ఏమైపోతుంది …ఎటుపోతోంది …వీరజవానుల త్యాగాలకు గుర్తింపు ఎక్కడ? … రాధా ప్రశాంతి

మనలోని మానవత ఏమైంది ?
మనలోని విజ్ఞత ఎక్కడికి వెళ్ళింది ?
త్యాగాల ఫలాలు అందుకున్న మనం
ఆ త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుంటున్నామా ?
గడ్డకట్టించే ,ప్రాణాలు హరించే చలిలో …
ప్రజల భద్రతే బాధ్యతగా భావించే జవాను
భార్యను వదిలి కుటుంబాన్ని వదిలి
బంధువులను వదిలి ,సుఖాలను త్యజించి
దేశరక్షణలో ప్రాణాలను ఫణంగా పట్టి పోరాడి అసువులు బాసిన అమరులకు …
ఎన్ని కోట్ల నజరానా ఇస్తే సరిపోతుంది?
వారి త్యాగానికి ఖరీదు కట్టే షరాబు ఎవరు ?
అలాంటి వీరులకు రాజకీయపార్టీలు ,ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి..?
వారికి శిలావిగ్రహాలు కట్టించి
వారి కుటుంబాన్ని ఆదుకుని
రేపటితరానికి మరో వీరజవానును అందించడానికి ప్రోత్సహిస్తున్నాయా?
వ్యక్తిగత పరువుహత్యల్లో మరణిస్తే ఆర్థికసాయాలు ప్రభుత్వస్థలాలు అవసరమా?
యుద్ధంలో పోరాడి శత్రువుల చేతిలో చిత్రహింసలు అనుభవించి దేశం కోసం పోరాడేవారిని మీడియా ఎంతవరకు ఆకాశానికి ఎత్తుతుంది…
నడిరోడ్డు మీద చంపుకుంటే బ్రేకింగ్ న్యూస్..లైవ్ లు డిబేట్స్ సానుభూతి పవనాలు చర్చలు…
మరి దేశసరిహద్దుల్లో దేశం కోసం మరణిస్తే..ఆ గుర్తింపు ఎక్కడ?
బ్రేకింగ్ న్యూస్ లైవ్ లు ఎక్కడ ?
ఓ మహాత్మా..
ఓ మనీషీ
ఓ మానవతా…
ఏమిటీ దుస్థితి ?
( వ్యవస్థలోని స్థితిని దుస్థితిని చూసి నా ఆవేదనను అక్షరాల్లోని అనువదించాను … రాధాప్రశాంతి )

 

ఈ కథనాన్నిమీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY