పారాహుషార్ …ప్రతీ ఓటరు ఒక సర్జన్ కావాలి. అవినీతి రాజకీయ వ్యవస్థకు శస్త్ర చికిత్స చేయాలి.ఓటు ఆయుధంగా మారాలి. డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్ ( 26 -11 -2018 )

” మమ్మల్ని సృష్టించి మాకు మెదడును కూడా సృష్టించి ఇచ్చిన దేవుడా…. మమ్మల్ని మన్నించి..అవినీతి అవకాశవాద రాజకీయాలతో అరాచకీయాలతో లోపభూయిష్టమైన ఈ వ్యవస్థలోని అవస్థలకు శస్త్రచికిత్స చేసే ఓటు అనే అస్త్రాన్ని సద్వినియోగం చేసుకునే శక్తిని ఇవ్వు ..మాకు విచక్షణను ప్రసాదించు “
***
అయిదేళ్ల జాతర మొదలైంది.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైంది.. రాజరికాన్ని వద్దనుకుని ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని చిత్తశుద్ధితో ప్రజల కొరకు ప్రజలు చేత ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధులను శాసనసభకు పంపించడానికి ఓటు స్వాగతం పలుకుతుంది.
కానీ…
ఓట్లు లూటీ అవుతున్నాయి.
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయి.గెలుపును నిర్ణయించే అవకాశం ఓటర్లకు కాకుండా..ఆ ఓటర్లను ప్రభావితం చేసే నోట్లకు బదిలీ చేసేందుకు అభ్యర్థులు యథాశక్తితో కృషి చేసే దురవస్థ మొదలయింది.సిగ్గు సిగ్గు …వాటే షేమ్
మై డియర్ ఓటర్స్ …
మీ ఓటు ఎటు ?
మీ ఓటు మీ ఇష్టం
కానీ
ఆ ఇష్టం మీకు కష్టం తెచ్చి పెట్టకూడదు.ఒక్కరోజు ఒక్క నోటుకు అమ్ముడైతే ఆ ఓటు అయిదు సంవత్సరాలు 1 ,825 రోజులు రాష్ట్రాన్ని దేశాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. అతలాకుతలం చేస్తుంది.అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తుంది.
ఓటు వేసే ముందు ఆలోచించండి.డబ్బు మిమ్మల్ని ప్రభావితం చేస్తే ..మిమల్ని అభ్యర్థులు ప్రభావితం చేస్తే..అనివార్యమైతే నోటు తీసుకోండి.
కానీ
ఓటు వేసే ముందు మాత్రం విచక్షణతో రాజకీయాలకు అతీతంగా
పార్టీ జెండాలకూ అజెండాలకు కాసింత దూరంగా జరిగి
అభ్యర్థుల గుణగణాలు ఆ అభ్యర్థి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అతని సామజిక సేవా నేపథ్యం తెలుసుకోండి.
మీ ఓటు సమర్థులకు వేస్తె మన రాష్ట్రం దేశం సస్యశ్యామలం అవుతుంది.ఇతోధికంగా అభివృద్ధి చెందుతుంది.
అంతే కాదు
మీకు డబ్బులిచ్చి ఓటు వేయించుకుని రాష్ట్రాన్ని అవినీతితో స్వార్థంతో దండుకు తినాలనుకునే వారికి చెంపపెట్టు అవుతుంది.
” డబ్బు వెదజల్లిన అభిమానాన్ని అధికారాన్ని సాధించడం సాధ్యం కాదన్న విషయం వాళ్లకు అర్థం అవుతుంది.
మనలోని సేవాదృక్పథం సామాజికసేవా తత్పరతే మనల్ని గెలిపిస్తుంది ” అని నగ్నసత్యం వాళ్లకు తెలిసి వస్తుంది.
ఆపై మీ ఇష్టం
నా ఓటు సమర్థుడికే.
మరి మీ ఓటు ?
మేరా భారత్ మహాన్

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY