ఆమె తన సైన్యం …తనే ఒక మహాసైన్యం. బెదిరిపోలేదు పారిపోలేదు ..సమస్యలతో పోరాడింది..రాధాప్రశాంతి … అంతరంగ కథనం

ఓడిశాలోని గజపతి జిలాలోని కాశీనగర్ లో పుట్టిన కృష్ణవేణి రాధా ప్రశాంతి గా ఎలా ఎదిగింది ?
తండ్రి అకాల మరణంతో తల్లిదండ్రుల నిరక్షరాస్యతను అడ్డం పెట్టుకుని కొందరు స్వార్థపరులు ఆస్తులను ఆక్రమించుకుంటే ఎలా ఒంటరిపోరాటం చేసింది ?
ఆమె ఒక్కరే..ఆమె తన సైన్యం ..తనే ఒక మహాసైన్యం.
బెదిరిపోలేదు పారిపోలేదు ..సమస్యలతో పోరాడింది..
కనిపించే శత్రువులను కనిపించని శత్రువులనూ ఎదురించింది.
నాటకాలు వెండితెర పాత్రలు ఆ పై బుల్లితెరలో సృష్టించిన సంచలనాలు,..
స్వచ్ఛంద సేవాసంస్థతో ( స్టెప్ ) తో మొదలుపెట్టిన సామాజికసేవ…
రాష్ట్రపతి అవార్డు తో హస్తినకు చేరుకున్న ప్రతిభ.
రాధా ప్రశాంతికి …
ఆవేశం ఎక్కువే ..అందులో ఆవేదన వుంది
కోపం ఎక్కువే..అందులో కరుణ వుంది.
అన్నింటికీ మించి మానవతే నా మతం అనే విశాల దృక్పథం వుంది.
ఇది హిపోక్రసీ లేని నా అంతరంగకథనం ..అంటుంది…
రాధా ప్రశాంతి మాటల్లో ..
కన్నీళ్లతో ధారలు కట్టిన నిర్భాగ్యుల కళ్ళు తుడిచి చేయి అందించాలి
వేదనలతో అత్యాచారాలతో విలపించే నిస్సహాయులకు నేనున్నాను..అనే భరోసా ఇవ్వాలి.
అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణలు అందరి మీదా ఉండాలి
అసురుల పాలిట అపరకాళికలు కావాలి మహిళలు ..
అన్యాయాన్ని దునుమాడాలి అకృత్యాల ఎదురించాలి.
సమానత్వం అంటే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం..మానవత్వాన్ని అందరికీ పంచడం…
ఇదే నేను..రాధాప్రశాంతి అను నేను…
వచ్చే వారం నుంచి ప్రతీవారం
రాధాప్రశాంతి … అంతరంగ కథనం

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY