ్య తన మూలంగా డ్రగ్స్ అమ్మకాలు    పెరిగాయి.యూత్ ముఖ్యంగా మహిళలను టార్గెట్ గా పెట్టుకున్నాడు.అమ్మాయిలను టార్గెట్డ చేస్తే బ్బుతో పాటు తన కోరికలు తీర్చుకోవచ్చు..అన్న క్రూయల్ ఆలోచన ..
కరీమ్ ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళడు…ఎప్పుడూ తనచుట్టూ మనుష్యులు ఉండాలి.ఇప్పుడు వెళ్ళేది జమిలి దగ్గరికి. అందుకే ఒంటరిగా వెళ్తున్నాడు.
అప్పుడే కరీమ్ కు ఫోన్   వచ్చింది.ఆ ఫోన్ కాల్ జమిలి దగ్గరి నుంచి.
ఉత్సాహంగా ఫోన్  లిఫ్ట్ చేసాడు.
” కరీమ్ డియర్..మీ మనుష్యులు  మిమ్మల్ని మోసం చేసి సిటీ అవుట్ స్కట్స్ వైపు వెళ్తున్నారు..వాళ్ళు  మీ దగ్గరికి వస్తారని చెప్పారుగా…ఇందాక మీకోసం బిర్యానీ పార్సెల్  తీసుకుని వస్తుంటే  బుల్లెట్స్ మీద వేగంగా వెళ్తున్నారు ” చెప్పింది జమిలి
ఇంకేమీ ఆలోచించలేదు కరీమ్.తన అనుచరులకు వీళ్ళు ఎక్కడ వున్నారో ట్రేస్ చేయమని చెప్పాడు
” వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు” అనుచరులు చెప్పారు
అంటే జమిలి చెప్పింది నిజమే
” వెంటనే సిటీ అవుట్ స్కట్స్ వైపు వెళ్ళమని..అక్కడ వాళ్ళు కనిపిస్తే చంపేసి డబ్బు తీసుకురమ్మని చెప్పాడు ” కరీమ్
తన ఎదురుగా వున్న జేమ్స్ భార్య వైపు చూసాడు.జేమ్స్ వచ్చి ఒక రియాల్టీ షో లో యాక్ట్ చేయాలని చెప్పేసరికి అప్పటి నుంచి  గాలిలో తేలిపోతున్నట్టు వుంది ఆమెకు.
” చెప్పండి సర్ ఏ టీవీ ఛానెల్ కు ? ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది” లాంటి ప్రశ్నలు అడిగింది
” నిన్ను జనం గుర్తు పడతారు.నిన్ను చూసి హేట్సాప్ అంటారు..ఒకేసారి అన్ని టీవీ ఛానెల్స్ లో కనిపిస్తావు ” నవ్వుతూ చెప్పాడు సిద్దార్థ
” ఇది తమ ఆపరేషన్ లో ఒక భాగమని…చెప్పలేదు ” సిద్దార్థ  …చెప్పవద్దని జేమ్స్ కు కూడా  చెప్పాడు..చెబితే అసలుకే మోసం రావచ్చు…
(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్) 
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY