విజయవంతమైన చాత్తాద శ్రీవైష్ణవ వివాహ పరిచయ వేదిక … ఈసారి మరింత ఘనంగా జరుపుకుందాం …అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్

నవంబర్ 11 ( మేన్ రోబో బ్యూరో )
ఇది ఒక మంచి సత్ సంప్రదాయం..స్ఫూర్తిదాయకం.సంఘం ఐక్యతకు శుభకార్యాలకు శ్రీకారం చుట్టిన ఆహ్లాదాల ఆదివారం .
బంధువులంతా ఒక్కచోట చేరారు.ఒక్కటై నిలిచారు.కార్యవర్గం ఆహ్వానం పలికింది.అధ్యక్షులు ప్రసంగించారు.ఒక్కతాటిపై నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర చాత్తాద శ్రీవైష్ణవ ” వివాహ పరిచయ వేదిక ” సంఘభవనంలో అంగరంగ వైభవంగా జరిగింది.తల్లిదండ్రులు యువతీయువకులు ఈ వివాహ పరిచయవేదికలో పాల్గొన్నారు.
” అనుకున్న సంఖ్య కన్నా ఎక్కువగా సుమారు అయిదువందల మంది బంధువులు ” వివాహ పరిచయ వేదిక ” లో పాలుపంచుకున్నారని.భవిష్యత్తులో విశాలమైన వేదికపై ఈ వేడుకను మరింత ఘనంగా జరిపే ప్రయత్నం చేయనున్నట్టు ” తెలంగాణ రాష్ట్ర చాత్తాద శ్రీవైష్ణవ సంఘ అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ తెలియజేసారు.
ఈ పరిచయవేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రాష్ట్ర కార్యవర్గం హర్షం వ్యక్తం చేసింది.ప్రతీ ఒక్కరికీ కృతఙ్ఞతలు తెలియజేసింది.
రూరల్ వరంగల్ జిల్లా సంఘ వార్షికోత్సవ ఆత్మీయ వేడుకలకు 25,000 వేల రూపాయల చెక్కును రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవ్ అందజేశారు ఈ సందర్భంగా రూరల్ జిల్లా అధ్యక్షులు కార్యవర్గం అధ్యక్షడి వితరణకు ధన్యవాదాలు తెలియజేసింది.


ఈ సందర్భగా రాష్ట్ర సంఘభవనంలో ” సంఘానికి వచ్చే వారికీ దాహార్తిని తీర్చే ” మంచినీటి ఏసీ కూలర్ ” ను సంఘభవనానికి బహుకరించారు రాష్ట్ర అధ్యక్షులు వేణుమాధవ్.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY