అర్హతకు కులమేమిటి మతమేమిటి రంగూ రుచి కరెన్సీ భాషలు ఏమిటి ? అభివృద్ధి సౌకర్యాలకు పంచభూతాలకు కులమతాలు ఉంటాయా? డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ప్రత్యేక కథనం…మళ్ళీ ఎన్నికలు వచ్చాయి…ఎన్నో కలలను మోసుకొచ్చాయి.

మళ్ళీ ఎన్నికలు వచ్చాయి…మళ్ళీ ఎన్నో కలలు వచ్చాయి…భవిష్యత్తు మీ చేతిలోనే…మీ చేతల్లోనే …!
ఈ కలలు కల్లలు అవుతాయా ?  ఈ ఎన్నికలు ప్రజలకు నిరాశనే మిగులుస్తాయా ?
ఓటువేసి ఓటర్లూ …ఓటుహక్కు వున్న విజ్ఞులూ
నేటి నవ యువతా ..ఒక్కక్షణం ఆలోచిద్దాం
ఒక్కక్షణం మౌనం పాటిద్దాం
ఒక్కక్షణం పునరాలోచించుకుందాం.
ఒక్కరోజు అవసరానికో ..నోటుకు ఓటు అనర్హుడికి వేయబడితే మన భవిష్యత్తు ఐదేళ్లు వెనక్కి వెళ్తుందన్న విషయం మర్చిపోకండి ?
గత ఎన్నికల్లో నిలబడింది ఎవరు ?
నిలబడి గెలిచి మీ నియోజకవర్గానికి మేలు చేసినదెంత..? .మిన్నకుండి అభివృద్ధిని మరిచినది నిజమా ?
ఒక్కసారి ఆలోచించండి.ప్రతీ ఊళ్ళో ఓ రచ్చబండ ఉంటుంది అందరూ అక్కడికి చేరండి మహిళలు వృద్ధులు యువకులు కలిసి ఆలోచించండి.మీ వూళ్ళో వున్న సమస్యలు ఏమిటి ? అభివృద్ధికి నోచుకోక ఎన్నాళ్ళయింది ?
మీ ఊరి అభివృద్ధికి కృషి చేసినది ఎవరు ?
అలాగే ప్రచారానికి వచ్చిన అభ్యర్థి వ్యక్తిత్వం ఏమిటి ?
సామజిక సేవారంగంలో అతని నేపథ్యం ఏమిటి ?
మీరు మీ వూరి బాగు కోసం కోరుకుంటున్నది ఏమిటి ? కలిసికట్టుగా నిర్ణయించుకోండి.మీ ఊరి అవసరాలు చెప్పండి.మీ ఊరిని అభివృద్ధి చేస్తారనే నమ్మకం వున్న వారికే ఓటు వేయండి.
ప్రతీ వూరు ఒక ఆదర్శం గా నిలబడాలి.
సమర్ధుడైన అభ్యర్థి ఎవరనేది చూడండి.
కనీసావసరాలు అయిన నీరు విద్యుత్తు రహదారులు సంక్షేమం ఉద్యోగాల కల్పన ..ఇవి తీర్చగలవారెవరు ?
అభివృద్ధి సౌకర్యాలకు పంచభూతాలకు కులమతాలు ఉంటాయా?
పార్టీలు జెండాలు అజెండాలు ఉంటాయా?
సమర్ధుడికి నిజాయితీపరుడికి మీకు నిరంతరం అందుబాటులో వుండే నాయకుడికే మీ ఓటు వేయండి.ఒక్క ఓటు మీ భవిష్యత్తుని కాదు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అన్న విషయం మర్చిపోకండి.
మీ విజ్ఞతకే నా ఓటు
మీ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY