నా తొలి డిటెక్టివ్ సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” ను ఆదరించిన పాఠకులకు కృతఙ్ఞతలు…శ్రీసుధామయి… సుగాత్రి డిటెక్టివ్ సిద్ధార్థ భుజం మీద తలపెట్టుకుని అడిగింది ” మన హనీ మూన్ ఎక్కడ ?

జేమ్స్ మిస్టర్ డి పానీపూరి సెంటర్ కు వచ్చాడు…అప్పటికే మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు…
జేమ్స్ నటనలో జీవించాడు…డ్రగ్స్ కు ఎడిక్ట్ అయ్యేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తున్నాడు..జూనియర్ ఆర్టిస్ట్ లు ప్రజల్లా కలిసిపోయారు.
జేమ్స్ భార్య రంగప్రవేశం చేసింది..రాత్రంతా బోల్డు సినిమా కాస్సెట్స్ చూసింది.పైగా ఇది రియాల్టీ షో అని సీక్రెట్ కెమెరాలు వుంటాయని సిద్దార్థ చెప్పడంతో చెలరేగిపోయింది.జేమ్స్ ను ఉతికి ఆరేసింది,
” ఏం జరిగింది..ఏం జరిగింది.”ప్రజల్లో కలిసిపోయిన జూనియర్ ఆర్టిస్టులు అడుగుతున్నారు సిద్దార్ఛ్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం
కొన్ని కామెర్లు అటు తిరిగాయి
అక్కడ వున్న మిస్టర్ డి అనుచరులు ,మిస్టర్ డి కు సంబంధించిన పానీపూరి బండేవాడు బిత్తరపోయి చూస్తున్నారు.
మిసెస్ జేమ్స్ పానీపూరి అమ్మేవాడిని చూపిస్తూ ” నా మొగుడు సచ్చినోడు..రోజూ ఇక్కడే పానీపూరి తింటుంటే టేస్ట్ బావుందనుకున్నాడు..ఆ తర్వాత మత్తుమందులకు అలవాటు పడ్డాడు.డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే పానీపూరీలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పరు…ఇంట్లో సొమ్ము గుల్ల చేస్తున్నాడు ” అంటూ పానీపూరి బండిని ఒక తన్ను తన్నింది
వెంటనే ప్రజల్లో వున్నా ఒక ఉద్ధుడు వీరావేశంతో వచ్చి  ” డ్రగ్స్ కలిపి జనంతో ఆదుకునే నాయాళ్లను తన్ని తరిమేయాలి.న కొడుక్కు కూడా అలవాటు చేసారు ” అన్నాడు..
అంతే మాస్ హిస్టీరియా
క్షణాల్లో పానీపూరి బండి ధ్వంసం అయ్యింది.ఆ బండి మీద వున్నా మిస్టర్ డి అన్న అక్షరాన్ని తొక్కుతుంను జనం
జూనియర్ ఆర్టిస్టులు యథోచితంగా అందుకు ఆజ్యం పోస్తున్నారు…
డ్రగ్స్ కు అలవాటు పడి రీహాబిలిటేషన్ సెంటర్ లో స్వస్తత పొంది వచ్చిన యూత్ నగరంలో వున్నా మిస్టర్ డి పానీపూరి బండ్ల మీద దండయాత్ర చేసింది.
టీవీలు లైవ్ కవరేజ్ ఇచ్చారు…
” పానీపూరి బండ్ల చాటున పానీపూరీలో డ్రగ్స్ ను అందిస్తూ యువతని కాదు చిన్నపిల్లల్ను మహిళలను తాగేట్ చేసి డ్రగ్ ఎడిక్ట్స్ గా మారుస్తున్న మిస్టర్ డి మాఫియాను తరిమికొట్టిన జనం..డిటెక్టివ్ సిద్దార్థ సాధించిన విజయం..” అంటూ బ్రేకింగ్ న్యూస్
                                                      ***
మిస్టర్ డి షాకయ్యాడు టీవీ ఛానెల్స్ లో వస్తున్నా బ్రేకింగ్ న్యూస్ చూసి.
అదే సమయంలో టీన్ స్థావరాల మీద,డ్రగ్స్  దాచిపెట్టిన గొడౌన్స్ మీద పోలీసులు   రైడ్ చేసారు..తన అన్ని ఫోన్స్ ను ట్రాప్ చేసినట్టు తెలిసింది.
దేశంలోని పథాన నగరాల్లో మిస్టర్ డి అనుచరుల మీద ,పానీపూరి సెంటర్స్ మీద ఏకకాలంలో దాడులు జరిగాయి.
రాబర్ట్ క్రీం లు ఒకరిమీద మరొకరు  కత్తులు దూసుకున్నారు
బుల్లెట్స్ దూసుకువెళ్లాయి
ఇద్దరూ ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారు.
                                ***
ఉపసంహారం
మిస్టర్ దయాల్ చరిత్రకు అంత్యకాలం సమీపించింది
ఇలాంటివాడిని రెస్ట్ చేయాలి..జనాల్లో ఒకమో గొంతు
అరెస్ట్ చేస్తే బయటకు వచ్చి మళ్ళీ మారణహోమం సృష్టిస్తారు..ఇంకొకరి గొంతు
వాడిని ప్రజలే చంపేయాలి
కోర్టులు బెయిల్స్ విదేశాలకు పారిపోవడం..
వాడెక్కడున్నాడో తెలిస్తే నామ్ చంపేద్దాం..జనం చంపితే హత్య కాదు,,,
వాడెక్కడున్నాడో తెలుసు..
ఎక్కడ..?
లైవ్ లో టీవీల్లో కనిపించే ఏ దృశ్యాలు చూసి మిస్టర్ డి మొదటిసారి భయపడిపోయారు.
పోలీసులను బెదిరించవచ్చు
కానీ తిరగబడ్డ  ప్రజలను.ఎదురించడం..జాసంద్రానికి ఎదురెళ్లి బ్రతకడం అసాధ్యం
ప్రజలుకలిశారు..ఒక్కటయ్యారు…అందులో ప్రజలను రెచ్చకొట్టింది జునీవులే ఆర్టిస్టులు..ప్రజల్లో కలిసిపోయారు.
అయితే ఇది నటన అని వాళ్ళు ఫీల్ కాలేదు.మనసున్న మనుష్యుల్లా ఆలోచించారు..నిజాయితీగా ప్రతిస్పందించారు…
జనంవస్తున్నారు..తన ఇంటి వైపే.
రహస్యంగా వున్న తన రహస్యస్థావరం వాళ్లకు ఎలా తెలిసింది..ముందు ప్రజలు
వెనుకే మీడియా
అప్పుడే మిస్టర్ డి ఫోన్ మోగింది..అటువైపు నుంచి డిటెక్టివ్ సిద్దార్థ
” హలో మై  డియర్ ఎనిమీ..
నువ్వు నాకు వ్యక్తిగతంగా శత్రువు అయితే నిన్ను క్షమించి వదిలేసేవాడిని
నువ్వు దొంగవో దోపిడీదారుడివో అయితే అరెస్ట్ చేయించి కోర్ట్ లో ప్రవేశపెట్టేవాడిని
కానీ నువ్వు ప్రజలారోహైముతో,మేధస్సుతో ఆడుకున్నావు..వాళ్ళను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసావు..అందుకే ప్రజల చేతిలో మరణశిక్ష,
లేదంటే విదేశాలకు పారిపోతావు.జైలులో నుంచే ఆఫీయాను శాసిస్తావు…
గుడ్ బై…”
ఫోన్ కట్  చేసాడు డిటెక్టివ్ సిద్దార్థ
                         ***
జనం చేతిలో మాఫియా హతం..మిస్టర్ డి దుర్మరణం
అన్న  బ్రేకింగ్ న్యూస్.
                                  ***
రాత్రికి రాత్రే మిసెస్ జేమ్స్ వేలెబ్రిటీ అయింది.ఓ రియాల్టీ షో వాళ్ళు పిలిచారు
జేమ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేయడానికి నిర్ణయించుకున్నాడు పోలీస్ డిపార్ట్మెంయ్ ఉద్యోగం ఇష్టాన్ని ప్రామిస్ చేసింది…
జూనియర్ ఆర్టిస్టులతో   ఒక ప్రొడ్యూసర్ సినిమా ప్లాన్ చేసాడు
                            ***
సుగాత్రి ,డిటెక్టివ్ సిద్దార్థ రోడ్డు మీద నిలబడి వున్నాడు.వాళ్ళ చేతుల్లో  లగేజీ  వుంది.
ఒక క్యాబ్ వచ్చి ఆగింది
” ఎక్కడికెళ్ళాలి సర్ …మేడం..” క్యాబ్ దిగి నవ్వుతూ అడిగాడు జేమ్స్
” ఎయిర్ పోర్ట్ కు…దారిలో పానీపూరి తినేసి వెళ్ళాలి…మనీ పే టీఎం లో పే చేయొచ్చా ” నవ్వుతూ అడిగాడు డిటెక్టివ్ సిద్దార్థ
క్యాబ్   ఎయిర్ పోర్ట్ వైపు వెళ్తుంది.
సుగాత్రి డిటెక్టివ్ సిద్ధార్థ భుజం మీద తలపెట్టుకుని అడిగింది ” మన హనీ మూన్ ఎక్కడ ?
                                   *** అయిపొయింది***
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY