రూపాలిని పనిమనిషిగా పెట్టుకున్న తర్వాత ఆశిష్ ఇంటి పరిస్థితి మారిపోవడం మొదలైంది…శ్రీసుధామయి అపరాధ పరిశోధన కథ ” బ్లాక్ మెయిలర్ ” (30-12-2018)

ఆశిష్ గుప్తా ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ . అతనికి ఎన్నో కంపెనీలు ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి. లంకంత ఇంట్లో అతడు తన భార్య అదితి మాత్రమే ఉంటారు.
ఆశిష్ గుప్తా తన బిజినెస్ వ్యవహారాలలో మునిగి తేలుతూ ఇంటికి ఎప్పటికో చేరుకునేవాడు. అదితి లంకంత ఇంట్లో ఒక్కతే ఉంటుండేది.
అదితితో పాటు వారింట్లో తనకు చిన్నప్పుటినుండి తెలిసిన ఒకావిడ ఎంతో నమ్మకమైన పనిమనిషిగా ఉండేది. అందుకే ఆశిష్ గుప్తా తన బిజినెస్ వ్యవహారాలలో మునిగి తేలుతూ ఇంటి గురించి ఆలోచించడం మానేశాడు.
హఠాత్తుగా జబ్బుపడిన పనిమనిషి రావడం మానేయడంతో అదితి ఎంతో బాధ పడటం మొదలు పెట్టింది.
అదితి బాధను చూడలేని ఆశిష్ గుప్తా పనిమనిషి కావాలంటూ పేపర్లో ప్రకటన ఇప్పించాడు.
చివరకు అదితి పెట్టిన షరతులన్నింటికీ ఒప్పుకుని రూపాలి అనే అమ్మాయి వారింట్లో పనికి కుదిరింది. కొద్దిరోజులు రూపాలిని గమనిస్తూ వచ్చిన అదితి సంతృప్తి చెంది ఇంటినంతా రూపాలీ మీద వదిలేసి తన లోకంలో తానుండసాగింది.
కానీ కొద్దిరోజుల తర్వాత రూపాలి వేషధారణ మారిపోయింది. అత్యంత ఖరీదైన వస్తువులు రూపాలి వద్ద కనిపించసాగాయి. తమ ఇంట్లో ఏదైనా డబ్బు దొంగిలించి ఇలాంటి ఖరీదైన వస్తువులు వాడుతోందా అన్న అనుమానం అదితికి కలిగింది. కానీ తమ ఇంట్లో పూచికపుల్లతో సహా అన్నీ భద్రంగా ఉంటున్నాయి. సంతృప్తి చెందిన అదితి రూపాలి ని ఏమీ అడగకుండా తనకెందుకులే అన్నట్టు మౌనంగా ఉండిపోయింది
కొన్నిసార్లు మౌనంగా ఉండటం వలన జీవితంలో కోలుకోలేని దెబ్బ తగలవచ్చు. కానీ కొన్నిసార్లు అదే మౌనమే మనలను కాపాడవచ్చు.

* * *

తన కాబిన్ లో సీరియస్ గా ఏదో పని చేసుకుంటున్న ఆశిష్ గుప్తా సెల్ ఫోన్ కు ఏదో మెసేజ్ వచ్చింది. అదేమిటో చూద్దామని అనుకునేలోపు ఆశిష్ అంటూ ఎవరో పిలవడంతో ఆ మెసేజ్ చూడకుండా అక్కడనుండి వెళ్లిపోయాడు ఆశిష్ గుప్తా. అటు తర్వాత సెల్ ఫోన్ గురించి మరిచిపోయి తన పనిలో మునిగిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత ఆశిష్ గుప్తాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన ఆశిష్ కు ముచ్చెమటలు పోసాయి. తన ఫోన్ లో వచ్చిన మెసేజ్ చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది. వెంటనే తన ప్రాణస్నేహితుడు తన బిజినెస్ పార్ట్నర్ అయిన సక్సేనాకు ఫోన్ చేశాడు. కంగారుగా చెమటలు తుడుచుకుంటున్న ఆశిష్ ను చూసి ఏమైంది ఆశిష్ అని అడిగాడు.
స్నేహితుడిని చూసిన ఆశిష్ తత్తరపాటుతో ఏం లేదు నాకు వెంటనే ఇరవైలక్షలు కావాలి బ్యాంకు నుండి తెచ్చిపెట్టమని అడిగాడు. ఆశిష్ ఏదో సమస్యలో ఉన్నాడనుకుంటూ ఇరవైలక్షలు బ్యాంకు నుండి తీసుకొచ్చి స్నేహితుడికి అందచేశాడు సక్సేనా. అది తీసుకుని కంగారుగా బయటకు వెళ్లిపోయాడు ఆశిష్ .
ఆ రోజు బాగా తాగి ఇంటికి చేరుకున్న ఆశిష్ గుప్తా తన భార్య అదితిపై అనవసరంగా కోపగించుకుని చేయి చేసుకున్నాడు. ఏం జరిగిందో అర్థం కాక తన భర్త అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాని అదితి బాధ పడుతూ ఉండిపోయింది.
అటు తర్వాత ఆశిష్ గుప్తా తరచూ తాగిరావడం భార్యతో ఘర్షణ పడటం సాధారణమైపోయింది. అదితి తన పరిస్థితికి తనలో తానే కుమిలిపోసాగింది.
ఆశిష్ చేసే బిజినెస్ లో కంపెనీలలో మిత్రుడైన సక్సేనాకు వాటా ఉంది కావున ఏ పని కూడా అతడికి తెలియకుండా జరిగేది కాదు.
ఒకరోజు అకౌంట్స్ అన్నీ సరిచూసుకుంటున్న సక్సేనా ఒక విభ్రాంతికరమైన విషయం తెలిసింది. అది ఆశిష్ తనకు తెలియకుండా దాదాపుగా కోటి రూపాయలు డ్రా చేశాడు. కానీ తనకు తెలియకుండా ఎందుకు డ్రా చేశాడో అర్థం కాని సక్సేనా ఆ విషయం తెలుసుకోవడానికి ఆశిష్ గుప్తా కాబిన్ లో అడుగుపెట్టాడు.
***
ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్న ఆశిష్ గుప్తా సక్సేనా ను చూసి తడబాటుగా ఫోన్ ఆఫ్ చేశాడు. అది చూసిన సక్సేనా ఏదో జరుగుతోంది అనుకుంటూ ఆశిష్ తో అదీ ఇదీ మాట్లాడుతూ బ్యాంకు నుండి కోటిరుపాయలు డ్రా చేసిన విషయం గురించి అడిగాడు. అది వినగానే ఆశిష్ గుప్తా ఏవో పొంతన లేని సమాధానాలు చెప్పి అక్కడనుండి వెళ్లిపోయాడు.
సక్సేనా కు మాత్రం ఏదో జరుగుతోందని రూఢి అయింది. అదేమిటో కనిపెట్టి తన స్నేహితుడిని రక్షించుకోవాలని నిశ్చయించుకున్నాడు.
***
ఆశిష్ గుప్తా మెల్లిగా తాగడానికి అలవాటు పడ్డాడు. బిజినెస్ చేయడం బాగా తగ్గిపోవడం మొదలైంది. ఇంట్లో భార్యతో ఘర్షణ పడటం సాధారణమైపోయింది.
ఒకరోజు తన కాబిన్ లో తాగి పడిపోయిన ఆశిష్ గుప్తాను సక్సేనా వాళ్ల ఇంటికి చేర్చి అదితికి జాగ్రత్తలు చెప్పి బయటకొచ్చాడు.
ఆ సమయంలో రూపాలి సక్సేనాను చూసి కంగారు పడటం సక్సేనా దృష్టి నుండి దాటిపోలేదు.
ఆ రోజు ఆశిష్ గుప్తా ఇంట్లో తన భార్యతో ఘర్షణ పడటం మొదలుపెట్టాడు. ఆ వేళ అటో ఇటో తేలిపోవాలన్న ఆశిష్ గుప్తా మాటలు అర్థంకాక అదితి ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా ఏం జరిగింది అని అడిగింది. ఆ మాటలకు పట్టరాని ఆవేశంతో అదితిని ఇంటి బయటకు నెట్టేశాడు.
తూలి ముందుకు పడిపోతున్న అదితిని కింద పడిపోకుండా ఎవరో పట్టుకున్నారు.
తనను పడిపోకుండా పట్టుకున్న వ్యక్తి ఎవరా అని కన్నీటితో మసకబారిన కళ్లతో చూడగా ఎవరో ఒక అపరిచితవ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి వెనుక సక్సేనా కనిపించాడు. అదితిని తీసుకుని వారిద్దరూ ఇంట్లోకి అడుగుపెట్టారు. వారిని చూసిన రూపాలి అక్కడనుండి తప్పుకుని బయటకెళ్లిపోయింది. అది చూసిన అపరిచిత వ్యక్తి కూడా వేగంగా బయటికెళ్లాడు.
అప్పటికే అక్కడున్న కమాండోలు రూపాలిని అరెస్టు చేసి సంకెళ్లు తగిలించారు. ఆ అపరిచిత వ్యక్తి సంకెళ్లు వేసిన రూపాలిని అదితి ఆశిష్ గుప్తా ల ముందు నిలబెట్టాడు. అది చూసి అదితి ఆశ్చర్యపోయింది. ఆశిష్ గుప్తా తాగిన మత్తు దిగిపోయింది.
అక్కడే ఉన్న సక్సేనా ఆ అపరిచిత వ్యక్తిని “డిటెక్టివ్ సిద్దార్థ ” గా పరిచయం చేశాడు.

. డిటెక్టివ్ సిద్దార్థ గారూ జరిగినదంతా ఆశిష్ కు వివరించండి అన్న సక్సేనా మాటలకు తలూపుతూ డిటెక్టివ్ సిద్దార్థ జరిగినదంతా చెప్పడం మొదలుపెట్టాడు.
“రూపాలిని పనిమనిషిగా పెట్టుకున్న తర్వాత ఆశిష్ ఇంటి పరిస్థితి మారిపోవడం మొదలైంది. ఖరీదైన సెల్ ఫోన్లు వాడటం అలవాటు చేసుకున్న రూపాలి ఆ ఫోన్లతో అదితికి తెలియకుండా అదితి ఫోటోలను తీసేది. దొంగచాటుగా అదితి ని ఎన్నో రకాలుగా ఫోటోలు తీస్తూ వాటిని తనతో చేతులు కలిపిన “ముఠా” కు అందచేసేది. ఆ ముఠా సభ్యులు ఆ ఫోటోలను “మార్ఫింగ్ ” చేసి ఆశిష్ గుప్తా కు పంపించి అతడిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజడం మొదలుపెట్టారు. అలా దాదాపు కోటి రుపాయలు వరకూ ఆశిష్ వద్దనుండి దోచుకున్నారు.
ఆ ఫోటోలు మార్ఫింగ్ అని తెలియని ఆశిష్ భార్య మీద అనుమానం పెంచుకుని ఇంట్లో గొడవలు పడుతూ తాగడం మొదలుపెట్టాడు. ఏం జరుగుతోందో తన భర్త ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాని అదితి ఫోన్ లో తన బాధంతా సక్సేనా కు వివరించింది అదితి అప్పటికే తన స్నేహితుడి ప్రవర్తనను గమనిస్తున్న సక్సేనాకు అనుమానం బలపడింది.
వెంటనే నన్ను కలిసి జరుగుతున్నదంతా నాకు వివరించాడు. నేను ఒక స్పై కెమెరాను సక్సేనాకు ఇచ్చి ఆశిష్ వాళ్లింట్లో అమర్చమని చెప్పానంటూ అక్కడే ఉన్న ఒక ఫ్లవర్ వేజ్ ను తీసి అందులో ఉన్న ఒక చిన్న వస్తువును బయటకు తీసి అందరికీ చూపాడు సిద్దార్థ.
ఆ కెమెరా ద్వారా రూపాలి నే ఇదంతా చేస్తోందని అర్థమైన
తర్వాత రూపాలి ఫోన్ ను ట్రాప్ చేయగా ముఠా సభ్యుల మాటల ద్వారా అదితి ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటి ద్వారా ఆశిష్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు తీసుకోవడం ఆరంభించారు.
అది తెలియని ఆశిష్ గుప్తా తన భార్య ఫోటోల గురించి బయటకు చెప్పుకోలేక డబ్బు పోగొట్టుకోవడమే కాక తాగుడు కు అలవాటు పడ్డాడు.
అని చెప్తున్న సిద్దార్థ మాటలు విని అదితి రూపాలిని కళ్లలో నిప్పులు కురిపిస్తూ చూసింది. తర్వాత ఆశిష్ గుప్తా తన భార్యకు క్షమాపణలు చెప్తుండగా అది చూసిన డిటెక్టివ్ సిద్దార్థ సక్సేనాలిద్దరూ బయటకు నడిచారు!!

( వచ్చేవారం మరో డిటెక్టివ్ కథ )

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

డిటెక్టివ్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY