మరో నలుగురు మనుష్యులకు ఏదో చెప్పి వారిని తమతో పాటు వారి విచిత్రవాహనం దిగిన ప్రదేశానికి తీసుకెళ్లసాగారు….ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి ” హాలోవీన్ ” ( హారర్ స్టోరీస్ ) 05 -08 -2018

   1
(హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకులకోసం…)
అది అమెరికా లోని ఫిలఢెల్పియా రాష్ట్రం. ఫేర్ మౌంట్ పార్కు. అక్కడ అక్టోబర్ నెలలో ” హాలోవీన్ ” సంబరాలు మొదలయ్యాయి.(హాలోవీన్ అనునది దయ్యాలపండుగ లేదా ఆత్మలపండుగ. ఈ పండుగ ను పాశ్చాత్యదేశాలలో ఆల్ సెయింట్స్ డే.. ఆల్ సోల్స్ డే అని కూడా పిలుస్తారు..) పురాతనకాలంలో “సెల్టిక్ “జాతి ప్రజలు ఈ పండుగను ఆరంభించారు. హాలోవీన్ చివరిరోజైన ఆత్మలదినం రోజున జీవించిఉన్న వారికి మరణించినవారికి ఉన్న సరిహద్దులు తొలగించబడతాయని సెల్టిక్ జాతి ప్రజలు విశ్వసించేవారు.
(హాలోవీన్ అనే పదం ఆల్ హాలోస్ ‘ఈవెన్ ‘ నుండి వచ్చింది. ఈవ్ అనునది ఈవెన్ కు సంక్షిప్తరూపం. ఈవెనింగ్ కు పురాతనపదం.)
హాలోవీన్ చివరిరోజైన అక్టోబర్ 31 న చెట్ల క్రింద వండిన పదార్థాలను ఆత్మలకు నివేదన చేసి ఆత్మలను ఆహ్వానించి పండగ చేసుకుంటారు. అనేక రకాల వేషాలు ధరించి పిల్లలు పెద్దలు ఈ పండగలో పాలు పంచుకుంటారు.
మంత్రగాళ్ల వేషాలు.. దయ్యాలవేషాలు డ్రాకులా వేషాలు వేసుకున్న ఇంకా ఎన్నో భయానక రూపాలతో ఫేర్ మౌంట్ పార్కులో సందడిగా తిరుగుతున్నారు. అక్కడున్న ప్రతిచెట్టు కొమ్మలకు గుమ్మడికాయల లాంతర్లు వెలుగుతున్నాయి. “ట్రిక్ ఆర్ ట్రీట్ ” కోసం పిల్లలు ఎన్నో రకాల వేషాలు ధరించి అందరి దగ్గరకు వెళ్లి బహుమతులను అందుకుంటున్నారు. (విచిత్రమైన వికృతమైన వేషాలు ధరించిన బాలలు ఇంటింటికీ వెళ్లడమే కాకుండా బహిరంగప్రదేశాలలో అందరి దగ్గరా మిఠాయిలు.. చాక్లెట్లు ..బహుమతులు అందుకోవడం హాలోవీన్ వేడుకలలో ఉన్న ఆనవాయితీ.. దీనినే ట్రిక్ ఆర్ ట్రీట్ అని పిలుస్తారు.)

ఆ ఫేర్ మౌంట్ పార్కులో ఎన్నో ప్రదర్శనాకేంద్రాలు ఏర్పాటు చేశారు. వింత వేషధారణలతో వికృతమైన రూపాలు ధరించిన వారు రకరకాల ప్రదర్శనలతో భయానకంగా కనిపిస్తున్నారు. దయ్యాలవేషాలు.. అస్థిపంజరాలు ..మంత్రగత్తెలు మంత్రగాళ్ల రూపాలు.. డ్రాకులా ల వేషాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం గోచరిస్తోంది.
“జాక్ -ఒ- లాంతర్లు” ప్రదర్శనకు ఉంచబడ్డాయి. (గుమ్మడికాయ ను లోపలంతా తొలిచి అందులో దీపాలను ఉంచడాన్ని లేదా గుమ్మడికాయల ఆకారంలో దీపాలను ఉంచడాన్ని జాక్ -ఒ- లాంతర్లు) అంటారు.
ప్రజల వద్ద జిత్తులమారి విద్యలను ప్రదర్శించడం. భయానక చలనచిత్రాలను ప్రదర్శించడం కూడా హాలోవీన్ ఉత్సవాలలో భాగం.
అందరూ సందడిగా ఉన్న ఆ ఫేర్ మౌంట్ పార్కులోకి మాథ్యూ.. డేవిడ్ లు ఇద్దరూ ప్రవేశించారు. వారు ప్రవేశించగానే అక్కడున్న గుమ్మడికాయల లాంతర్ల మీద చేయి పెట్టారు. అవి వెలుగుతూ ఆరడం మొదలుపెట్టాయి. అది చూస్తున్న అందరూ ఆశ్చర్యపోయారు. “మాథ్యూ డేవిడ్ లు ఇద్దరూ ఆధునిక మంత్రగాళ్లు”.. వారిద్దరూ అక్కడ జరుగుతున్న ప్రదర్శనలను తిలకిస్తూ వెలుగుతున్న గుమ్మడికాయల దీపాలను ఆర్పుతూ ఆరిన దీపాలను తమ విద్యలతో వెలిగిస్తూ తిరుగుతున్నారు. ఒకచోట హాలోవీన్ ను సూచించే నారింజ మరియు నలుపు వర్ణాలలో ఉన్న మిఠాయిలను ప్రదర్శనలో ఉంచారు. (హాలోవీన్ తో అనుబంధం ఉన్న రంగులు నారింజ నలుపు వర్ణాలు). మాథ్యూ డేవిడ్ లిద్దరూ ఆ మిఠాయిలను గబ్బిలాలుగా మార్చేసారు అవి అక్కడనుండి ఎగిరిపోయాయి. అది చూసిన అందరూ ఆశ్చర్యచకితులయ్యారు.
మాథ్యూ డేవిడ్ లిద్దరూ తమ విద్యలను ప్రదర్శిస్తూ పార్కు అంతటా తిరుగుతున్నారు. ఎండుగడ్డితో తయారుచేసిన వాహనాన్ని చిట్టడవిగా మార్చేసారు. మంత్రగత్తె వేషం ధరించిన ఒక అమ్మాయిని పొగ రూపంలోకి మార్చేసారు. భూతాలవేషం ధరించిన ఒక వ్యక్తిని డ్రాకులా గా మార్చి కోరలు వచ్చేటట్టు చేశారు.
దయ్యాలయాత్రలో దయ్యాలవేషాలు వేసినవారందరూ రక్తపిశాచులుగా మారిపోయారు. అలా తమ విద్యలను చూపుతూ వారు ఆ పార్కులో ఒకచోట ఎత్తయిన కొండలాంటి ప్రదేశానికి చేరుకున్నారు. ఆ కొండమీద ఒక పక్కగా ఎత్తయిన “ఓక్ ” చెట్లు ఉన్నాయి. హాలోవీన్ చివరిరోజైన ఆ రోజున చాలామంది అక్కడ ఆత్మలను ఆహ్వానించే కార్యక్రమాలలో మునిగి ఉన్నారు. ఆ ఓక్ చెట్లకు వ్యతిరేక దిశలో ఎగువగా ఒక గుట్టలాంటి ప్రదేశం ఉంది. ఆ గుట్టమీదకు ఎక్కిన మాథ్యూ డేవిడ్ లు ఇద్దరూ అక్కడే కూర్చుని ఓక్ చెట్లకింద జరిగే కార్యక్రమాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అంతలో గుట్ట వెనుక భాగంలో ఏదో విచిత్రమైన శబ్దం వినిపించింది. వారు అటుపక్క చూసేసరికి అక్కడికి ఒక విచిత్రమైన వాహనం కోరల్లాంటి రెక్కలతో ఎగురుతూ వచ్చి ఆగింది. ఆసక్తిగా అటువైపే చూస్తున్న ఇద్దరూ అందులో నుండి దిగిన నలుగురు మనుషుల లాంటి వాళ్లను చూసి మాథ్యూ డేవిడ్ లిద్దరూ ఉలిక్కిపడ్డారు. ఆ నలుగురికి నోటిలో కోరలు ఉండటమే కాక వారు నల్లని దుస్తులు ధరించి అత్యంత భయానకంగా రక్తపిశాచులులాగా అగుపిస్తున్నారు. అక్కడున్న జనంలోకి ఆ నలుగురు వెళ్లసాగారు. మాథ్యూ డేవిడ్ లు ఇద్దరూ వారిని వెంబడించసాగారు. ఒకచోట ఆగిన ఆ కోరల మనుషులు చుట్టూ కలియచూసి ఒకరినొకరు సైగలు చేసుకుని వెళ్లసాగారు. వారిని చూస్తున్న మాథ్యూ డేవిడ్ లిద్దరికీ కుతూహలం పెరిగింది. ఆ నలుగురు కోరల మనుషులు హాలోవీన్ లో వేషాలు ధరించిన వారిలా అగుపించడం లేదు.
ఆ నలుగురు కోరల మనుషులను చూస్తున్నవారందరూ హాలోవీన్ సందడిలో భాగంగా వేషాలు ధరించిన వారని అందరూ అనుకోవడంతో వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ మాథ్యూ డేవిడ్ లిద్దరూ అలా అనుకోకుండా వారిని వెంబడించసాగారు.
అందరినీ పరిశీలిస్తూ అంతటా కలియతిరుగుతున్న ఆ నలుగురూ మరో నలుగురు మనుషులకు ఏదో చెప్పి వారిని తమతో పాటు వారి విచిత్రవాహనం దిగిన ప్రదేశానికి తీసుకెళ్లసాగారు. అదంతా జాగ్రత్తగా గమనిస్తున్న మాథ్యూ డేవిడ్ లిద్దరూ వారికి తెలియకుండా వారిని అనుసరించసాగారు. ఆ నలుగురు కోరల మనుషులు తీసుకెళ్లిన నలుగురు మనుషులతో సహా విచిత్రవాహనంలోకి ప్రవేశించారు. వెంటనే దాని తలుపులు మూసుకున్నాయి. అదిచూసిన మాథ్యూ డేవిడ్ లిద్దరికీ భయం ఆశ్చర్యం రెండు కలిగాయి. వారిద్దరూ అక్కడే ఉండి ఏం జరుగుతుందా అని చూడసాగారు. లోపలికి వెళ్లిన ఆ కోరల మనుషులు కొద్దిసేపటి తర్వాత వారు మాత్రమే బయటకు వచ్చారు. వారినే చూస్తున్న మాథ్యూ డేవిడ్ లిద్దరూ ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డారు.ఆ కోరల నుండి రక్తం కారుతోంది. జడుసుకున్న వారిద్దరూ ఒకచోట దాగుండిపోయారు. తిరిగి ఆ కోరల మనుషులు సందడిగా ఉన్న జనంలోకి కలిసిపోయారు. వారు అటు వెళ్లగానే మాథ్యూ డేవిడ్ లిద్దరూ విచిత్రవాహనం వైపు పరిగెత్తారు. దాని తలుపులు తెరవడానికి విశ్వప్రయత్నం చేసినా తలుపులు తెరుచుకోవడం లేదు. దాని పక్కన ఉన్న గాజుఫలకం మీద చేతులు ఆన్చి లోపలిభాగం స్పష్టంగా కనిపించేలా చేసుకుని ఇద్దరూ లోపలికి చూసి భయకంపితులయ్యారు. కోరల మనుషులు తీసుకెళ్లిన నలుగురు వ్యక్తులు అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్నారు. వారందరికీ నోటినుండి కోరలు పొడుచుకుని వచ్చాయి. అంతలో కోరల మనుషులు ఇంకో నలుగురిని తీసుకొచ్చారు.

ఆ నలుగురినీ తీసుకురాగానే విచిత్రవాహనం తలుపులు తెరుచుకున్నాయి. మాథ్యూ డేవిడ్ లు భయంగా చూస్తునే ఉన్నారు. తిరిగి కోరల మనుషులు రక్తం కారుతున్న కోరలతో బయటికి వచ్చి జనంలో కలిసిపోయారు. వెంటనే విచిత్రవాహనం తలుపులు మూసుకుపోయాయి. మాథ్యూ డేవిడ్ లిద్దరూ విచిత్రవాహనం వద్దకు వచ్చి వాటికున్న రెక్కల్లాంటి కోరలను గమనించసాగారు. అలా గమనిస్తున్న వారిని కోరల మనుషులు చూశారు. వారినుండి తప్పించుకోవాలని చూసిన మాథ్యూ డేవిడ్ లిద్దరినీ వెంబడించి పట్టుకున్నారు. తప్పించుకోవాలని పెనుగులాడుతున్న వారిద్దరినీ ఆ కోరలమనుషులు విచిత్రవాహనం వైపు తీసుకెళ్లసాగారు. సరిగ్గా విచిత్రవాహనం తలుపులు తెరుచుకునే సమయంలో….
మనసులో ఏదో పఠిస్తున్న మాథ్యూ డేవిడ్ లిద్దరి చేతులలో “అడవి గులాబి కొమ్మలు మరియు హవ్తోర్న్ ” మొక్కలు ప్రత్యక్షమయ్యాయి. వాటితో ఆ కోరల మనుషులను బలంగా బాదసాగారు. అంతే ఆ కోరల మనుషులు క్రమంగా బలహీనపడిపోతున్నారు వాటి కోరలు మెల్లిగా మాయమయిపోతున్నాయి. వీరినుండి తప్పించుకున్న కోరల మనుషులు శరవేగంగా విచిత్రవాహనంలో ప్రవేశించారు. తలుపులు మూసుకున్న విచిత్రవాహనం కోరల్లాంటి రెక్కలతో ఆకాశంలోకి ఎగురుతూ క్రమంగా అదృశ్యమైపోయింది.
(అడవి గులాబి కొమ్మలు మరియు హవ్తోర్న్ మొక్కలు డ్రాకులాలను రక్తపిశాచులను బలహీనపరిచి వాటిని శక్తిహీనులుగా మారుస్తాయని తెలిసిన సమాచారం ఆధారంగా……రచయిత్రి )

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

 హారర్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY