మధువు మత్తులో చిత్తైపోయారు..ఆటపాటల్లో చేయి కలిపారు.వారు ఇచ్చిన పానీయం తాగి మత్తులోకి జారుకున్నారు.వాళ్ళు పూర్తిగా మత్తులోకి జారుకోకుండానే స్త్రీల వేషంలో వున్న గజదొంగలు నగలవర్తకులను సోదా చేయడం మొదలుపెట్టారు… శ్రీసుధామయి ” జ్వాలాముఖి…మంత్రాలదీవి “ ( 11 -11 -2018 )

4
నలుగురు బాటసారులు అడవి మార్గంలో వస్తున్నారు…
వారి తలపాగాల్లో వరహాల మూటలు వున్నాయి. పేరుమోసిన నగల వర్తకులు.రాజు అష్టానంలో వుండే ప్రముఖులకు ఆభరణాలు విక్రయించి వచ్చిన సొమ్మును వరహాలుగా మార్చుకుని వస్తున్నారు.దారిలో మధువు సేవించారు…అడవి గుండా తమ నగరానికి చేరుకోవడానికి బయల్దేరారు.
మధువు మత్తులో వారికి గాజుల గలగలలు వినిపించాయి.తలలు తిప్పి చూస్తే గుడారం బయట నృత్యాన్నిచేస్తున్నారు.కొందరు మహిళలు.
మధువు మత్తులో చిత్తైపోయారు..ఆటపాటల్లో చేయి కలిపారు.వారు ఇచ్చిన పానీయం తాగి మత్తులోకి జారుకున్నారు.వాళ్ళు పూర్తిగా మత్తులోకి జారుకోకుండానే స్త్రీల వేషంలో వున్న గజదొంగలు నగలవర్తకులను సోదా చేయడం మొదలుపెట్టారు…
వర్తకుల మత్తు దిగిపోయింది.పక్కనే వున్న నీటిమడుగులో తలలు పెట్టారు..మత్తు దిగిపోయింది.వెంటనే పారిపోవడం మొదలుపెట్టారు.
హిగ్గారీలు చేజిక్కిన సొమ్మును చేజార్చుకోరు.,,ప్రాణాలు తీసయినా సాధించుకుంటారు…వర్తకులను ఆయుధాలతో వెంబడించారు
వర్తకులు పరుగెడుతూనే ప్రాణభయంతో రక్షించండి..రక్షించండి అంటూ అరుస్తున్నారు.
***
ఒక్కసారిగా ఉలికిపాటుతో కళ్ళు తెరిచాడు విజయుడు..అతనితో పాటే విక్రముడు కూడా..
చెవులు రిక్కించారు.అప్పటికే రాయంచ చిలుక ఆ ఆర్తనాదాలు వినిపించిన వైపు గాల్లోకి ఎగిరి వెనక్కి తిరిగొచ్చింది..విజయవిక్రములకు ఆర్తనాదాలు వినిపించిన వైపు దారి చూపించింది.
వర్తకులు ప్రాణభయంతో పరుగెత్తుకు వస్తున్నారు.విజయుడు అక్కడికి చేరుకున్నాడు,విక్రముడు ఒరలో నుంచి కత్తి దూశాడు.విజయుడి చేయి కరవాలం పిడిని బిగించి పట్టుకుంది.
ఏ క్షణమైనా అతని చేయి కరవాలాన్ని గాల్లోకి ప్రయోగించడానికి సిద్ధంగా వుంది.అతని ఖడ్గధాటిని ఆపగల శక్తి ఎవరికీ లేదు.
***
“మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు…:”వర్తకులకు అభయమిచ్చాడు విజయుడు
స్త్రీల వేషంలో వున్న హిగ్గారీలు తమ బొడ్లలో వున్న విషం పూయబడిన పిడిబాకులు బయటకు తీశారు.
విజయుడు ఒరలో నుంచి కరవాలాన్ని తీసి ఆగిపోయాడు.ఎదురుగా వున్నది స్త్రీలు..స్త్రీల మీద ఆయుధాన్ని ప్రయోగించడు…
“మీరెవరో మహావీరుల్లా వున్నారు…మమ్మల్ని వీరి బారి నంచి కాపాడండి “వర్తకులు మొరపెట్టుకున్నారు.
రాయంచ విజయుడు చెవిదగ్గర వాలి”ఆలస్యం చేయకు మిత్రమా..నీ కరవాలంతో వారి తలలు ముక్కలు అవ్వాలి “అన్నది
“నేను మహిళల మీద ఆయుధాన్ని ప్రయోగించను”విజయుడు అన్నాడు
రాయంచకు విషయం బోధపడింది.
హిగ్గారీలు పిడిబాకులు గాల్లోకి దూశారు.. అవి విజయవిక్రముల ప్రాణాలను హరించి వేయడానికి సిద్ధంగా వున్నాయి.
విక్రముడు విజయుడి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాడు.
రాయంచ స్త్రీల వేషంలో వున్న హిగ్గారీలలో ఒక గజదొంగను సమీపించి ముఖానికి అడ్డుగా వున్న వస్త్రాన్ని తన ముక్కుతో తొలిగించింది.దట్టమైన గుబురుమీసాలు వున్న హిగ్గిరీ ముఖం కనిపించింది విజయుడికి.
అప్పటివరకు స్ట్రీలు అనే భావంతో వున్న విజయుడు చురుగ్గా కదిలాడు..మెరుపువేగంతో కరవాలాన్ని తిప్పాడు.గాలిని చీల్చుకుంటూ వెళ్లిన ఆ కరవాలం పిడిబాకును రెండుముక్కలు చేసింది.పిడిబాకు పట్టుకున్న చేతిని శరీరం నుంచి వేరుచేసింది.
ఎప్పుడైతే విజయుడు కరవాలం గాలిలోకి విసిరాడో చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు విక్రముడు..చూస్తుండగానే (హిగ్గారీలు) గజదొంగలు నేలకు ఒరిగి ప్రాణాలు విడిచారు.
***
“మహావీరులకు కృతజ్ఞతలు..తమరెవరో తెలుసుకోవచ్చా వీరుల్లారా “అడిగారు వర్తకులు
“ఈ దేశానికి కాబోయే మహారాజు..యువరాజు “అని చెప్పబోయాడు విక్రముడు..కానీ విజయుడు వారించాడు…”మేమూ మీవలె బాటసారులం..మధువు మత్తు మంచిది కాదు..దారిలో గజదొంగలు వుంటారు.మీ పిల్లాపాపలు మీకోసం ఎదురుచూస్తూ వుంటారు..మధువుకు మగువకు బానిసలు కావద్దు”హెచ్చరించాడు విజయుడు.
తలలు వంచుకుని మన్నింపు కోరి”ఎప్పుడూ మధువు ముట్టుకోమని ప్రమాణం చేసి అక్కడి నుంచి కదిలారు
***
“మిత్రమా ఏ గురించి చెప్పబోతే వారించారు”సందేహంగా అడిగాడు విక్రముడు
“మనం ఎవరో చెబితే గుట్టురట్టు అవుతుంది..మనం ముందు దేశసంచారం చేదాం..ప్రజల కష్టముఖాలు విచారిద్దాం..ఈ అడవిలో బాటసారులకు రక్షణ లేదని తెలిసింది..ఇక్కడ సైనికులను వుంచవలిసిన అవసరం వుంది.సైనికుల గస్తీ తప్పనిసరి “చెప్పాడు విజయుడు
ఈలోగా విక్రముడు ప్రాణాలు కోల్పోయిన వారిని పరిశీలించి”మిత్రమా..ప్రమాదం పొంచి వుంది”అంటూ హెచ్చరించాడు ఒరమీద చేయివేసి
“ఏమంటున్నావు మిత్రమా..ప్రమాదమా?
“అవును మిత్రమా మీచేతిలో మరణించిన వీరు హిగ్గారీలు అనే అతిక్రూరమైన గజదొంగలు..విషం పూసిన పిడిబాకులతో మెరుపువేగంతో దాడి చేస్తారు..మహిళారూపంలో మగువుల బలహీనత వున్న ధనికులైన బాటసారులను కనిపెట్టి…ఆకర్షణతో మోసం చేసి నిలువుదోపిడీ చేస్తారు..ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు..మహారాజు గారు..మంత్రివర్యులైన మా తండ్రిగారు ఒకపుడు వీరిని తరిమికొట్టారు…దేశాలు తిరుగుతూ వేషాలు మారుస్తూ వుంటారు…అడవుల్లో గుడారాల్లో వీళ్ళు నివాసం ఏర్పరచుకుంటారు” తనకు తెలిసిన సమాచారం చెప్పాడు
అప్పటికే రాయంచ గాలిలో ఎగురుకుంటూ వెళ్లి ఆ గుడారాన్ని పసిగట్టి వచ్చి విజయుడికి చెప్పింది
***
హిగ్గారీల పీడ విరగడ చేయాలనీ నిశ్చయించుకున్న విక్రమ విజయులు అశ్వాలను ముందుకు దూకించారు.రాయంచ పంచకల్యాణి తలమీద దర్జాగా కూచుంది.

( సశేషం )

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY