మార్పుకోసం మార్గదర్శకుడు.. జనం కోరే అదినాయకుడు నవతరానికి నవ్యపథానికి అధినాయకుడు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి విద్యార్థులు ఆకాంక్ష ఉపాధ్యాయుల తీర్మానం తలిదండ్రుల హర్షం

( మేన్ రోబో బ్యూరో )
మహాత్ముల కలలను నిజం చేయాలంటే ఎన్నికల్లో  నిలబడాలి
విద్యార్థులు ఆకాంక్ష ఉపాధ్యాయుల తీర్మానం తలిదండ్రుల హర్షం
ఎన్నికల కురుక్షేత్రంలో డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి 
ఇది అపూర్వమైన విషయం..లోటస్ ల్యాప్ స్కూల్ కాబినెట్ లో విద్యార్థులు విద్యార్థులు సమావేశం అయ్యారు.ఉపాధ్యాయులు  విచ్చేసారు.తల్లిదండ్రులు హాజరయ్యారు.
అందరూ ఏకగ్రీవంగా వినూత్నంగా చరిత్రలో నిలిచే అద్భుత సంఘటనకు శ్రీకారం చుట్టారు.
రాజకీయ ప్రక్షాళన అవసరం..విద్యార్థులు భవిష్యత్తు కోరేవాళ్ళు వ్యవస్థలో మార్పు కావాలని అనుకునే వారు మన వూరు మన   రాష్ట్రం మనదేశం బాగుండాలని అనుకునేవాళ్లు…
ఎన్నికల్లో నిలబడాలి..అవినీతితో  కలబడాలి.ఉన్నతమైన ఆశయాలతో ప్రజాసేవే పరమార్థం గా   నిస్వార్థంగా పనిచేసే నాయకులు రావాలి ..కావాలి…
ఆ వ్యక్తి తమ చైర్మన్ కావాలి…అంటూ ముక్తకంతంతోనినదించారు .ఏకగ్రీవంగా తీర్మానించారు .
లయన్స్ క్లబ్ ద్వారా..ఎన్నో ఆరోగ్యశిబిరాల  నిర్వహణ , విద్యావేత్తగా చైర్మన్ గా విద్యారంగంలో సృజనాత్మకతకు ఊపిరిపోసిన అపర బ్రహ్మ, సామాజికవేత్త గా ,సహృదయశీలిగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహణ…ఎన్నింటికో ఆదర్శంగా నిలిచిన నిరాడంబర సృజనశీలి..రేపటిభవిష్యత్తు కోసం శ్రమించే శ్రామికశక్తి ..మనం ఇంకా ఇంకా దేశం కోసం ప్రజల కోసం అన్నార్తుల కోసం వృద్ధుల కోసం ఏదైనా చేయాలనుకునే తపన …
ఇవ్వన్నీ  తన ఆశయాల అంబుల  పొదిలో అస్త్రాలుగా చేసుకున్న వ్యక్తి డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలని ” అందరి కోరికపై ” నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ఒక విద్యావేత్త
సమాజం పట్ల అవగాహన వున్న సామజిక దృక్పథం వున్న మానవతావాది,
కొన్నివేల మందిని విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన విద్యాసంస్థల అధినేత     
ఎన్నికల్లో నిలబడి సమాజహితం కోసం ప్రజాప్రతినిధిగా పోటీచేయాలన్న నిర్ణయాన్ని మేన్ రోబో అభినందిస్తుంది..స్వాగతిస్తుంది.
కొత్తరక్తం కావాలి..యువతరపు నవ్య ఆలోచనలకు భావితరం నేత కావాలి.
అభిమానులు లయన్స్   క్లబ్ సభ్యులు తల్లిదండ్రులు ఉపాధ్యాయలోకం ప్రజలు బాసటగా నిలుస్తారని
సరోకొత్త ప్రపంచాన్ని ఆశయాలను నిజం చేయాలన్న డాక్టర్ కోమటిరెడ్డి కలలకు ఓట్ల ద్వారా మద్దతు పలుకుతారని ఆశిద్దాం.
ఈ సమావేశంలో స్కూల్ క్యాబినేట్ ప్రిన్సిపాల్ గీత, సుబ్రహ్మణ్యం, పీఆర్వో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY